E-Paper
Advertisement

Insomnia Problems : నిద్రలేమి సమస్యలను దూరం చేసే స్మార్ట్ ఫోన్స్..

Insomnia Problems : నిద్రలేమి సమస్యలను దూరం చేసే స్మార్ట్ ఫోన్స్..
Advertisement
Insomnia Problems

Insomnia Problems : ఈరోజుల్లో మాటలు రాని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఇది మంచిది కాదని తెలిసినా కూడా ఫోన్లను మాత్రం దూరం పెట్టలేకపోతున్నారు. దీని వల్ల టీనేజర్లకు చదువుపై శ్రద్ధ ఉండడం లేదని వాళ్ల తల్లిదండ్రులు వాపోతున్నారు. కానీ టీనేజర్లకు స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఉండడం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..!

రోజంతా ఫోన్ ఉపయోగించినా ఉపయోగించకపోయినా.. నిద్రపోయే ముందు మాత్రం కాసేపైనా ఫోన్ ఉపయోగించే అలవాటు దాదాపు అందరికీ ఉంటుంది. అయితే టీనేజర్ల పడుకునే ముందు ఫోన్ ఉపయోగించడం దేనికి దారితీస్తుంది అనే విషయంపై ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ ఫోన్‌లో యూట్యూబ్, మ్యూజిక్ యాప్స్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్.. అన్నీ ఉండేలా చూసుకున్నారు. 12 నుండి 18 మధ్య వయసున్న 600 టీనేజర్లను వారు ఈ స్టడీ కోసం సెలక్ట్ చేసుకున్నారు.

Advertisement

మామూలుగా పడుకునే ముందే టీనేజర్ల మైండ్ ఎక్కువ వేగంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలాంటి సమయంలోనే వారికి ఎన్నో చెడు ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. ఆ సమయంలో వారికి వచ్చే నెగిటివ్ ఆలోచనల నుండి దృష్టి మళ్లించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వారికి నచ్చే పాట వినడం, సినిమా చూడడం, గేమ్ ఆడడం లాంటివి నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుందని శాస్త్రవేత్తలు అన్నారు.

631 మంది టీనేజర్లలో టెక్నాలజీ అనేది నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది అన్న విషయాన్ని 23.6 శాతం మంది సమర్ధించారు. 38.4 శాతం మంది ప్రతీసారి అలా జరగకపోయినా.. అప్పుడప్పుడు జరుగుతుందని అన్నారు. అయితే పూర్తిగా పడుకునే ముందు టెక్నాలజీకి అడిక్ట్ అవ్వడం కూడా మంచిది కాదని.. వారికి ఉన్న నిద్రలేమి సమస్యలను దూరం చేయడానికి ఇంక ఇతర మార్గాలు ఆలోచించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×