EPAPER
Kirrak Couples Episode 1

Cashew Nuts: జీడిపప్పు తింటే ఇన్ని లాభాలా

Cashew Nuts: జీడిపప్పు తింటే ఇన్ని లాభాలా

Cashew Nuts:ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం నట్స్ తింటుంటారు. ఎక్కువగా బాదంపప్పు తినడానికి ఇష్టపడతారు. కానీ బాదంపప్పు కంటే జీడిపప్పులో కూడా మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి. చాలా వరకు మన భారతీయులు పలు కూరల్లో ఈ జీడిపప్పును పేస్టు రూపంలో వేస్తుంటారు. కూరలకు మంచి రుచి కూడా వస్తుంది. ఇక కొందరు జీడిపప్పును నెయ్యిలో వేయించుకొని తింటారు. అలాగే వేయించి ఉప్పు కారం చల్లుకొని తింటారు. ఎలా తిన్నా దీంట్లోని అద్భుత పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. దీనిని సూపర్ హెల్తీఫుడ్‌గా పిలుస్తారు. అయితే దీన్ని మోతాదులోనే తీసుకోవాలి. లేకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ జీడిపప్పులో ఉండే పోషకాల విషయానికి వస్తే 30 గ్రాముల జీడిపప్పు ద్వారా మనకు 155 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే తొమ్మిది గ్రాముల కార్బోహైడ్రేట్లు, ఐదు గ్రాముల ప్రోటీన్లు, తక్కువ మోతాదులో విటమిన్ బి6, విటమిన్ కె10, కాల్షియం కూడా మనకు లభిస్తాయి. జీడిపప్పులో మెగ్నీషియం, జింక్, కాపర్, పాస్పరస్, పోలిక్ యాసిడ్లు అధికంగా ఉంటాయి. దానివల్ల మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మనకి కలుగుతాయి. జీడిపప్పు తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. నిత్యం తగిన మోతాదులో ఈ జీడిపప్పును తినడం వల్ల రక్తసంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. రక్తహీనత కూడా ఏర్పడదు. శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. దీంతోపాటు కాపర్‌ కూడా తగ్గిపోతుంది. కాబట్టి నిత్యం జీడిపప్పును తింటే కాపర్ పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనత ఏర్పడకుండా చూస్తుంది. ఈ జీడిపప్పు వల్ల మన కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీడిపప్పును నిత్యం తింటే అందులో ఉండే జియాజాన్తిన్ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కంటి రెటీనాపై సురక్షితమైన పోరను ఏర్పాటు చేస్తుంది. దీంతో మన కళ్లని రక్షించుకోవచ్చు. జీడిపప్పు నుంచి తీసే నూనె మన చర్మాన్ని సంరక్షిస్తుంది. ఈ నూనెలో జింక్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి శరీరాన్ని సంరక్షిస్తాయి. చర్మ క్యాన్సర్లు రాకుండా చేస్తాయి. జీడిపప్పులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కానీ ఇవి ఇతర పదార్థాల్లా బరువు పెంచవు, తగ్గిస్తాయి. నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. జంతు సంబంధ పదార్థాల్లో ఉండే కొవ్వు మన శరీర బరువు పెంచుతుంది. కానీ ఈ జీడిపప్పు వృక్ష సంబంధిత జాతికి చెందినది. దీంట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి మన బరువును తగ్గిస్తాయి. జీడిపప్పులో పాలిమోనో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాలను తగ్గిస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి. బరువు తగ్గించుకోవాలంటే నిత్యం జీడిపప్పు తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే జీడిపప్పు తిన్నా, ఆ నూనెను నేరుగా వాడినా వెంట్రుకలు సంరక్షించబడతాయి. ఈ జీడిపప్పులో కాపర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం వెంట్రుకల్లో ఉండే మెలని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో మన జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది.


Tags

Related News

UTI and Fridge: మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడటానికి ఇంట్లో ఉండే ఫ్రిజ్ కూడా కారణమే, అదెలాగంటే..

Chapati On Gas: చపాతీలను నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే

Egg Curry Recipe: కొబ్బరిపాలతో ఎగ్ కర్రీ.. బిర్యానీకి జతగా టేస్ట్ అదిరిపోతుంది..

Protein Rich Food: ఈ 5 పదార్థాల్లో చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్

Black Nose: ముక్కు నల్లగా మారిపోయిందా? అయితే మీకు ఆ వ్యాధి వచ్చినట్టే, జాగ్రత్త పడండి

Besan For Skin Glow: శనగపిండితో ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయం

Potato Stuffed Egg Bonda: పొటాటో స్టఫ్డ్ ఎగ్ బోండా రెసిపీ, ఇంట్లోనే పిల్లల కోసం సింపుల్ స్నాక్

Big Stories

×