EPAPER

Pets : పెంపుడు జంతువులు అంటే ఇష్టమా?.. డేంజర్ డిసీజెస్!

Pets : పెంపుడు జంతువులు అంటే ఇష్టమా?.. డేంజర్ డిసీజెస్!

Pets


Pets Diseases Zoonotic : పెట్స్‌ను పెంచుకోవడం ఈ మధ్య కాలంలో ట్రెండ్‌‌గా మారింది. ఒకప్పుడు సంపన్న కుటుంబాలకే పరిమితమైన ఈ కల్చర్.. ఇప్పుడు ప్రతి గడపకు చేరింది. మనిషికి జంతువులకి ఉన్నటువంటి సంబంధం ఈ నాటిది కాదు. ఇంకా చెప్పాలంటే పెట్స్‌ను కొందరు సంతోషం కోసం, ఇంకొందరు వ్యాపారం కోసం, మరికొందరు రక్షణ కోసం, సంతోషం కోసం పెంచుకుంటారు.

ఇందులో భాగంగా చాలా మంది కుక్కలు, పిల్లులు, చిలుకలు వంటి వాటిని ఇష్టంగా పెంచుకుంటున్నారు. మనసు బాగోలేకపోయినా,ఏమీ తోచకపోయినా, బోర్‌ కొట్టినా.. పెట్స్‌ తో కాసేపు ఆడుకుంటే ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా అవి మన దగ్గరుంటే మంచి ఫ్రెండ్‌ తోడున్నట్లుగా ఉంటుంది.


అయితే ఇవన్నీ కాస్త పక్కనపెడితే మీరు ప్రాణంగా పెంచుకునే.. పెట్స్ వ్యాధులు వ్యాప్తి చేస్తాయని మీకు తెలుసా? ప్రతీ జంతువు నుంచి మనుషులకు బోలెడన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పెట్స్‌ నుంచి రోగాలను జూనోటిక్ వ్యాధులు అంటారు.

READ MORE : స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

ఈ వ్యాధులు జంతువులు లేదా పక్షులు కొరకడం, నాకడం, లాలాజలం, చుండ్రు ద్వారా రకారకాల
బ్యాక్టీరియా, వైరస్‌లు స్ప్రెడ్‌ అవుతాయి. చాలామంది పెట్స్‌కు ఎప్పుటికప్పడు వ్యాక్సిన్స్‌ చేయిస్తారు. అయినప్పటికీ.. పెట్స్ నుంచి పెంపుడు జంతువుల నుంచి కొన్ని వ్యాధులు మనుషులకు సోకుతాయి. పెట్స్‌ నుంచి మనుషులకు ఎలాంటి వ్యాధులు వస్తాయో చూద్దాం..

రింగ్‌వార్మ్‌ , టేప్‌వార్మ్‌

రింగ్‌వార్మ్, టేప్‌వార్మ్‌ అనే డిసీజ్ ఈగ ద్వారా వ్యాపిస్తుంది.పెంపుడు జంతువు వ్యాధి సోకిన ఈగను తిన్నప్పుడు.. ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మేకలు, కుక్కుల, పిల్లులో ఎక్కువగా ఈ వ్యాధులు కనిపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ చాలా చిన్నవే అయినా.. ఇంట్లో గర్భిణీ, చిన్నారులు ఉంటే వారిపై త్వరగా ప్రభావం చూపుతుంది.

టాక్సోప్లాస్మోసిస్

ఈ వైరస్ పిల్లులు నుంచి వ్యాప్తిస్తుంది. సాధారణంగా పిల్లులలో ఉండే గోండి అనే పారాసైట్‌ ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ వస్తుంది. ఎలుకలు ఎక్కువగా పారాసైట్స్‌ బారినపడతాయి. పిల్లులు ఎలుకలను తినడం వల్ల ఈ వ్యాధి వాటి నుంచి పిల్లులకు వ్యాపిస్తుంది. గర్భిణీలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు త్వరగా టాక్సోప్లాస్మోసిస్ బారినపడతారు. కాబట్టి పిల్లులను పెంచకపోడం మంచిది.

ప్యారెట్‌ ఫీవర్‌, పిట్టకోసిస్‌

మీరు చిలుక ప్రేమికులు అయితే వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిలుకలు క్లామిడోఫిలా అనే బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్‌ అయ్యి.. మనుషులకు ప్యారెట్‌ ఫీవర్‌ లేదా పిట్టకోసిస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్‌ అయిన చిలుకల రెట్టలు పీల్చినప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఫీవర్, చలి, దగ్గు, బాడీ పెయిన్స్ వస్తాయి. మీ ఇంట్లో చిలుక ఉంటే పంజరాన్ని, అవి తిరిగే ప్రాంతాన్ని ప్రతిరోజూ శుభ్రం చేయండి.

రేబిస్‌

రేబిస్ కుక్కు కాటు వల్ల వస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధి. కుక్కలాలాజలం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దేశంలో రేబిస్‌తో ఏటా 20వేల మంది మరణిస్తున్నారు. రేబిస్‌కు చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. పెంపుడు కుక్కలకు టైమ్‌కు టీకాలు వేయించడం ద్వారా రేబిస్‌ ప్రమాదాన్ని తగ్గించొచ్చు.

లెప్టోస్పిరోసిస్

లెప్టోస్పిరోసిస్ వాస్తవానికియూరిన్‌ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ కుక్కలు, ఎలుకలు నుంచి సోకుతుంది.లెప్టోస్పిరోసిస్ బ్యాక్టీరియా.. నీరు, నేలలో నెలల తరబడి నివసించగలదు. ఈ కుక్క అదే మట్టిలో ఆడితే ఆ వ్యాధి వ్యాప్తి చేయగలవు. దీని కారణంగా జ్వరం, వాంతులవుతాయి. వైద్యం విషయంలో ఆలస్యం చేస్తే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఇతర జంతువులు ద్వారా వచ్చే వ్యాధులు..

  • మేకలు – రింగ్‌వార్మ్‌, లిస్టిరయేసిస్‌
  • గుర్రాలు – గ్లాండర్స్‌ మెదడువాపు,
  • అస్పంల్లోసిస్‌, క్షయ, బ్రికోల్లా
  • పందులు – క్షయ, శ్వాసకోశ వ్యాధులు, రేబీస్‌
  • కుక్కలు – రేబీస్‌, బుసెల్లా, ప్లాజీ
  • ఎలుకలు – ప్లాజీ, లెస్టోస్ప్రేరోసిస్‌, మెదడువాపు
  • కోతులు – రేబీస్‌, దోమ, మిసిసల్స్‌
  • కుందేలు – తులసీమియా, టుటాక్యోప్లాసీమెను
  • పక్షులు- సిట్టకోకోసిస్‌, సాల్మోసెల్లోసిస్‌, అస్పంల్లోసు

జంతువులపట్ల ప్రేమగా ఉండొచ్చు. కానీ, జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరించటం మన ప్రాణాల మీదకు కొనితెచ్చుకోవటమే అవుతుంది. కాబట్టి పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్తలు పాటించండి.

Disclaimer : ఈ సమాచారాన్ని వైద్య నిపుణుల సలహాలు, పలు అధ్యయనాల ఆధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం. దీనిని కేవలం సమాచారంగా భావించండి.

Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×