EPAPER

Skin Diseases with Cooler in Summer: సమ్మర్.. కూలర్ ఇలా వాడితే ఆ వ్యాధులు భారినపడటం ఖాయం..!

Skin Diseases with Cooler in Summer: సమ్మర్.. కూలర్ ఇలా వాడితే ఆ వ్యాధులు భారినపడటం ఖాయం..!
 Cooler Using Tips
Cooler Using Tips

Skin Diseases with Cooler using in Summer: సమ్మర్ సీజన్ మొదలైంది. ఎండలు మార్చిలోనే భగభగ మండుతున్నాడు. రాత్రిపూట కాస్త చల్లగా ఉన్నా ఉదయం నుంచే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రోజంతా వేడి, ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఫాన్లు స్పీడ్ పెంచుతున్నారు. అయినా గాలి సరిపోకపోవడంతో ఆటకపై ఉన్న కూలర్లను దింపి దుమ్ము దులిపి వాడేందుకు సిద్దమవుతున్నారు. చల్లగాలి కోసం మరమ్మతులు చేయించి బిగుస్తున్నారు. మరమ్మతులు చేసిన పనిచేయకుంటే కొత్తవి కొంటున్నారు.


ఇక ఎండలు కూడా ఈ ఏడావి అధికంగా ఉంటాయని ప్రభుత్వాలు హెచ్చరించడంతో కూలర్ల కంపెనీలు కూడా ధరలు పెంచేశాయి. ఎక్కువ లాభాలు పొందొచ్చిని ఆశిస్తున్నాయి. ఈ సీజన్‌ను కాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. దీంతో చాలా మంది ఐరన్ కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. వీటి ధర తక్కువగా ఉంటుంది. కూలింగ్ కూడా ఎక్కువ ఇస్తాయని భావిస్తున్నారు.

అయితే కూలర్ల వినియోగంపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. తగిన జాగ్రత్తల తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సరిగా వినియోగించకుంటే కూలర్లతో ప్రమాదం తప్పదని అంటున్నారు. కూలర్ల ధరలు చూస్తే గతేడాది కంటే పెరిగాయి.


Also Read: టామాటాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయా..?

రూ.300 నుంచి రూ.500 వరకు ధరలో వ్యత్యాసం ఉంది. మీరు ఏ రకమైన కూలర్ తీసుకున్నా దాని వినియోగం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. కూలర్‌లో ఉన్న గడ్డిని వినియోగం తర్వాత మార్చడం అవసరం. ఏడేది ఒకసారి కచ్చితంగా గడ్డిని మార్చాలని పేర్కొంటున్నారు. గడ్డి మార్చకుంటే చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉందిని చెబుతున్నారు.

కూలర్ అధిక ధరకు కొనలేని ప్రజలు చాలా మంది ఐరన్‌ కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. లోకల్‌గా తయారు చేసే కూలర్లు ఎక్కువ చల్లదనం ఇస్తాయని ఎక్కువగా వినియోగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా వీటి ధర కూడా తక్కువగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

కొందరైతే పాత కూలర్‌ను రిపేర్ చేయించి మళ్లీ వాడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వాటిని వాడే ముందు సరిచూసుకోవాలి. వైరింగ్‌ను చెక్ చేసుకోవాలి. లేదంటే షాక్‌ కొట్టే ప్రమాదం ఉంది. కూలర్తి రుగుతున్నప్పుడు ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. నీళ్లు పోసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పవర్‌ సరఫరా పూర్తిగా నిలిపివేయాలని అంటున్నారు.

Also Read: బీరు లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. వేసవిలో దాహం తీరేలా తాగుడే తాగుడు!

కూలర్ల విద్యుత్‌ తీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కూలర్లు వేసవిలో ఎక్కువ గంటలు తిరుగతూనే ఉండడం వలన హీట్ అవుతాయి. తీగలు నాశిరకమైతే వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. నాణ్యమైన తీగలు ఉన్న కూలర్లను కొనుగోలు చేయాలి. లేదంటే తీగలు కాలిపోయినప్పుడు తెలియకుండా ముట్టుకుంటే షాక్‌ కొడతాయి. ఏమరుపాటుగా ఉండే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Disclaimer: ఈ కథనాన్ని వైద్య అధ్యయనాల ఆధారంగా, నిపుణుల సలహా మేరకు రూపొందించాం. దీనిని అవగాహనగా మాత్రమే భావిచండి.

Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×