EPAPER

Ghee for Health: నెయ్యి ఆరోగ్యానికి మంచిదేనా..? గుండె జబ్బులకు దీనికి సంబంధం ఏంటి?

Ghee for Health: నెయ్యి ఆరోగ్యానికి మంచిదేనా..? గుండె జబ్బులకు దీనికి సంబంధం ఏంటి?

Ghee


Ghee is Good or Bad for Health..?: నెయ్యి లేదా వెన్నను తరచూ ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటూనే ఉంటాము. ఒకప్పుడు నెయ్యి వినియోగం పల్లెల్లో చాలా ఎక్కువగా ఉండేది. వేడివేడి అన్నంలో పప్పుతో కాస్తా నెయ్యి వేసుకుని తింటే ఫుల్ మజా వస్తుంది. మన ఇళ్లలో జరిగే కార్యక్రమాల్లో కూడా నెయ్యి వాడటం సాంప్రదాయంగా వస్తుంది. భారతీయ వంటకాల్లో నెయ్యి ప్రధానమైంది.

కానీ ప్రస్తుత కాలంలో నెయ్యి వాడకంపై ఆందోళన పెరిగింది. ఇందులో ఉండే ఫ్యాట్ కరాణంగా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో నెయ్యి ఉపయోగించాలంటే చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అసలు నెయ్యి మన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.


నెయ్యిలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అలానే అధిక సంతృప్త కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అయితే ఈ సాచురేటెడ్ కొవ్వు వల్ల కొందరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కానీ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందున్న దానిపై స్పష్టత రాలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నెయ్యిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అలానే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్ కూడా పెరుగుతుంది. దీనివల్ల హార్ట్‌స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.

Also Read: మేక పాలు.. బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు!

అయితే నెయ్యి ఆరోగ్యానికి మంచిద కాదా.. అన్న ప్రశ్నను వస్తే ఇది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. మనిషి ఆరోగ్యాన్ని బట్టి నెయ్యి ప్రభావం మారుతూ ఉంటుంది. నెయ్యిలో వివిధ కొవ్వుఆమ్లాలు మరియు విటమిన్ ఈ,ఏ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి చర్మానికి పోషణను అందిస్తాయి. పొడి చర్మానికి మాయిశ్ఛరైజింగ్‌గా కూడా నెయ్యిని ఉపయోగించొచ్చు. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

నెయ్యిలో బ్యూటిక్ యాసిడ్, కంజుగేటెడ్ లనోలెయిక్ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా శరీరంలో మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి అనేది మన జీవనశైలి, మొత్తం ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.

నెయ్యిలో ఒమెగా-3, ఒమెగా -6 వంటి కొవ్వు ఆమ్లాలు నిండుగా ఉంటాయి. ఇవి కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొన్ని సందర్బాల్లో అనారోగ్య కారణాల వల్ల కీళ్ల నొప్పులకు కూడా దారితీయొచ్చని నిపుణులు పేర్కొన్నారు. శరీర బరువును అదపులో చేయడంలోనూ నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు!

నెయ్యిలో విటమిన్ ఎ,ఈ,సి,డి,కెలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుంది. నెయ్యి రోజూ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. దీనివల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నెయ్యి తీసుకోండి.

Disclaimer: ఈ కథనాన్ని పలు మెడికల్ జర్నల్స్ ఆధారంగా, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా భావించండి.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×