EPAPER
Kirrak Couples Episode 1

Skin Care Tips: ఈ టిప్స్‌తో న్యాచురల్‌గా మెరిసిసోతారు

Skin Care Tips: ఈ టిప్స్‌తో న్యాచురల్‌గా మెరిసిసోతారు

Skin Care Tips: ఆరోగ్య సమస్యలతో పాటు కాలుష్యం కూడా చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా ముఖంపై మొటిమలు, ముడతలు ఏర్పడతాయి. కాలుష్యం కారణంగా చాలా మంది స్కిన్ తేమను కోల్పోవడం ప్రారంభిస్తుంది. దీంతో చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, చర్మ కణాలలో కొల్లాజెన్ పరిమాణం తగ్గడం వల్ల ముఖంపై నల్ల మచ్చల సమస్య కూడా పెరుగుతుంది.


సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా, చర్మం టోన్, పొడిబారడం మొదలవుతుంది. ఫలితంగా ముఖం, మెడ చర్మం నల్లబడటం ప్రారంభమవుతుంది. సూర్యరశ్మి, కాలుష్యం వల్ల చర్మంలో మెలనిన్ ప్రభావం పెరగడం మొదలవుతుంది. అంతే కాకుండా ముఖంపై ఫైన్ లైన్స్ ఏర్పడతాయి.

అందుకే కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వడం మంచిది. వీటి వల్ల చర్మం రంగు మారకుండా ఉంటుంది. అంతే కాకుండా చర్మం అందంగా మెరుస్తుంది. మరి గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని రకాల టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయండి:
ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే, చర్మంపై పొరపై దుమ్ము, దూళి కణాలు చేరతాయి. ఇది ఇన్ఫెక్షన్ , ముఖంపై అదనపు నూనెలు పేరుకుపోవడానికి కారణమవుతుంది. అంతే కాకుండా మొటిమలు, నలుపు తెలుపు మచ్చను కూడా కలిగిస్తుంది. అందుకే చర్మాన్ని క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిపోతాయి.

రెగ్యులర్ క్లెన్సింగ్:
చర్మాన్ని క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కాలుష్యం వల్ల కలిగే దుష్ప్రభావాలకు దూరంగా ఉండవచ్చు. ఇందుకోసం మైల్డ్ ఫేస్ వాష్‌తో ముఖాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది చర్మాన్ని లోతు నుంచి శుభ్రం చేస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఉండే దుమ్ము కణాలు కూడా దీని వల్ల తొలగిపోతాయి. ముఖాన్ని రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా కడగాలి. ఆ తర్వాత మెత్తని టవల్ , క్లాత్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు మాయం అవుతుంది.

యాంటీ పొల్యూషన్ ఫేస్ మాస్క్:
యాంటీ పొల్యూషన్ ఫేస్ మాస్క్ ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే దుమ్ము, ధూళి పూర్తిగా శుభ్రపడతాయి. అంతే కాకుండా ముఖంపై ఉన్న చర్మం శుభ్రంగా , మృదువుగా మారుతుంది. చర్మ పోషణ కోసం, వారానికి రెండుసార్లు ఫేస్ మాస్క్ వేయండి. దీని కారణంగా, చర్మంపై టానింగ్ పోవడం ప్రారంభమవుతుంది. మొదటగా డీప్ క్లెన్సింగ్ చేసి ఆ తర్వాత, ఫేస్ మాస్క్ వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా చర్మం మృదువుగా మారుతుంది.

సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి:
కాలుష్యం వల్ల కలిగే నష్టం నుంచి మీ ముఖాన్ని రక్షించుకోవడానికి, సన్ స్కీన్ లోషన్ వాడండి. సన్‌స్క్రీన్ వృద్ధాప్య ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దుమ్ము, దూళి కణాలు ముఖంపై చేరకుండా రక్షిస్తుంది. అంతే కాకుండా ముఖం అందంగా మెరుస్తూ కనిపించడానికి ఉపయోగపడుతుంది.

Also Read: ముల్తానీ మిట్టితో.. మొటిమలు మాయం

మీ ముఖాన్ని రక్షించుకోండి:
కాలుష్యం నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి, క్యాప్ , గొడుగు, స్కార్ప్ వంటివి ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు తప్పకుండా తీసుకెళ్లండి. ఇవి సూర్య కిరణాల ప్రభావాల నుండి ముఖాన్ని కాపాడతాయి. అంతే కాకుండా ముఖం మెడపై టానింగ్ సమస్య కూడా ఉండదు.

ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి . మీ ఆహారంలో విటమిన్-సి, విటమిన్-ఇ , ఒమేగా-3 వంటి పోషకాలు ఉన్న నారింజ, బాదం, అవిసె గింజలు మొదలైన వాటిని తగిన మొత్తంలో చేర్చండి. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి, కాలుష్య ప్రభావాన్ని కూడా నివారిస్తాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Multani Mitti For Skin Glow: ముల్తానీ మిట్టితో.. మొటిమలు మాయం

Homemade Hair Oil: తెల్లజుట్టును నల్లగా మార్చే ఆయిల్ ఇదే !

Coffee Benefits: రోజూ కాఫీ తాగితే ఇన్ని లాభాలా.. అలవాటు లేకపోతే ఇవి మిస్ అవుతున్నట్లే!

Chili Garlic Chicken Fry: వెల్లులి కారంతో కోడి వేపుడు.. తినే కొద్దీ తినాలనిపిస్తుంది..

Olive Oil: ఆలివ్ ఆయిల్ అంత ఖరీదు ఎందుకు? ఆరోగ్యానికి అంత మంచిదా?

Banana: 30 రోజుల పాటు తరచూ అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?

Big Stories

×