EPAPER

Love Breakups: ముందు ప్రేమ.. ఆ తర్వాత ఇంకేముంది అదే.. పెరుగుతున్న లవ్ బ్రేకప్స్.. కారణం అదేనా?

Love Breakups: ముందు ప్రేమ.. ఆ తర్వాత ఇంకేముంది అదే.. పెరుగుతున్న లవ్ బ్రేకప్స్.. కారణం అదేనా?

Love Breakups: లవ్.. ఇష్క్. కాదల్.. ప్రేమ.. నేటి కాలం యూత్ కు వీటి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దువ్విన తలనే దువ్వి, స్టైలిష్ లుక్ లో అదరగొట్టేస్తున్నాడంటే చాలు.. మనోడు లవ్ ట్రాక్ లో ఉన్నట్లే. ఇలాంటి ట్రాక్ కేవలం అబ్బాయిల వరకే ఆగిందని అనుకుంటే పొరపాటే, ఇటీవల పలువురు అమ్మాయిలు కూడా ప్రేమ అనే ఫీలింగ్ కి బానిసలుగా మారుతున్న దృశ్యాలు మన కళ్లకు కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని సక్సెస్ లవ్ స్టోరీలు ఉండగా, మరికొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి. అందులో కూడా ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత విడాకులు.. ఇలా ఓ వరుస క్రమంలో సాగుతున్నాయి నేటి సమాజపు కొన్ని లవ్ స్టోరీలు. ఇంతకు పెరుగుతున్న లవ్ బ్రేకప్స్ వెనుక ఉన్న కారణాలు చూస్తే.. ఔనా.. నిజమా అనేస్తారు.


గతంలో ప్రేమ పెళ్లిళ్ల ఊసే ఉండేది కాదు. అది కూడా పెద్దలు వివాహం నిశ్చయించిన తర్వాత, ఇద్దరి మధ్య మాటలు కలిసేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎక్కడ చూసినా ప్రేమ వివాహాలు జోరుగానే సాగుతున్నాయి. నాటి లైలా మజ్ను ప్రేమగాథను ఆదర్శంగా తీసుకున్నారో, ఏమో కానీ నేటి యువతకు లవ్ ఫీలింగ్స్ ఎక్కువే. మొదట పరిచయం, తర్వాత లవ్ , ఆ తర్వాత పెళ్లి, విడాకులు ఇలా కొన్ని ప్రేమ జంటలు.. మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తున్నాయి.

నేటి రోజుల్లో విద్యార్థి దశలో ప్రారంభమయ్యే ప్రేమలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని వెనుక ఉన్న కారణాలు ఏవైనా, ఈ దశలో పుట్టే ప్రేమ పెద్దలకు చిక్కులు తెస్తుండగా, మరోవైపు ప్రేమ జంటకు తిప్పలు తెస్తున్నాయనే చెప్పవచ్చు. ప్రేమ అనే పదానికి అర్థం తెలియని వయస్సులో పుట్టే ప్రేమ, అర్థం తెలుసుకొనే లోగానే బ్రేకప్ అవుతోంది. ఇలాంటి ప్రేమలు సమాజానికి పనికిరావన్నది పెద్దల అభిప్రాయం. కేవలం సాధించాలనుకున్న లక్ష్యాన్ని ప్రేమించండి కానీ, తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ పేరుతో భాదించవద్దు.. భాదించపడవద్దంటారు పెద్దలు.


ఇక యూత్ విషయానికి వస్తే లవ్ అంటే అదో రకమైన ఫీలింగ్. ఒక్కసారి లవ్ ట్రాక్ ఎక్కారంటే చాలు.. ఆహార్యంలో మార్పు, లైఫ్ స్టైల్ లో మార్పు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రూటే సపరేట్. అందుకే కాబోలు లవ్ ట్రాక్ యూత్ ని నేటి కాలపు యూత్ ఇట్టే పసిగట్టేస్తారు. ప్రేమ అనే రెండక్షరాలతో కలిసి, పెద్దలను ఎదిరించే వరకు వెళ్లడం, ఆ తర్వాత పెళ్లితో ఏడడుగులు వేసి, జీవితాంతం కలిసి ఉంటామంటూ ప్రమాణం చేయడం.. ఆ తర్వాత లవ్ కి , పెళ్లికి బ్రేకప్ చెప్పే జంటలు నేడు అధికంగా కనిపిస్తున్నాయి. సముద్రాన్ని ఈదవచ్చు కానీ.. సంసారాన్ని ఈదడం కష్టమే సోదరా అంటారు లవ్ బ్రేకప్ జంటలు.

దీనికి గల కారణాలు చూస్తే.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంటలకు, లైఫ్ ని సక్సెస్ ఫుల్ గా సాగించే అవగాహన లేకపోవడమేనన్నది పలువురి భావన. తొలినాళ్లలో బంధం బలంగా ఉన్నా, రానురానూ జీవన చక్రంలో కష్టాల సుడిగండాలను అధిగమించలేక, ఒకరి మధ్య ఒకరికి విభేధాలు పుట్టడం ఇలాంటి బ్రేకప్స్ కి ఒక కారణంగా చెప్పవచ్చు. అంతేకాదు చెడు వ్యసనాలు కూడా ఇలాంటి ప్రేమ పెళ్లిళ్ల బ్రేకప్స్ కి మరో కారణమే.

అలాగే పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్న ప్రేమ జంటల లైఫ్ స్టైల్ తొలిరోజుల్లో సాఫీగా సాగినా.. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఏదైనా ఉపాధి అవకాశాలు ఉంటే ఓకే గానీ, లేకుంటే వారికి చుక్కలే. సమాజంలో కలిసి బ్రతికేందుకు ప్రేమ, పెళ్లి ఒక్కటే కాదు.. జీవితాంతం అర్థం చేసుకొనే మనసులతో పాటు డబ్బు కూడా ముఖ్యమే. అందుకే కాబోలు ఇలాంటి జంటలు, పెద్దల ప్రోత్సాహం అందుకోలేక, మరోవైపు తమ బంగారు భవిష్యత్ ను ఎలా సాగించాలో తెలియక, అర్ధాంతరంగా ముగింపు పలుకుతున్నాయి.

Also Read: YS Jagan: మా ఇంటి వైపు తొంగి చూడొద్దు.. అన్ని కుటుంబాలలో ఉండేదేగా.. ఆస్తి వివాదంపై జగన్ స్పందన

అలాగని సక్సెస్ సాధించిన ప్రేమలు ఉన్నాయి.. ప్రేమ పెళ్లిళ్లు కూడా ఉన్నాయి.. ఆ తర్వాత శభాష్ అనిపించుకున్న ప్రేమ జంటలు కూడా నేటి తరంలో ఉన్నాయి. వీరు లవ్ అనే బంధంతో కలిసి, పెళ్లి అనే బంధంతో ఏడడుగులు వేసి, లైఫ్ లో కూడా అవే అడుగులను కలిసి వేస్తూ.. సక్సెస్ సాధిస్తున్నారు. వీరి బంధం విజయవంతంగా సక్సెస్ కావడానికి కారణాలు చూస్తే.. ఒకే మాట.. ఒకే బాట.. ఒకే లక్ష్యం. అర్థం చేసుకున్న మనసులతో ఒకే మాటపై ఉంటూ.. కొన్ని సమయాల్లో విభేదాలు వచ్చినా.. సర్దుకుపోవడమే వీరి సక్సెస్ కి కారణం. అందుకే కాబోలు లవ్ వేరు.. లైఫ్ వేరు అంటారు పెద్దలు. లవ్ లో సక్సెస్ కాగానే సరిపోదు, లైఫ్ లో కూడా సక్సెస్ సాధించి నిరూపించుకోవాల్సిన అవసరాన్ని నేటి యువత గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏదిఏమైనా ప్రేమ గొప్పదే కానీ, పెద్దల మనసు నొప్పించక, తాము నొప్పక ముందుకు సాగి సక్సెస్ సాధిస్తే అందరికీ ఆనందమే. కానీ నేటి స్పీడ్ యుగంలో ప్రేమ అనే పదం యొక్క అర్థం మార్చి, వ్యామోహ భావనలో మధ్యలోనే తమ జీవితాలకు ఆత్మహత్యల పేరుతో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు కొందరు యూత్. అలాగే ముందు ప్రేమను ప్రేమించడం కంటే.. తల్లిదండ్రులు మనపై ఉంచిన నమ్మకాన్ని ప్రేమించి, సక్సెస్ సాధిస్తే అన్నీ మీ చెంతకే వస్తాయంటారు అనుభవజ్ఞులు. మరి ప్రేమా.. లైఫ్ సక్సెసా.. లేక రెండు కలిపి సక్సెస్ సాధిస్తారా లేదా అన్నది మీరే ఆలోచించుకోండి సుమా. చివరగా ఒక్క మాట ప్రేమ పేరుతో ఆత్మహత్యలు వద్దు.. అనుకున్న ఆశయాలను సాధించండి.

Related News

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Master Dating: మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటీ? ఇందులో ఇంత పిచ్చ హ్యాపీనెస్ ఉంటుందా మామా?

Soya Chunks Manchurian: మిల్ మేకర్‌తో మంచూరియా ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు

Big Stories

×