EPAPER
Kirrak Couples Episode 1

Sun Stroke : వడదెబ్బ తగిలితే ముందుగా చేయాల్సిన పనులు!

Sun Stroke : వడదెబ్బ తగిలితే ముందుగా చేయాల్సిన పనులు!
Sun Stroke

Sun Stroke : రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ప్రతాపం చూపుతున్న భానుడిని చూసి ప్రజలు భయపడిపోతున్నారు. ఉక్కపోత, వేడిగాలుల నుంచి ఉపశమనం కోసం రకరకాల జ్యూస్‌లు తాగుతూ సేదతీరుతున్నారు. వడదెబ్బ కొట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అసలు వడదెబ్బ తగిలితే డాక్టర్‌ దగ్గరికి వెళ్లకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


వడదెబ్బ తగిలిన వారికి విపరీతంగా జ్వరం వస్తుంది. నాడి వేగంగా కొట్టుకుంటుంది, తలనొప్పి, చిరాకు కలుగుతుంది. అంతేకాకుండా కండరాల్లో నొప్పి, మూత్రం ముదురు రంగులో వస్తుంది. చర్మం పొడిబారిపోతుంది. స్పృహతప్పి పడిపోతారు. అందుకే మధ్యాహ్నం సమయంలో ఎండలో తిరగొద్దు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలపై టోపీ, కర్చీఫ్‌ ధరించాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పుతో తయారుచేసిన పండ్ల రసాలు తాగుతూ ఉండాలి, వీలైనంత వరకు నల్లటి బట్టలు వేసుకోకూడదు. ఇంట్లో కిటికీలు, తలుపులకు తెరలు వేసుకోవాలి. వడదెబ్బ బారినపడిన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న చోటుకు తీసుకెళ్లాలి. ఒంటిపై బట్టలు తీసేసి చల్లటి నీటితో బాడీని కడగాలి. ఐస్‌ ముక్కలను గుడ్డలో వేసి శరీరమంతా రుద్దితే ఉపశమనం కలుగుతుంది. శరీరానికి చల్లగాలి తగిలేలా చూసుకోవాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి చల్లటి నీరు, ఉప్పు కలిపిన నీరును తాగించాలి.


Related News

Turmeric Face Pack: మీ ఫేస్ బంగారంలా మెరిసిపోవాలంటే.. పసుపుతో ఓసారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Garlic Benefits: ప్రతి రోజు వెల్లుల్లి తింటే ఈ సమస్యలన్నీ పరార్ !

Pimple Problem: ఇంట్లోనే మొటిమలను తగ్గించే మార్గాలివే

Older Persons Day: వృద్ధుల కోసం అంగన్‌వాడీ తరహా కేంద్రాలు.. దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా?

World Heart Day: అతిగా పని చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందని మీకు తెలుసా

After Meals: పొట్ట రోజు రోజుకి పెరిగిపోతోందా? భోజనం చేశాక 20 నిమిషాల పాటు ఈ పని చేయండి, బరువు త్వరగా తగ్గుతారు

Panchabhakshya Paramannalu: పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటి.. అందులో ఏమేమీ ఉంటాయో తెలుసా?

Big Stories

×