EPAPER

Pain killers Side Effects: పెయిన్ కిల్లర్స్ ఎలా పని చేస్తాయో తెలుసా..? సైడ్ ఎఫెక్ట్స్ ఇవే!

Pain killers Side Effects: పెయిన్ కిల్లర్స్ ఎలా పని చేస్తాయో తెలుసా..? సైడ్ ఎఫెక్ట్స్ ఇవే!

Pain killers Side Effects


Pain killers Side Effects: మనలో చాలామంది వీపరీతంగా తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఈ నొప్పులకు మన జీవనశైలి సరిగా లేకపోవడం, ఉరుకులు పరుగుల జీవితం, సరైన ఆహారం తీసుకుపోవడం ఇలా అనేక కారణాలు కావచ్చు. ఇందులో ముఖ్యంగా ఒళ్లు నొప్పులు, కాళ్లు నొప్పులు ఎక్కువ మందిని బాధించే సమస్య. దీన్ని భరించలేక వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి మెడిసిన్ తెచ్చుకుంటారు. వీటిని ఓవర్ ది డ్రగ్స్ అంటారు.

వీటిలో సాధారణంగా పెయిన్ కిల్లర్ అని పలిచే నాన్ స్టిరాయిడల్ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి. ఇవి నొప్పులను సులభంగా తగ్గిస్తాయి. వీటి వాడకం ప్రపంచ వ్యాప్తంగా సాధారణం. ఓ సర్వే ప్రకారం.. ఒక్క అమెరికాలోనే వీటిని వాడే వారి సంఖ్య సంవత్సరానికి 3 కోట్ల పై మాటే. అందులో ప్రముఖ వైద్యులు కూడా ఉండటం విశేషం. ఈ పెయిన్ కిలర్స్‌లో ఐబూప్రోఫెన్ , డిక్లోఫినాక్ , అసిక్లోఫినాక్ , ఆస్పిరిన్ , నిమసలైడ్ ఎక్కువగా వాడుకలో ఉన్నాయి.


పెయిన్ కిల్లర్స్‌ను పైపూతలుగా, నోటి మాత్రలుగా,ఇంజక్షన్ల రూపంలో వాడుతుంటారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులకు, రుమటాయిడ్, ఆర్థ్రయిటిస్,జ్వరం, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, దెబ్బలు, ఎముకలు విరగడం, శస్త్రచికిత్స నొప్పులు, దంత సమస్యలు, కండరాల నొప్పులు, మైగ్రేన్, క్యాన్సర్ల వలన కలిగే నొప్పులకు ఈ మందులను వాడుతారు.

READ MORE: పెంపుడు జంతువులు అంటే ఇష్టమా?.. డేంజర్ డిసీజెస్!

మన శరీరంలో ఎక్కడయినా దెబ్బతగిలినా, లేక గాయమైనా.. అక్కడి నుంచి ప్రోస్టా గ్లాండిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఈ ప్రోస్టా గ్లాండిన్స్ రిలీజవ్వడానికి సైక్లో ఆక్సిజనేజ్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇలా రిలీజ్ అయిన ప్రోస్టాగ్లాండిన్స్ వలన దెబ్బతిన్న భాగం ఎర్రబడి వాపు వస్తుంది.

దీని ద్వారా ఆ ప్రదేశంలో నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి అనే అనుభూతి దెబ్బతిన్న కణజాలాలు, నాడీకణాల చివర నుంచి బయలు దేరి వెన్నుపూసలో నరాల ద్వారా మెదడు పైనున్న కార్టెక్సులోని నిర్ణీత భాగానికి ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా చేరుతుంది. అప్పుడు నొప్పిగా ఉంటుంది. ఈ సమయంలో పెయిన్ కిల్లర్స్ వాడటం ద్వారా గాయం నుంచి ప్రోస్టా గ్లాండిన్స్ విడుదలవకుండా చేసి నొప్పి తీవ్రతనీ, వాపునీ తగ్గిస్తాయి.

ప్రోస్టాగ్లాండిన్ అనేది శరీరానికి అవసరమయ్యే పదార్థం. ఇది ఒకరకంగా రక్షణ కలిపిస్తుంది. జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్ విడుదలవ్వకుండా చూస్తుంది. రక్తనాళాల గోడలు బలంగా ఉండేట్లుగా చేస్తుంది. కిడ్నీలకు రక్త సరఫరా ఆరోగ్యంగా జరిగేలా చూస్తుంది.

అయితే గాయమైనప్పుడు సాధారణంగా వచ్చే నొప్పిని పెయిన్ కిల్లర్స్ ద్వారా కంట్రోల్ చేయడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరగడం, కిడ్నీలు దెబ్బతినడం, రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరగడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా వీటి వలన రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టి గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉంది.

READ MORE: డయాబెటిస్.. ఈ ఐదు ఫుడ్స్ తింటే ఇక అంతే..!

పెయిన్ కిల్లర్స్ వాడకం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటివల్ల వికారం, వాంతులు, మలబధ్ధకం, తలతిరగడం, కడుపునొప్పి, విరేచనాలు, రక్త వాంతులు, రక్త విరేచనాలు, ఒళ్లంతా దద్దుర్లు, దురదలు, చర్మం మీద నల్లటి మచ్చలు, ఆయాసం, డిప్రెషన్, ఒళ్లంతా ఉబ్బటం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

Disclaimer : ఈ సమాచారాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు పలు అధ్యయనాల ఆధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం. దీనిని కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×