EPAPER

Romantic Touch: భార్యాభర్తల మధ్య ఆ రొమాంటిక్ టచ్ రోజూ ఉండాల్సిందే.. ఎందుకంటే?

Romantic Touch: భార్యాభర్తల మధ్య ఆ రొమాంటిక్ టచ్ రోజూ ఉండాల్సిందే.. ఎందుకంటే?

ఆధునిక కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళుతున్నారు. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల స్కూలు, ఉద్యోగ పనులు అన్నీ చూసుకొని చివరకు అలసిపోతున్నారు. తమ వ్యక్తిగత జీవితాల్లో ప్రేమ, అనుబంధాలను పక్కన పెట్టేస్తున్నారు. నిజానికి భార్యాభర్తల మధ్య రోజూ ఒక చిన్న రొమాంటిక్ టచ్ ఉండాల్సిందే. ఉదయాన లేచిన వెంటనే ముద్దు పెట్టి కౌగిలించుకోవడం లేదా రాత్రి పడుకునే ముందు ప్రేమగా లాలించడం వంటివి ఉండాలి. అప్పుడే వారు మరింత ప్రేమపూరితంగా జీవించగలుగుతారు. వారి మధ్య అనుబంధం పటిష్టంగా మారుతుంది.


రొమాంటిక్ మ్యాజిక్
భార్యాభర్తలకు ఒకరి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అండదండలు ఎంతో అవసరం. అప్పుడే సంసారంలో ఎలాంటి కష్టాలు వచ్చినా చాలా సులువుగా దాటేస్తూ ఉండొచ్చు. మీరు మనసారా పెళ్లి చేసుకున్న భాగస్వామి ప్రేమను సజీవంగా ఉంచాలంటే ప్రతిరోజూ మీ ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ టచ్ ఉండేలా చూసుకోండి. అది ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది.

ఐ లవ్యూ చెప్పండి
ఉదయం లేచిన వెంటనే ఐ లవ్ యు అని చెప్పుకోవడం వారిద్దరిలో ప్రేమ హార్మోన్లు పుట్టేలా చేస్తుంది. కసురుకోవడం, విసుక్కోవడం వంటివి ఎదుటివారిలో మీపై ఉన్న ప్రేమను చంపేస్తాయి. కాబట్టి ఖాళీ దొరికినప్పుడల్లా భార్య భర్తలు ఇద్దరూ ప్రేమగా దగ్గరగా కూర్చుని మాట్లాడకోవాల్సిన అవసరం ఉంది.


రోజులో ఐదు నిమిషాలైనా మీకోసం మీరు కేటాయించుకోండి. ఆ ఐదు నిమిషాలు ప్రేమగా ఉండేందుకు ప్రయత్నించండి. పక్క పక్కన కూర్చొని ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి మాట్లాడుకోండి. రాత్రి పడుకునే ముందు ఆ ఐదు నిమిషాలు కేటాయించుకుంటే మంచిది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉదయం నుంచి మీరు పడిన ఇబ్బందులను లేదా ఎదుర్కొన్న సమస్యలను వారికి చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి నుంచి అండదండలను కోరుకోవచ్చు. నిద్రపోయే ముందు ప్రేమగా చిన్న ముద్దు నుదుటిమీద పెడితే చాలు, ఎదుటి వారిలో ఎండార్పిన్లు అధికంగా విడుదలవుతాయి. అవి వారిలో ఆనందాన్ని పెంచడమే కాదు మీపై ప్రేమను కూడా పెంచుతాయి.

రొమాన్స్ అంటే
రొమాన్స్ అనేది పెళ్లికి ముందు చేసేదే అనుకుంటారు. భార్యాభర్తల బంధం లో కూడా రొమాన్స్ చాలా ముఖ్యమైనది. ఇది వారి వైవాహిక జీవితానికి అత్యవసరం. పిల్లలు, బాధ్యతలతో బిజీ అయిపోయి తమ సొంత జీవితాన్ని పక్కన పెట్టకూడదు. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్లడం, సినిమాలకు షికారులకు తిరగడం, డేట్ కి వెళ్లడం, సాయంత్రం పూట కలిసి స్నాక్స్ వంటివి తినడం చేయాలి. అలాగే ఏకాంతంగా ఉన్నప్పుడు కౌగిలింతలు, ముద్దులు వంటివి కూడా ఉండాలి. ఇదే చక్కటి రొమాన్స్ అంటే. ఎంతోమంది రొమాన్స్‌కి, సెక్స్ కి మధ్య తేడా తెలియక ఇబ్బంది పడుతున్నారు. రొమాన్స్ చాలా మనసును తాకేట్టుగా ఉంటుంది. ఇదే భార్యాభర్తలను అధికంగా దగ్గర చేస్తుంది. వారిని చిలకా గోరింకల్లా ఉండేలా జీవించేలా చేస్తుంది. కాబట్టి వారి భార్యాభర్తల మధ్య రొమాంటిక్ టచ్ ఉండేందుకు ఇద్దరు ఒకరికి ఒకరు సహకరించుకోవాలి.

Also Read: బీట్ రూట్ తినండి బాబాయ్‌లూ.. ఆ సమస్యలన్నీ హాంఫట్!

ఉదయాన్న వంట పనులు పిల్లల పనుల్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పని చేస్తూ మధ్య మధ్యలో మాట్లాడుతూ జోకులు వేసుకుంటూ సాగితే ఏ పని కూడా కష్టం అనిపించదు. అంతేకాదు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు నా భార్య కదా అని సారీ కూడా చెప్పరు కొంతమంది భర్తలు. కానీ ఆ సారీ అనే పదం భార్యలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆమె మీకోసం ఏదైనా ప్రత్యేకంగా వండితే థాంక్స్ అని చెప్పి చిన్నగా ముద్దు ఇవ్వండి. ఇలాంటి రొమాంటిక్ సీన్స్ మీ ఇంటిని ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుతాయి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేలా, ఆహ్లాద వాతావరణంలో పెరిగేలా చేస్తాయి. భార్యాభర్తలిద్దరూ ఎంత అన్యోన్యంగా అర్థం చేసుకొని ముందుకు సాగుతారో… ఆ ఇల్లు హరివిల్లులా మారిపోతుంది.

Related News

Frogs Health Benefits: కప్పలు తింటే ఇన్ని లాభాలున్నాయా? పదండ్రా పట్టుకొద్దాం!

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Master Dating: మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటీ? ఇందులో ఇంత పిచ్చ హ్యాపీనెస్ ఉంటుందా మామా?

Big Stories

×