EPAPER

Animals : ఈ జంతువులు రాత్రి కూడా వేటాడతాయి..!

Animals : ఈ జంతువులు రాత్రి కూడా వేటాడతాయి..!

Night Hunting Animals : భూమిపై జీవించే ప్రతి జీవికి ఆకలి అనేది సాధారణం. ఆకలి తీర్చుకునేందుకు ఈ జీవులు వాటి జీవనశైలి ఆధారంగా రకరకాల ఆహార పదార్థాలను ఆరగిస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని జీవులు శాఖాహారులుగా ఉంటే.. మరికొన్ని జీవులు పూర్తిగా మాంసాహారాన్నే భుజిస్తాయి. మొక్కుల, సముద్రంలో ఉండే శైవలాలు, శిలీంద్రాలను మినహాయిస్తే మిగిలినవి అన్నీ కూడా మిగతా వాటిపై ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఆకలి తీర్చుకోవడం కోసం ఆధారపడతాయి.


ఇలాంటి జంతువుల్లో కొన్ని రాత్రిపూట వేడటతాయి. ఆ వేట ద్వారానే వాటి ఆకలిని తీర్చుకుంటాయి. పగటిపూట సూర్యుడి కాంతి వల్ల వాతావరణం పారదర్శకంగా ఉంటుంది. కాబట్టి జంతువులు వేటాడేందుకు పగలు వీలుగా ఉంటుంది. చీకట్లో మాత్రం వేటాడటం అసాధ్యమే. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే జంతువులు చీకటిలోనే వేటాడతాయి. అవేంటో తెలుసుకుందాం.

గుడ్లగూబ నిశాచార, మాంసాహార జీవి. ఇది పగలు మొత్తం విశ్రాంతి తీసుకొంటుంది. రాత్రి సమయంలో మాత్రమే వేటాడుతుంది. వీటి కళ్లలో ఉండే ప్రత్యేక నిర్మాణం వల్ల అది పగలు కూడా స్పష్టంగా చూడగలుగుతుంది. అంతేకాకుండా తన తలను 270 డిగ్రీల వరకు తిప్పి చూడగలదు. ప్రధానంగా గుడ్లగూబలు పంటల కోతల కాలంలో ఎక్కువగా వేటాడుతాయి. ఎందుకంటే ఆ సమయంలో పురుగులు బయటకు వస్తాయి.


పులి రాత్రిపూట స్పష్టంగా చూడగలుగుతుంది. దీని కళ్లు కూగా రాత్రిళ్లు మిలమిలా మెరుస్తుంటాయి. అందుకే ఇది చీకట్లో కూడా వేటాడగలుగుతుంది. ఇది వేటాడిన జంతువును నోటితో పట్టుకొని దూరంగా తీసుకెళ్లి తింటుంది.

గబ్బిలం పూర్తిగా మాంసాహార జీవి. ఇది రెక్కల సహాయంతో ఎగర కలుగుతుంది. వేట కోసం ఎంత దూరమైనా వెళుతుంది. చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఇవి గుంపుగా జీవిస్తాయి. ఆహారాన్ని వెతుకుంటూ భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి గబ్బిలాలను జీవశాస్త్ర పరిభాషలో పరాన జీవుల ప్రాథమిక అతిథులని చెబుతారు.

నక్కకు చీకటిలో వేటాడే సామర్థ్యం ఉంది. ఇవి గుంపులుగా తిరుగుతూ కంటపడిన జంతుపై ఒక్కసారిగా మీద పడిపోతాయి. వీటికి నోటిలో పదునైన దంతాలు ఉంటాయి. వాటితోనే ఎదుటి జంతువు శరీరాన్ని చీల్చుతాయి.కఠినమైన చీకట్లోనూ నక్క కళ్లు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి.

తోడేళ్లు వేట చాలా క్రూరంగా ఉంటుంది. వీటికి అత్యంత పదునైన పళ్లు ఉంటాయి. ఇవి ఒకేసారి ఎదుట పడిన జంతువుపై దాడి చేస్తాయి. ఇవి గుంపులుగా సంచరిస్తాయి. ఒక్కో తోడేలు ఒక్కో భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లడంతో ఆ జంతువు వెంటనే కన్నుమూస్తుంది. కన్నుమూసిన వెంటనే ఇవి ఈలలు వేస్తూ మాంసాన్ని ఆరగిస్తాయి. పులి, సింహం లాంటి జంతువులు కూడా తోడేళ్ల మందను చూసి భయపడతాయి.

పులి చీకట్లోనూ అత్యంత క్రూరంగా వేటాడగలిగే జంతువు. దీని కళ్లు చీకట్లోనూ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఇవి ఇతర జంతువులపై భయంకరంగా దాడి చేస్తాయి. పులి పదునైన దంతాలతో మెడను నోటితో పట్టుకొని చంపుతుంది. అనంతరం దాని మాంసాన్ని చీల్చి చీల్చి తింటుంది. వాసన ద్వారా ఇతర జంతువుల జాడను పులుతు సులభంగా పసిగడతాయి.

భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో హైనాలు కూడా ఉంటాయి. ఈ జంతువుల కళ్లు చీకట్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి క్రూరంగా దాడి చేస్తాయి. వీటి పదునైన దంతాలతో ఇతర జంతువులను ఊరికనే చంపేస్తాయి. పులులు, సింహాలు చంపేసిన జంతువులను వాటి నుంచి లాగేసుకోవడానికి కూడా ఇవి వెనుకాడవు.

Tags

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×