EPAPER

Fenugreek Benefits And Side Effects: పరగడుపున మెంతులు తినేస్తున్నారా.. ఏమవుతుందో తెలుసా ?

Fenugreek Benefits And Side Effects: పరగడుపున మెంతులు తినేస్తున్నారా.. ఏమవుతుందో తెలుసా ?


Fenugreek Benefits And Side Effects: మన ఇంట్లోని వంటగదిలో దొరికే పదార్థాలే మన ఆరోగ్యానికి ఔషధాలుగా మారుతాయి. వంటగదిలోని ప్రతీ వస్తువుతో ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. చర్మం, జుట్టు, ఆరోగ్యం వంటి వాటికి చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. వీటితో ముఖ్యంగా మెంతులు. మెంతులతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహం సహా అనేక వ్యాధులకు మెంతులు ఔషధంలా పనిచేస్తాయి. ఇవి తినడానికి చేదుగా అనిపించినా ఇవి చేసే మేలు మాత్రం అంతా ఇంతా కాదు. అందువల్ల వంటకాల్లో మెంతులు, మెంతి పొడిని గృహిణులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే మెంతులు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయట. మరి అవెంటో తెలుసుకుందాం.

⇒ మెంతులు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
⇒ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది
⇒ జ్వరం, అలెర్జీల , గాయాల చికిత్సలో
⇒ బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకుంది
⇒ మధుమేహం ఉన్నవారికి త్వరగా నయం అయ్యేలా చేస్తుంది


మెంతులను రాత్రి వేళ నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల అజీర్తి, క‌డుపుబ్బ‌రాన్ని కూడా త‌గ్గిస్తాయి. మ‌ధుమేహం సమస్యతో బాధపడే వారు రోజు మెంతులు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మెంతుల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుందని అందువల్ల ఒంట్లో కొవ్వు త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇక పీరియడ్స్ సమయంలో కండరాల నొప్పిని తగ్గించుకునేందుకు మెంతులు బాగా పనిచేస్తాయి.

సైడ్‌ ఎఫెక్ట్స్‌

⇒ అజీర్ణం
⇒ కడుపు ఉబ్బరం
⇒ అతిసారం
⇒ తలనొప్పి
⇒ వికారం
⇒ తలతిరగడం

గర్భిణీ స్త్రీలు మెంతి సప్లిమెంట్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే గర్భాశయ సంకోచాలు పెరిగి అవి శిశువుపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయట. ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుందట.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×