EPAPER
Kirrak Couples Episode 1

Japanese Sleep Tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? ఈ జపనీస్ టెక్నిక్స్ తో వద్దన్నా కళ్లు మూతలు పడతాయ్!

Japanese Sleep Tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? ఈ జపనీస్ టెక్నిక్స్ తో వద్దన్నా కళ్లు మూతలు పడతాయ్!

Best Japanese Sleep Techniques: బిజీ లైఫ్ లో చాలా మంది కంటినిండా నిద్ర పోవడం లేదు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాల్సి ఉన్నా. ఎవరికీ అంత తీరిక ఉండట్లేదు. రోజుకు కనీసం 4 నుంచి 5 గంటలకు మించి నిద్రపోని వాళ్లు బోలెడు మంది ఉన్నారు. మరికొంత మంది నిద్రలేమి సమస్యతో నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం నిపుణులు సంప్రదాయ జపనీస్ పద్దతులను రికమండ్ చేస్తున్నారు. ఈ టెక్నిక్స్ పాటించడం వల్ల మెరుగైన నిద్రను పొందే అవకాశం ఉందంటున్నారు.


నిద్రను పెంచే 5 జపనీస్ టెక్నిక్స్

1. షిన్రిన్-యోకు- ఫారెస్ట్  బాతింగ్ 


షిన్రిన్-యోకు, అటవీ స్నానం అని కూడా పిలుస్తారు. అడవిలో లేదంటే సహజ వాతావరణంలో రోజూ కొంత సమయాన్ని గడపడాన్ని అటవీ స్నానం అంటారు. ప్రకృతి నుంచి లభించే ప్రశాంతత ఒత్తిడి స్థాయిని గణనీయంగా తగ్గించి చక్కటి నిద్ర వచ్చేలా చేస్తుంది. ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్‌ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, అడవులలో గడపడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. నిద్రకు అంతరాయం కలిగించే ఒత్తిడి హార్మోన్ తగ్గి చక్కగా నిద్రపడుతుంది.

2. జిన్ షిన్ జ్యుత్సు-ఎనర్జీ హీలింగ్

జిన్ షిన్ జ్యుత్సు అనేది జపనీస్ ఎనర్జీ హీలింగ్ టెక్నిక్. ఈ పద్దతిలో ఒత్తిడిని తగ్గించేందుకు శరీరంలోని పలు ప్రాంతాల్లో సున్నితంగా నొక్కుతారు. ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ యాక్టివ్ గా మారి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వెంటనే నిద్రపోయేలా సాయపడుతుంది.ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హీలింగ్ అండ్ కేరింగ్  అధ్యయనంలో జిన్ షిన్ జ్యుత్సు రోగులలో ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది. ఫలితంగా నాణ్యమైన నిద్ర లభిస్తున్నట్లు వెల్లడైంది.

3. అన్మా- జపనీస్ మసాజ్

అన్మా అనేది సాంప్రదాయ జపనీస్ మసాజ్ టెక్నిక్. ఇందులో ఒక పద్దతి ప్రకారం శరీరం మీద నొక్కుతారు.  ఇది కండరాల ఒత్తిడిని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరిచి నిద్రను ప్రోత్సహించేందుకు సాయపడుతుంది. జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్‌ లో ప్రచురించబడిన కథనం ప్రకారం అన్మా లాంటి మసాజ్ థెరపీ, నిద్రను నియంత్రించడంలో సాయపడే సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. నిద్రకు ముందు పావుగంటపాటు అన్మా సెషన్ నిర్వహించడం వల్ల చక్కటి నిద్ర ఏర్పడుతుంది.

4. మకురా- సరైన దిండును ఎంచుకోవడం

జపాన్‌లో మకురా అంటే దిండును ఎంచుకోవడం. జర్నల్ ఆఫ్ మానిప్యులేటివ్ అండ్ ఫిజియోలాజికల్ థెరప్యూటిక్స్    అధ్యయనం ప్రకారం, సరైన దిండును ఉపయోగించడం వల్ల మెడ, వెన్నెముక మీద భారం పడకుండా నిద్ర ఏర్పడుతుంది. సున్నితమైన దిండుతో మెరుగైన నిద్ర వస్తుందంటున్నారు నిపుణులు.

5. కైజెన్- నిద్రను పెంచుకునే ప్రయత్నాలు 

ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల నిద్రను పెంచుకోవచ్చు. ప్రతి వారం 10 నిమిషాల ముందు నిద్రపోవాలి. పడుకోవడానికి కొంత సమయం ముందు ఫోన్లు, టీవీలు  చూడ్డం మానేయాలి. పడుకునే ముందుకు కెఫీన్ లాంటి పదార్థాలను తీసుకోవద్దు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్  పరిశోధన ప్రకారం, నిద్ర అలవాట్లలో చిన్న మార్పులను చేసుకోవడం వల్ల మంచి నిద్రను పొందే అవకాశం ఉంటుంది.

Read Also:చౌకైన ఔషధంతో బ్రెయిన్ ట్యూమర్ మాయం, ప్రాణాంతక క్యాన్సర్ కు సరికొత్త డ్రగ్ కనుగొన్న పరిశోధకులు

Related News

SkinCare Tips: ఆరోగ్యవంతమైన, అందమైన చర్మం కోసం 6 యాంటీ ఏజింగ్ బ్యూటీ సీక్రెట్స్‌..

Diabetes: మధుమేహులు ప్రతిరోజూ ఈ పదార్థాలు ఆహారంలో ఉండేట్టు చూసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

Women Diet: 30 ఏళ్లు దాటిన మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

Beauty Tips: రోజ్ ఫ్లవర్‌తో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Sleeping on the stomach: నడుము నొప్పికి కారణం అయ్యే ఈ 4 సమస్యలు తెలిస్తే షాక్ అవుతారు

Face Mask: చియా సీడ్స్‌తో ఫేస్ మాస్క్.. మొటిమలు మాయం

Big Stories

×