EPAPER

Valentine’s Day History: వాలెంటైన్స్ డే వెనుకున్న కన్నీటి కథ..!

Valentine’s Day History: వాలెంటైన్స్ డే వెనుకున్న కన్నీటి కథ..!

Valentine’s Day Special Story: ఫిబ్రవరి 14.. రానే వచ్చింది. ఇవాళ ప్రేమికుల పండుగ. ఇన్ని రోజులు వాలెంటైన్ వీక్ సెలబ్రేట్ చేసుకున్న ప్రేమికులకు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ప్రేమ పక్షులు ఈ రోజు మరో లోకంలో విహరిస్తారు. ప్రేమలో పీకల్లోతు మునిగి తేలుతారు. నిజమైన ప్రేమకు వాలెంటైన్స్ డే రోజే కాదు.. ప్రతి రోజు పండగే. కానీ వాలెంటైన్స్ ప్రేమికులకు మరింత స్పెషల్‌గా ఉంటుంది.


వాలెంటైన్స్ డే రోజున ప్రేమ పక్షులు.. ఎంత దూరాన ఉన్న వారి ప్రియుడికి లేదా ప్రియురాలికి మరింత దగ్గరవ్వాలని కోరుకుంటారు. తమ రిలేషన్ లైఫ్‌లాంగ్ శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటారు. అసలు నీ ప్రేమలో నిజాయితో అనేది ఉంటే.. దాని కోసం ప్రత్యేకమైన రోజు అవసరం లేదు.

ప్రేమ అనేది ఎప్పుడు.. ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేనిది. అందుకే ప్రేమను తెలపడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు. మీ లవ్‌ను ప్రపోజ్ చేయడానికి ఈ రోజే ఎందుకు ఎంచుకుంటారు. దీని వెనకున్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం.


Read More: యాంటీ వాలెంటైన్ వీక్.. చెంప పగలగొట్టొచ్చు..!

ప్రేమ అనేది ఎంతో మధురమైనది. దీని గురించి చెప్పమంటే ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా తమదైన శైలిలో వర్ణిస్తారు. ఇక ప్రేమలో పడిన వారితే కవులుగా మారిపోతారు. దాని గురించి అద్భుతంగా వివరిస్తారు. ఇదంతా పక్కనబెడితే.. వాలైంటైన్స్ డే గురించి అనేక కథనాలు వినిపిస్తున్నాయి.

ప్రేమ సిద్ధాంతం ప్రకారం.. క్రీస్తు పూర్వం 270లో మత గురువు వాలెంటైన్ ప్రేమ గురించి బోధించాడట. హింస, ద్వేషం, స్వార్థం వంటి దుర్గుణాలపై ప్రేమను మించిన ఆయుధం లేదని వాలెంటైన్ చెప్పేవారు. క్రైస్తవ మత గరువు అయిన వాలెంటైన్ రోమ్‌లో ఉంటూ.. యువతి యువకులు ప్రేమించుకునే విధంగా ప్రోత్సహించేవాడట. అంతటితో ఆగకుడంగా ప్రేమలో ఉన్న వారికి పెళ్లిల్లు కూడా చేసేవాడు.

కానీ క్రీస్తు పూర్వం 270లో రోమ్ నగరాన్ని క్లాడియస్ అనే రాజు పరిపాలిపస్తున్నాడు. క్లాడియస్ అప్పటికే పెళ్లిళ్లపై నిషేధం విధించారు. అతి క్రూరమైన క్లాడియస్‌కు పెళ్లిళ్లు అంటే ఏ మాత్రము ఇష్టం లేదు. పెళ్లి అనే పేరు వింటే చాలు కఠినమైన శిక్షలతో వేధించేవాడట. ఈ సమయంలో వాలెంటైన్ ప్రేమను విపరీతంగా ప్రోత్సహిస్తున్నాడు.

Read More: వాలెంటైన్స్ డే వెనుక క్రూరమైన చరిత్ర..!

పెళ్లిళ్లపై నిషేధం ఉన్నప్పటకీ.. రోమ్‌లో పెళ్లిళ్లు ఎలా పెరుగుతాన్నాయని క్లాడీయస్‌‌కు అంతుచిక్కడం లేదు. దీనిపై విచారణకు ఆరా తీయగా.. వాలెంటైన్ ప్రేమ పాఠాల గురించి బయటపడింది. తక్షణమే వాలెంటైన్‌ను పట్టుకొని కారాగారంలో బంధించాడు. రాజద్రోహం చేశాడన్న ఆరోపణలతో వాలెంటైన్‌కు ఉరి శిక్ష విధించాడు.

కారాగారంలో ఉన్న వాలెంటైన్ జైలర్ కూతురితో ప్రేమలో పడ్డాడట. అయితే వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరి తీశారు. వాలెంటైన్ చనిపోయే ముందు కూడా యూఆర్ మై వాలెంటైన్ అంటూ తను ప్రేమించిన అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. ఇలా యువర్ మై వాలంటైన్ ప్రేమకు అర్థంగా మారిపోయింది. ఎందరినో ప్రేమంచికునేలా ప్రోత్సహించిన వాలెంటైన్ చివరికి ఇలా తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.

దీని ఆధారంగానే ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మన దేశంలో మాత్రం 1990 సంవత్సరంలో వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభమైంది. దీనిపై అనేక వివాదాలు కూడా ఉన్నాయి. నిజానికి ప్రేమను తెలియజేయడానికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదు.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×