EPAPER

Food Poisoning: ఈ ఆహారాలను సరిగా ఉడకించకుండా తింటే విషపూరితంగా మారిపోతాయి, జాగ్రత్త

Food Poisoning: ఈ ఆహారాలను సరిగా ఉడకించకుండా తింటే విషపూరితంగా మారిపోతాయి, జాగ్రత్త
Food Poisoning: కొన్ని ఆహారాలను ఉడికించి మాత్రమే తినాలి. కొన్నింటిని పచ్చిగా తిన్నా మంచిదే, కానీ ఎంతోమంది తెలియక తినకూడని ఆహారాలను కూడా పచ్చిగా, సరిగా ఉడికించకుండా తినేస్తున్నారు. కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తింటే ఎంతో మంచిదని చెప్పుకుంటారు. కానీ ఏవి పచ్చిగా తింటే ఆరోగ్యమో, వేటిని పచ్చిగా తినకూడదో మాత్రం ప్రజల్లో అవగాహన లేదు. పాక్షికంగా వండిన ఆహారాన్ని, పచ్చి ఆహారాన్ని కొన్నిసార్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం పచ్చిగా తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఇవి అంటు వ్యాధులను, అలెర్జీలను పెంచుతాయి.


గుడ్లు
గుడ్లను కొంతమంది పచ్చిగా తాగేస్తారు. కొన్నిసార్లు హాఫ్ బాయిల్ అంటే సగం మాత్రమే ఉడికించుకొని తింటారు. ఇలా చేయడం మంచిది కాదు. ఎన్నో అనారోగ్యాలకి పచ్చి గుడ్డు లేదా సగం ఉడికిన గుడ్డు కారణమవుతుంది. గుడ్డులో ప్రోటీన్ అధిక మొత్తంలోనే ఉంటుంది. కానీ తీవ్రమైన ఆహార ఎలర్జీలు, ఫుడ్ పాయిజన్ కి దారితీస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా అని పిలిచే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజన్‌కు కారణం అవుతుంది. కాబట్టి గుడ్డును తినాలనుకుంటే పూర్తిగా ఉడికించాకే తినండి. పచ్చి గుడ్డును తీసుకోకండి, అది మీ శరీరానికి పడకపోవచ్చు.

చికెన్
చికెన్ ను ఎవరూ పచ్చిగా తినరు, వండుకున్నాకే తింటారు. కానీ దీన్ని పూర్తిస్థాయిలో వండాక తింటేనే మంచిది. సగం ఉడికిన చికెన్ తింటే ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు వస్తాయి. కొంతమంది సమయం లేక 70 శాతం లేదా 80 శాతం చికెన్ ఉడికాక స్టవ్ కట్టేస్తూ ఉంటారు. అలాంటి చికెన్ లో బ్యాక్టీరియాలు ఇంకా సజీవంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాక్షికంగా ఉడికిన చికెన్‌ను తినడం మంచి పద్ధతి కాదు. ఇది అనేక రకాల రోగాలను మీకు తెచ్చిపెడుతుంది.


బంగాళాదుంపలు
బంగాళాదుంపలు పచ్చిగా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. అలా తింటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. బంగాళదుంపల్లో ఉండే సోలనిన్ అని పిలిచే విషపూరిత సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో చేరితే వికారం, నరాల సంబంధిత రోగాలు, తలనొప్పి అధికమైపోతాయి. బంగాళదుంపలను ఎప్పుడైతే బాగా ఉడికిస్తారో ఆ సమయంలో సోలనిన్ అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. అప్పుడు బంగాళదుంపలు సురక్షితమైనవిగా మారుతాయి. కాబట్టి బంగాళదుంపలను సగం ఉడికించి తినడం కూడా మంచి పద్ధతి కాదు.

Also Read: జుట్టుకు చుండ్రు పట్టిందా? షాంపూలు వాడకుండా ఇంట్లోనే ఈ సులభమైన పద్ధతులతో వదిలించేయండి

కిడ్నీ బీన్స్
కిడ్నీ బీన్స్ ను రాజ్మా అని కూడా పిలుస్తారు. వీటిని కూడా పచ్చిగా తినడం లేదా సగం ఉడికించి తినడం మంచి పద్ధతి కాదు. వీటిలో ఫైటో హేమాగ్లుటినిన్ అనే టాక్సిన్ ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన వికారం, వాంతులు వంటి సమస్యలు కనిపిస్తాయి. సగం ఉడికించిన కిడ్నీ బీన్స్ తిన్నా కూడా అవి విషపూరితం కావచ్చు. కాబట్టి రాజ్మాను బాగా ఉడికించాకే వాటిని తినాలి. అప్పుడే అందులో ఉండే టాక్సిన్లు తటస్థీకరణం జరుగుతుంది.

బ్రకోలి
బ్రకోలీ లేదా కాలీఫ్లవర్.. ఈ రెండూ ఒకే జాతికి చెందినవి. వీటిని కూడా చాలా తక్కువగా ఉడికించి తింటూ ఉంటారు. ఈ రెండూ కూడా క్రూసిఫెరస్ కూరగాయల జాతికి చెందినవే. కాలీఫ్లవర్,బ్రకోలీ… రెండూ కూడా థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. వీటిని బాగా ఉడికించాక తినడమే మంచిది. కాలీఫ్లవర్ ను వండుకొని తింటారు. కానీ బ్రకోలిని దాదాపు పచ్చిగా తింటూ ఉంటారు. ఇది థైరాయిడ్ ఉన్న వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రెండింటినీ కూడా బాగా ఉడికించాకే తినడం అలవాటు చేసుకోవాలి.

పుట్టగొడుగులు
పుట్టగొడుగుల పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. కానీ పుట్టగొడుగులు చాలా జాగ్రత్తగా తినాల్సిన అవసరం ఉంది. వీటిలో కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. పుట్టగొడుగులు క్యాన్సర్ కారక సమ్మేళనాలని కూడా కలిగి ఉంటాయి. కాబట్టి పుట్టగొడుగులను బాగా ఉడికించాక తినడం చాలా మంచిది. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. సగం ఉడికిన పుట్టగొడుగులను తింటే అనేక రకాల చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వీలైనంతవరకు పుట్టగొడుగులను ఎక్కువసేపు వండాకే తినేందుకు ప్రయత్నించండి.

చేపలు
చేపలను కూడా కొంతమంది తెలియక పాక్షికంగా వండి తినేస్తూ ఉంటారు. ఇలా తింటే మీకు వెంటనే రియాక్షన్ ఆ రోజే కనిపిస్తుంది. వాటిని పాక్షికంగా వండి తినడం వల్ల కొన్ని రకాల పరాన్న జీవులు శరీరంలో చేరుతాయి. అవన్నీ కూడా శరీరంలో తిష్ట వేసుకొని కూర్చుని అనేక అనారోగ్యాలకి కారణం అవుతాయి. చేపలను పూర్తిగా ఉడికించాకే తింటే ఎలాంటి సమస్యలు రావు. చేపల్లో ఉండే సూక్ష్మజీవులు, పరాన్న జీవులు నశించాలంటే వాటిని ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం ఉంది.

Related News

Face Serum: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

×