EPAPER

Soaked Almonds Benefits : బాదంపప్పును నానబెట్టకుండా తింటే ఏమవుతుంది?

Soaked Almonds Benefits : బాదంపప్పును నానబెట్టకుండా తింటే ఏమవుతుంది?
Soaked Almonds Benefits

Soaked Almonds Benefits : నట్స్‌.. మన శరీరానికి ఎంతో పోషకాలను ఇవి అందిస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి బాదం పప్పు. ఈ బాదం పప్పు వల్ల మనకు అవసరమైన విటమిన్స్‌, మినరల్స్‌తో పాటు చాలా రకాల పోషకాలు కూడా అందుతాయి. చాలా వరకు వీటిని నేరుగా తింటుంటారు. కానీ బాదంపప్పును నేరుగా తినేకంటే రాత్రి నానబెట్టి ఉదయం సమయంలో వాటిపై పొట్టు తీసేసి తినడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ బాదం పప్పు పొట్టులో టానిన్‌ అనే పదార్థం ఉండటం వల్ల అందులోని పోషకాలను మనకు పూర్తిగా అందనివ్వకుండా అడ్డుపడుతుంది. అంతేకాకుండా బాదంను పొట్టుతీసి తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతాయి.


నానబెట్టిన బాదంపప్పులో ఉండే ఎంజైమ్‌ లైపస్‌ వల్ల మన కొవ్వును కరిగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజ 5 బాదం గింజలను నానబెట్టుకుని తింటే మనకు ఎనలేని శక్తి వస్తుంది. ఇమ్యూనిటీ కూడా చాలా పెరుగుతుంది. బాదంలో ఉండే ఫైబర్‌,ప్రొటీన్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు విటమిన్‌ ఈ, జింక్‌, పాస్పరస్‌, మెగ్నీషియం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు బాదంపప్పు ఎంతో మంచిది. దీంతో వారి ఎదుగుదల బాగా ఉంటుంది. అన్నింటిలో చురుగ్గా ఉంటారు. అంతేకాకుండా బాదంపప్పును తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. దీంతో తొందరగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ గింజ‌ల‌ను తిన‌డంతో గుండె సంబంధిత స‌మ‌స్య‌లు మన దరిచేరకుండా ఉంటాయి. వ‌య‌సు పైబ‌డిన వారు బాదం గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు రావు.

బాదంపప్పులో సమృద్ధిగా కాల్షియం ఉండటం వల్ల ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా మన జుట్టు, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బాదం పప్పులు తరచూ తినడం వల్ల చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు, వృద్ధాప్య ఛాయ‌లు తొల‌గిపోయి చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఈ బాదంపప్పుకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే శక్తి బాగా ఉంటుంది. ప్రతిరోజూ నాన‌బెట్టిన బాదం తినడంతో లైంగిక సామ‌ర్థ్యం పెర‌గ‌డంతో పాటు పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య బాగా పెరుగుతుంది. అలాగే బాదం నూనె కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బాదం నూనె రాసుకోవ‌డంతో చ‌ర్మం ముడ‌త‌లుపోయి న‌వ య‌వ్వ‌నంగా క‌న‌బ‌డుతుంది. బాదంనూనె వల్ల కండ‌రాల నొప్పులు తగ్గిపోతాయి. నాన‌బెట్టి పొట్టు తీసిన బాదం ప‌ప్పు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజాలు ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు.


Related News

Health Tips: ఖాళీ కడుపుతో ఈ ఆహారం తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదం తెలుసా !

Drinking alcohol before sleep : రాత్రి నిద్రపోయేముందు మద్యం సేవిస్తున్నారా?.. ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది జాగ్రత్త!

Study on Men: మగాళ్లు మాయమైపోతారా? 2040 నాటికి ఆ గండం!

Weight Loss Drink: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

Pizza Dosa: ఇంట్లోనే పిల్లల కోసం పిజ్జా దోశ ఇలా చేసేయండి, ఒక్కటి తింటే చాలు పొట్ట నిండిపోతుంది

Golden Face Pack: ముఖాన్ని బంగారంలా మెరిపించే ఫేస్ ప్యాక్ ఇదే

Laryngeal Cancer: గొంతులో నొప్పి.. బొంగురు మాటలు.. స్వరపేటిక క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త!

Big Stories

×