EPAPER

Jackfruit Flour Benefits: మధుమేహానికి జాక్‌ఫ్రూట్ పిండితో అనేక ప్రయోజనాలు.. ఎలాగో తెలుసా..

Jackfruit Flour Benefits: మధుమేహానికి జాక్‌ఫ్రూట్ పిండితో అనేక ప్రయోజనాలు.. ఎలాగో తెలుసా..

Jackfruit Flour Benefits: ప్రస్తుతం ఉన్న కాలంలో అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. బయట తినే ఆహారం వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక ఆరోగ్య పరిస్థితుల బారిన పడుతున్నారు. జీవనశైలి కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వేగంగా పెరుగుతున్నారు. అయితే ఈ వ్యాధి కేవలం పెద్ద వయస్సు ఉన్న వారికి మాత్రమే కాకుండా యువతలోను వేగంగా వ్యాపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు జీవనశైలి, ఒత్తిడి,ఆహార సమస్యలే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.


రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి. అయితే డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటే మొదట ఆహారాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అందులోను డయాబెటిస్ అంటే వైద్యులను సంప్రదించి మందులు వాడుతుంటారు. కానీ ఇంట్లో లభించే వస్తువులతో కూడా డయాబెటీస్‌ను తగ్గించుకోవచ్చు. దీనికి కేవలం గోధుమలు మాత్రమే కాకుండా, పనసపండుతోను నివారణ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పచ్చి జాక్‌ఫ్రూట్‌తో మధుమేహాన్ని నియంత్రించవచ్చని చాలా మంది పరిశోధకులు కనుగొన్నారు. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తొలగిస్తుంది. జాక్‌ఫ్రూట్ పిండిని ఉపయోగించి డయాబెటీస్ వ్యాధిని నివారించుకోవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్‌లో జాక్‌ఫ్రూట్ పిండి ఎందుకు ప్రయోజనకరం ?


రోజూ పచ్చి పనసపిండి రోటీలు తింటే, టైప్-2 డయాబెటిస్ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందట. శాస్త్రవేత్తల ప్రకారం, మధుమేహ రోగులలో ప్లాస్మా చక్కెర స్థాయిని తగ్గించడంలో జాక్‌ఫ్రూట్ పిండి సహాయపడుతుంది. పనస పిండిని వాడేవారి శరీరంలో గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ పరిమాణం తక్కువగా ఉన్నట్లు తేలింది.

జాక్‌ఫ్రూట్ పిండి ప్రయోజనాలు

జాక్‌ఫ్రూట్ పిండితో చేసిన రోటీలు తినడం ద్వారా మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధిని నియంత్రించవచ్చు.
టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.
మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది.
జాక్‌ఫ్రూట్ ఫ్లోర్ రోటీస్ తినడం వల్ల బరువు తగ్గుతారు.
పనస పిండితో చేసిన చపాతీలను తినేవారి ఎముకలు దృఢంగా ఉంటాయి.

Tags

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×