EPAPER
Kirrak Couples Episode 1

Brain Health: మీ మెదడును రహస్యంగా దెబ్బతీసే రోజువారీ అలవాట్లు ఇవే, ఇప్పటినుంచి మానేయండి

Brain Health: మీ మెదడును రహస్యంగా దెబ్బతీసే రోజువారీ అలవాట్లు ఇవే, ఇప్పటినుంచి మానేయండి

Brain Health: ఆధునిక కాలంలో మెదడు ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. తక్కువ నిద్ర, పోషకలేమి, ఆల్కహాల్, ధూమపానం వంటి చెడు అలవాట్లు మెదడును చాలా దెబ్బతీస్తాయి. వీటితో పాటు మనకు తెలియకుండా మనం చేసే కొన్ని రోజువారీ అలవాట్లు కూడా మెదడు ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తున్నట్టు తెలుస్తోంది.


గంటలు గంటలు కూర్చుంటే..

ఒకే చోట కదలకుండా గంటలు గంటలు కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఇలా శారీరక శ్రమ తగ్గడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వంటివి కూడా తగ్గిపోతాయి. ఇది మెదడులో న్యూరాన్ల పుట్టుకను తగ్గిస్తుంది. దీనివల్ల మెదడు సక్రమంగా పనిచేయలేదు. వ్యాయామం లేకపోవడం వల్ల మానసిక సామర్థ్యం మందకొడిగా సాగుతుంది. అభిజ్ఞా క్షీణత ఎక్కువగా ఉంటుంది. ఎండార్పిన్లు తగిన స్థాయిలో ఉత్పత్తి కావు. దీనివల్ల ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ప్రతిరోజూ గంటసేపు వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి, లేదా తేలికపాటి వ్యాయామాలైనా చేయండి.


సౌండ్ పెంచితే.. మైండ్ మాటాషే

ఇప్పటి యువతకు బిగ్గరగా సంగీతాన్ని వినడం అలవాటు. ఇలా వినడం వల్ల వినికిడి సమస్య వస్తుందని అందరికీ తెలిసిందే. మీకు తెలియని విషయం ఏంటంటే బిగ్గరగా టీవీ సౌండ్లు, ఫోన్ సౌండ్లు పెట్టుకొని వినడం వల్ల ఒత్తిడి స్థాయిలు పెరిగిపోతాయి. ఇది మెదడుపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మెదడులోని ఒక భాగం దృష్టి, జ్ఞాపకశక్తిని నియంత్రించడానికి పనిచేస్తుంది. ఆ భాగం అధిక శబ్ధంతో సంగీతం వినడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచేస్తుంది. ఇది మానసిక ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి కేవలం వినికిడి సమస్యలు వస్తాయన్న భయమే కాదు, మెదడు ఆరోగ్యం చెడిపోతుందన్న భయంతో కూడా మీరు పెద్ద పెద్ద శబ్దాలను వినకూడదు. సంగీతాన్ని కూడా సాధారణ స్థాయిలోనే పెట్టుకొని వినాలి.

స్వీట్ కాదు పాయిజన్

చక్కెర నిండిన పదార్థాలు అంటే మీకు ఇష్టమా? అయితే మీ మెదడు ఆరోగ్యాన్ని మీరే పాడు చేస్తున్నట్టు. చక్కెర తినడం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతారు. నేర్చుకోవాలన్న సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఏకాగ్రత తగ్గిపోతుంది. చక్కెరతో నిండిన ఆహారాలు అధికంగా తినడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి తీపి పదార్థాలు ముఖ్యంగా పంచదారతో చేసిన పదార్థాలను ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక రుగ్మతల బారిన పడకుండా ఉండాలంటే పంచదార వినియోగాన్ని తగ్గించండి.

ఇంట్లోనే కూర్చోకండి.. అలా సూర్యుడిని పలకరించండి

నిత్యం ఇంట్లోనే ఉండడం వల్ల మీ శరీరానికి విటమిన్ డి లభించదు. ఇది కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. తద్వారా మెదడులో సెరటోనిన్, మెలనిన్ వంటి హార్మోన్లు మూడ్ నియంత్రణకు అవసరమైనవి. వీటి ఉత్పత్తి మారిపోతుంది. మీ మెదడు సరిగా పనిచేయలేదు. సూర్య రశ్మి శరీరానికి తాకడం వల్ల సెరటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. అప్పుడు మీరు మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి రోజు సూర్య రశ్మి తగిలేలా ఒక అరగంట పాటు ఎండలో నిలుచుని రండి. ఇది చాలా ఉత్తమ పద్ధతి.

నీళ్లు తక్కువ తాగినా..

ఎంతోమంది నీరు తక్కువగా తాగుతూ ఉంటారు. టాయిలెట్‌కు పదే పదే వెళ్లాలన్న ఆలోచనతో నీరు తక్కువ తాగే వారికి ఇది ఒక హెచ్చరిక. డిహైడ్రేషన్ సమస్య అనేది మెదడుపై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మీ ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. మీరు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మానసిక స్పష్టత తగ్గుతుంది. హైడ్రేషన్ స్థాయిల్లో మార్పులు వస్తే మెదడు తట్టుకోలేదు. కాబట్టి మెదడు ఆరోగ్యం కోసం మీరు ఎక్కువ నీటిని తాగాల్సిన అవసరం ఉంది. మీలో నిర్జలీకరణం అనేది ఒత్తిడి స్థాయిలను పెంచుతుందని అభిజ్ఞా పనితీరును తగ్గిస్తుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. కాబట్టి మీరు మానసికంగా, చురుగ్గా ఉండదలుచుకుంటే ప్రతిరోజు అధిక స్థాయిలో నీటిని సాగండి.

Also Read: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

ఒత్తిడితో మెదడు చిత్తడి

ఒత్తిడి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. దీర్ఘకాలిక ఒత్తిడి అనేది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ముఖ్యంగా మెదడులో ప్రముఖ ప్రాంతమైన హిప్పోకంపాస్ ను దెబ్బతీస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తితో పాటూ నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. కాబట్టి దీర్ఘకాలిక ఒత్తిడిని వదిలి ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించండి.

Related News

Rice cream for face: ఖరీదైన ఫేషియల్స్ అవసరం లేదు, ఇంట్లోనే ఈ రైస్ క్రీమ్ తయారు చేసుకోండి, చర్మం మెరిసిపోతుంది

Bed Room Problems: బెడ్రూంలో డీలా పడుతున్నారా? ఈ ఆకుకూరతో రేసు గుర్రంలా రెచ్చిపోవచ్చు తెలుసా?

Vegetable pulao: నూనె అవసరం లేకుండా వెజిటబుల్ పులావ్ ఇలా చేసేయండి, ఇది ఎంతో హెల్తీ రెసిపీ

Ghee Purity Check: కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి ?

Turmeric Benefits: పసుపుతో అద్భుతాలు.. ఈ సమస్యలన్నీ దూరం

Tomato Face Packs: టమాటోతో గ్లోయింగ్ స్కిన్..

Big Stories

×