EPAPER

Tomato : టామాటాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయా..?

Tomato : టామాటాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయా..?
Tomato
Kidney Stones

Tomato Causes Kidney Stones : నిజానికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, నాన్‌వెజ్ ఎక్కువగా తినడం, అవుట్ సైడ్ ఫుడ్ తినడం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌లో చాలా వస్తాయి. కానీ కొందరు టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయని చెబుతుంటారు. టమాటా తినాలన్న అదేదో విషంలా చూస్తుంటారు. అది తినే ఆహారంలో కనిపించినా తీసి పక్కనపెడుతుంటారు.


మనం రోజూ తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఏదైనా ఒక కర్రీ ఉండాలి. ఇందు కోసం మార్కెట్‌కు వెళ్లి రకరకాల కూరగాయలు తెచ్చుకుంటాం. అయితే చాలామంది మాంసాహారాలు శరీరానికి అధిక శక్తి ఇస్తాయని భావిస్తుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే కూరగాయల్లో ఉండే ప్రోటీన్లు, పోషకాల వేటిలో కూడా లభించవు. వీటిలో టామాటాలు ముఖ్యమైనవి.

టమాటాలు వేయకుండా వండని వంటకం ఉండదు. టమాటా కర్రీ కూడా చేయడం చాలా ఈజీ. అందువల్ల కొందరు ఎక్కువ శాతం టామాట కర్రీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. టమాటా ఇగురు ఓసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే టమాటా పప్పు, టామాటా రైస్, టామాటా బాత్ ఇంకా రకరకాల కర్రీస్‌లో టమాటాలను వినియోగిస్తారు. అయితే అసలు మ్యాటర్‌లోని వస్తే.. టమాటాలు ఎక్కువగా తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా? దీనిలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం.


Also Read : బీరు లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. వేసవిలో దాహం తీరేలా తాగుడే తాగుడు!

కిడ్నీలు శరీరంలోని రక్తాన్ని వడబోస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా శుద్ధి అయిన రక్తం ఇతర అవయవాల్లోకి వెళ్తుంది. మలినాలను మూత్రాశయం ద్వారా బయటకు పంపుతాయి కిడ్నీలు. అయితే ఈ క్రమంలోనే ఆహారంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని మలినాలు ఏర్పడి స్పటికంలా తయారవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి పెద్దగా అయి మూత్రాశయం ద్వారా బయటకు వెళ్లకుండా ఆగిపోతాయి. దీంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో టమాటాల ప్రమేయం లేదు.

వాస్తవానికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన శరీరతత్వాన్ని బట్టి కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. కానీ కేవలం టామాటాలు తినడం వల్లనే కిడ్నీలు ఏర్పడుతాయనేది చెప్పలేమని కొందరు నిపుణులు అంటున్నారు. కానీ కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారు మాత్రం పాలకూర, టామాటాలకు దూరంగా ఉండాలి. ఇవి తినడం వల్ల కిడ్నీల్లోని రాళ్లపై ప్రభావం పడుతుంది.

Also Read : పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది..?

అంతేగానీ.. కిడ్నీల్లో ఎటువంటి సమస్య లేని వారు హాయిగా టమాటాలను తినొచ్చు. టామాటాలు తినడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్య రాదు. అంతేకాకుండా ఇవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. టమాటాను కేవలం కర్రీగానే కాకుండా రకరకాల డిషేష్ తయారీలో ఉపయోగిస్తారు. ఫిజాహాట్‌లో టమాటాలను ఎక్కువగా వాడుతుంటారు. అందువల్ల టమాటాల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు.

Disclaimer: ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే చూడండి.

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×