Big Stories

Tea or Coffee: టీ లేదా కాఫీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

- Advertisement -

ఇక చాలు విశ్రాంతి తీసుకో అని మన మెదడుకు సూచించే న్యూరో ట్రాన్స్ మీటర్ అడినోసిస్ ను కొద్ది సమయం పాటు కాఫీ, టీలో ఉండే కెఫైన్ బ్లాక్ చేస్తుంది. దాంతో అప్పటి వరకు నిద్రమత్తుతో తూగినవారు టీ, కాఫీ తీసుకున్న తర్వాత మత్తు దిగి కాస్తంత ఉత్సాహంగా కనిపిస్తారు. ఇంకా ఇందులో ఉండే కెఫిన్ మన శరీరానికి ఆరోగ్యరీత్యా మంచిది. పైగా సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన పానీయం.

- Advertisement -

కాఫీ రుచికరమైన పానీయం.. కానీ ప్రొద్దుటే కాఫీ త్రాగడం వల్ల మనకి హుషారు వచ్చి నిత్యకృత్యాలు ప్రారంభిస్తాం కాని పరగడుపునే కాఫీ తాగడం మంచిది కాదు. ఎందుకంటే నిద్ర లేవగానే కార్టిస్టాల్ అనే హార్మోన్ మనలో చాలా ఎక్కువగా విడుదలవుతుంది. అలాంటి సమయంలో కాఫీ తాగడం మంచిది కాదు. అయితే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో కాఫీ తాగడం మంచిదని సూచిస్తున్నారు.

కాఫీ, టీ ఈ రెండు పానీయాల్లో “టీ” తాగడం కొంత వరకు మంచిదని చెప్పాలి. ఎందుకంటే “టీ” లో ఉండే థైనిన్ అనే అమ్మోనియా యాసిడ్ ఉండటం కారణంగా అది చక్కటి ఉపశమనం ఇస్తుంది. అయితే చక్కెర, పాలశాతాన్ని తగ్గిస్తేనే మంచిదని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఉండే వ్యక్తిగతమైన ఇష్టాల కారణంగా మీరు తప్పనిసరిగా కాఫీనే తాగాలనుకుంటే దానిని రోజుకి రెండు మూడు చిన్న కప్పువరకు మాత్రమే పరిమితం చేయండి.

Also Read: సాధారణ తలనొప్పిని, మైగ్రేన్ నొప్పిని ఎలా గుర్తించాలో తెలుసా ?

చాలా మంది డిన్నర్ చేసిన వెంటనే టీ, కాఫీ తాగుతారు. నైట్ షిప్ట్ చేసే వారైతే అలా తాగేవారు ఎక్కువగానే ఉంటారు. నిజానికి అలా డిన్నర్ అయిన వెంటనే టీ, కాఫీ వంటివి తాగితే జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. గ్యాస్, ఎసిడిటి సమస్యలు వస్తాయి. తిన్న ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. ప్రధానంగా ఐరన్ ను శరీరం ఏమాత్రం గ్రహించలేదు గనుక తిన్న వెంటనే కాఫీ, టీ తాగరాదు.

కాఫీ టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. ఎలా అంటే కాఫీ ప్రొటీన్ లను పెంచుతుందని టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ లను శరీరంమంతటికి అందిస్తాయని దాంతో టైప్ 2 మధుమేహ నివారణ సాధ్యమవుతుందని వివరించాయి. కాని ఈ తరహా పరిశోధనలు ఇంకా అంగీకార స్థాయికి రాలేదు. కాఫీ, టీ రెండింటిని వేరు చేసి చూడలేమని అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎమ్ డీ మిల్లెట్ అన్నారు. 6,800 మంది గుండె జబ్బులతో ఉన్న వారి అభిప్రాయం తీసుకోగా అందులో 79 శాతం మంది కాఫీ తాగే వారే ఉన్నారని వీరు గుర్తించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News