EPAPER

Height Increase Food: మీ పిల్లలు హైట్ పెరగడం లేదా ? అయితే ఈ ఫుడ్స్ తినిపించండి

Height Increase Food: మీ పిల్లలు హైట్ పెరగడం లేదా ? అయితే ఈ ఫుడ్స్ తినిపించండి

Height Increase Food: పిల్లలు ఎత్తు పెరిగేందుకు అన్ని రకాల ఆహార పదార్థాలను తరుచూ అందిస్తూ ఉండాలని నిపుణులు చెబుతుంటారు. పోషకాహారం ఇవ్వడం వల్ల పిల్లలు వయస్సుకు తగిన హైట్ పెరుగుతారు. అంతే కాకుండా వారు ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు త్వరగా ఎదిగేందుకు దోహద పడే ఫుడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు, పాల ఉత్పత్తులు:
పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది పిల్లల ఎముకలకు ఎంతగానో మేలు చేస్తుంది. అంతే కాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేలా చేయడానికి ఇది సహాయపడుతుంది. అలాగే వీటిలో ఫాస్ఫరస్, మెగ్నీషియం ,విటమిన్ ఏ ,విటమిన్ బి వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లలు త్వరగా హైట్ పెరిగేలా చేస్తాయి.
సోయాబీన్స్:
సోయాబీన్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల కండరాల పెరుగుదలకు చాలా అవసరం. అంతే కాకుండా సోయాబీన్స్‌లో ఉండే అమైనో ఆమ్లాలు కణాల పెరుగుదలకు తోడ్పడుతాయి. ఇంకా సోయాబీన్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల ఎముకలు, దంతాలు దృఢంగా ఉండేందుకు సహాయం చేస్తుంది, అందుకే పిల్లలకు తరచుగా సోయా బీన్స్‌తో తయారు చేసిన ఆహారాలు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కోడిగుడ్లు:
పిల్లలు క్రమం తప్పకుండా కోడి గుడ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఎత్తు కూడా పెరుగుతారు. ఎగ్స్ లో ఎన్నో రకాల ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ ఎదిగేందుకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. 2000వ సంవత్సరంలో జనరల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం గుడ్డులోని ప్రొటీన్, కాల్షియం, విటమిన్ బి, రైబోఫ్లోవిన్ పిల్లలకు ఎదుగుదలకు అవసరమైన పోషకాలలో ముఖ్యమైనవి. ఈ పోషకాల వల్ల రోజు ఒక గుడ్డు తినే పిల్లలు తినని వారి కంటే ఎక్కువ ఎత్తు పెరిగినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూట్రిషన్ అండ్ చైల్డ్ హెల్త్ ఎక్స్పర్టస్ పాల్గొన్నారు.
చికెన్ :
పిల్లలు ఎత్తు పెరిగేందుకు చికెన్, మంచి ఆహారం ఇందులో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలుంటాయి. ఇది పిల్లల వయస్సుకు తగిన ఎత్తు పెరిగేందుకు సహాయం చేస్తుంది. అలా అని ఎక్కువగా చికెన్ తనిపించకూడదు. తగిన మోతాదులోనే తీసుకోవాలి.
ఆకుకూరలు :
కాల్షియం, మెగ్నీషియంతో పాటు ఎన్నో పోషకాలు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికిహెల్ప్ చేస్తాయి. కాబట్టి తరచూ పిల్లలకు ఆకుకూరలు డైట్ లో భాగంగా ఇస్తూ ఉండాలి.


Also Read: కేవలం పండు మాత్రమే కాదు వీటి తొక్కలతో కూడా ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

క్యారెట్:
క్యారెట్‌లో పిల్లలు ఎత్తు పెరగడానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. తరచూ వీటిని చేసి తినిపించడం వల్ల హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పిల్లలు ఎత్తు పెరిగేందుకు సీజనల్ ఫ్రూట్స్ కూడా తప్పకుండా తినిపించాలి. అలాగే తృణధాన్యాలతో చేసిన ఫుడ్ ఐటమ్స్ ను అందించడం ద్వారా హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. సీడ్స్ అందించడం ద్వారా కూడా పిల్లలు ఎత్తు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు


Related News

Weight Gain Foods For Children: మీ పిల్లలు బరువు పెరగడం లేదా ? ఈ ఫుడ్స్ తినిపించండి

Aloe Vera Health Benefits: కలబందతో మతిపోయే ప్రయోజనాలు !

Lip Care Tips: పెదాలు ఎర్రగా మారడానికి చిట్కాలు ఇవే !

Barley Water Benefits: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

Chana Dal For Diabeties: డయాబెటీస్ ఉన్నవారికి శనగపప్పుతో ఉండే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

Figs Side Effects: ఆరోగ్యానికి మంచిది అని అంజీర పండ్లను అతిగా తినేస్తున్నారా ?

Chia Seeds Benefits for Skin: చియా సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×