EPAPER

Rare Animals in Pakistan: పాకిస్తాన్‌లో మాత్రమే కనిపించే జంతువులు!

Rare Animals in Pakistan: పాకిస్తాన్‌లో మాత్రమే కనిపించే జంతువులు!
Pakistan Rare Animals

Pakistan Rare Animals:


ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో రకరకాల జనాభా ఉన్నట్లుగానే జంతువులు కూడా ఉంటాయి. అంతేకాదు ఒక్కోదేశంలో ఒక్కో జాతికి చెందిన జీవాలు ప్రాధాన్యత పొందుతాయి. భారతదేంలో బెంగాళ్ టైగర్లు ఉన్నాయి. చైనాలో పాండాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కంగారులు ఉన్నాయి. ఈ తరహాలోనే పాకిస్తాన్‌లో కొన్ని జంతువులు ఉంటాయి. అంతే కాదు కొన్ని జంతువులు పాకిస్తాన్ దేశంలో మాత్రమే కనిపిస్తాయి. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మనం కూడా అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పాకిస్తాన్‌లో మాత్రమే కనిపించే అడవి జంతువుల్లో మొదటిగా మార్ఖోజ్ అనే మేక ఉంటుంది. ఇది పాక్ జాతీయ జంతువు కూడా. ఇవి హిమాలయాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మేక పాములకు తొలి శత్రువని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఇది తరతరాలుగా వస్తుంది. మీరు గుర్తించినట్లయితే పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ చిహ్నంలో కూడా ఈ అడవి మేక మార్ఖోజ్ కనిపిస్తుంది.


పాకిస్తాన్‌లో మాత్రమే కనిపించే మరో జంతువు.. బ్లైండ్ డాల్ఫిన్. సింధు నదిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశంలో కనిపించే డాల్ఫిన్‌లకు పాకిస్తాన్‌ డాల్ఫిన్‌‌లోని తల ఆకారంలో వ్యత్యాసం ఉంటుంది. పాకిస్తాన్‌ డాల్ఫిన్‌లకు తలభాగం పొడవుగా.. పళ్లు బయటకు కనిపిస్తూ ఉంటాయి.

అడవి పల్లి శాండ్ క్యాట్ ఇది కూడా పాకిస్థాన్ దేశంలో మాత్రమే కనిపిస్తుంది. ఇవి కేవలం పాకిస్తాన్‌లోని ఎడారి ప్రాంతాల్లోనే నివశిస్తాయి. పెంపుడు క్యాట్‌లకు వీటికి కొంత తేడా ఉంటుంది. శాండ్ క్యాట్‌లు శరీరంగా నిండుగా బొచ్చును కలిగి ఉంటాయి. శాండ్ క్యాట్‌లు పాకిస్తాన్‌ ఎడారుల్లో మాత్రమే జీవించగలవు.

తర్వాత గ్రే గోరాల్ జింక. ఇవి పాకిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఈ జింక చూడటానికి కంగారులా కనిపిస్తుంది. రెండు చెవులకు మధ్యలో కొమ్ములు ఉంటాయి. ఈ గ్రే గోరాల్ జింక్ పాకిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే దర్శనమిస్తాయి.

పాకిస్తాన్‌లో మాత్రమే కనిపించే మరో జంతువు అడవి మేక చిల్టన్ వైల్డ్ గోట్.ఇది కొండ గుటల్లో మాత్రమే జీవిస్తుంది. చిల్టన్ వైల్డ్ గోట్ కొమ్ములు చాలా భయంకరంగా పొడవుగా మెలికలు తిరిగి ఉంటాయి.

పాకిస్తాన్‌లో కనిపించే మరో జంతువు సింధ్ ఐకాన్స్. ఇది జింక జాతికి చెందింది. వీటిని తుర్క్‌మన్ అడవి మేకలకు అని పిలుస్తారు. ఈ మేకలు కిర్తార్ పర్వత సానువుల్లో మాత్రమే కనిపిస్తాయి.

చివరిగా ఈ జాబితాలోకి వచ్చే మరో జంతువు స్నో లెపర్డ్. ఇది ఉత్తర పాకిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. చూడటానికి చిరుతను పోలి ఉంటుంది.

Related News

Soaked Peanuts: వీటిని తరచూ నానబెట్టుకుని తింటే బాదం కూడా పనికి రాదండోయ్..

Jeera Water Benefits: జీలకర్ర నీటితో.. మీ అనారోగ్య సమస్యలన్నీ పరార్ !

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Vitamin B12 Deficiency: ఈ 5 లక్షణాలు మీలో ఉంటే.. విటమిన్ B12 తగ్గినట్లే !

Onion Juice For Hair: వీటిని జుట్టుకు రాస్తే.. ఊడమన్నా ఊడదు !

How Much Sleep Do You Need: మీ వయస్సు ఎంత? ఈ ఏజ్‌లో మీకు ఎంత నిద్ర అవసరమో తెలుసా? ఇది పాటించకపోతే పైకిపోతారట!

Sprouted Ragi Benefits: మొలకెత్తిన రాగులతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు..

×