EPAPER
Kirrak Couples Episode 1

Fish: చేపలు తింటే కలిగే అద్భుతాలు ఇవే

Fish: చేపలు తింటే కలిగే అద్భుతాలు ఇవే

సీ ఫుడ్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చేపలే. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా చెరువుల్లో చేపల్ని తింటారు. నిజానికి చెరువులతో పాటు సముద్రపు చేపలు కూడా తినాలి. చేపలను వారానికి రెండు లేదా మూడుసార్లు తింటే ఎన్నో అద్భుతమైన లాభాలు ఉంటాయి. సాధారణంగా వయసు మీద పడే కొద్దీ మతిమరుపు రావడం సహజం. కొందరికి ఇది తీవ్రంగా మారి అల్జీమర్స్‌కు దారితీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల దాని నుంచి బయటపడవచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. చేపలను నిత్యం తినడం వల్ల మన మెదడు బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. రక్తనాళాల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఇవి కాపాడుతాయి. చేపలను నిత్యం తినడం వల్ల వాటిలో ఉండే డొపమైన్‌, సెరోటోనిన్‌ అనే హార్మోన్లు డిప్రెషన్ తగ్గిస్తాయి. అంతేకాకుండా ఒత్తిడి, మానసిక ఆందోళనలు కూడా తక్కువ అవుతాయి. చేపల్లో ఉండే 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్లనొప్పులను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా పెద్ద పేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ లాంటి ఎన్నో క్యాన్సర్లను సమర్ధవంతంగా అడ్డుకుంటాయి. స్త్రీలలో రుతుక్రమం సరిగా ఉండాలంటే చేపలను తరచూ తినాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా షుగర్, బీపీ, మెదడు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ చేపల్లో చలికి తట్టుకునేలా చేసే నూనెలు కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. దాంతో చలి వల్ల వచ్చే నొప్పుల నుంచి మనల్ని కాపాడుతాయి. శరీరంలోని ప్రతి కణానికి సరిపడా ప్రోటీన్‌ని ఈ చేపలు అందిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అంతేకాకుండా కడుపులో మంట, వేడి తగ్గుతుంది.


Tags

Related News

Homemade Hair Oils: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

Cucumber Juice: దోసకాయ జ్యూస్‌‌తో సమస్యలన్నీ పరార్ !

Turmeric For Skin: ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు.. మెరిసిపోతారు

Sleep deprivation liver damage: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..

Healthy Foods: సోయాబీన్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు..

Tomato and Potato Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే !

Hair Growth Tips: ఇవి వాడితే చాలు జుట్టు ఊడమన్నా.. ఊడదు

Big Stories

×