EPAPER

Beetroot : బీట్ రూట్‌ను అదే పనిగా తింటున్నారా.. దీని వల్ల ప్రమాదం కూడా ఉందండోయ్..

Beetroot : బీట్ రూట్‌ను అదే పనిగా తింటున్నారా.. దీని వల్ల ప్రమాదం కూడా ఉందండోయ్..

Beetroot : బీట్ రూట్ అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు. అంతేకాదు ముఖ్యంగా చర్మ సౌందర్యానికి కూడా బీట్ రూట్ తోడ్పడుతుందని భావిస్తారు. ఈ తరుణంలో బీట్ రూట్ జ్యూస్ తాగడం, బీట్ రూట్ తినడం, దాని పొడి లేదా రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.


అంతేకాదు బీట్ రూట్ తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. శరీరంలో రక్త ప్రసరణ పెరగడానికి కూడా బీట్ రూట్ సహాయపడుతుంది. మరోవైపు హిమోగ్లోబిన్, ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి కూడా బీట్ రూట్ సహకరిస్తుంది. అందువల్ల బీట్ రూట్ తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే బీట్ రూట్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అంతే నష్టాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీలో రాళ్లు :


బీట్ రూట్ తరచూ తినడం వల్ల కిడ్నీలకు ఎఫెక్ట్ అవుతుందట. బీట్ రూట్ లో ఉండే ఆక్సలేట్ వంటివి కిడ్నీలో రాళ్లను ఏర్పరచేలా చేస్తుంది. ఇది మూత్రంలోని ఆక్సలేట్ విసర్జనను పెంచి కాల్షియం ఆక్సలేట్ రాళ్లను ఏర్పరచేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

నరాల సమస్యలు :

డయాబెటిక్ పేషెంట్స్ బీట్ రూట్ తినడం వల్ల నరాల సమస్యలు ఎదురవుతాయి. నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. శరీరంలో ఫైబర్ స్థాయి తగ్గిపోయి గ్లైసెమిక్ లోడ్ పెరుగుతుంది.

అలెర్జీ సమస్య :

బీట్ రూట్ తరచూ తినడం వల్ల అలెర్జీ వస్తుంది. అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో సున్నితత్వం ఏర్పడుతుంది. అలర్జీతో పాటు గొంతు సమస్యలు కూడా ఏర్పడతాయి.

చర్మ దద్దుర్లు :

బీట్ రూట్ తగిన మోతాదు కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. పిత్తాశయ రాళ్లు, చలి, జ్వరం వంటి వాటితో సమస్యలు ఏర్పడతాయి.

Related News

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×