Black Spots Removal: ముఖంపై మొటిమలు, మచ్చలు మీ అందాన్ని తగ్గిస్తాయి. అందుకే వీటిని తగ్గించడం కోసం చాలా మంది బయట దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొని వాడుతుంటారు.
ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు కూడా చాలా సార్లు వీటిని తగ్గించలేవు. ఆయుర్వేదం ప్రకారం నల్ల మచ్చలు తగ్గించడానికి కొన్ని రకాల పదార్థాలు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇవి చర్మానికి మెరుపును తిరిగి తీసుకురాగలవు.
చాలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ముఖంపై మొటిమలను తగ్గించే హోం రెమెడీస్ తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి మార్కెట్ నుండి ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. అన్ని పదార్థాలు ఇంట్లోనే సులభంగా దొరుకుతాయి. శనగపిండి, రోజ్ వాటర్, గంధం, పసుపులతో ఈ హోం రెమెడీని తయారు చేసుకోవచ్చు.
1. పసుపు, శనగపిండితో హోం రెమెడీ:
కావలసినవి:
పసుపు- 1 టీ స్పూన్
శనగపిండి- 1 టేబుల్ స్పూన్
వాటర్- 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో పసుపు, శనగపిండి, వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇలా తరుచుగా చేయడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. ముఖంపై నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి.
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శనగ పిండిలో ఎక్స్‌ఫోలియేటింగ్ సామర్థ్యం ఉంటుంది. ఈ రెండు పదార్థాల కలయిక చర్మానికి చాలా మేలు చేస్తుంది. మచ్చలను రాకుండా చేస్తుంది.
2. గంధం, గులాబీ రేకులతో హోం రెమెడీ:
కావలసినవి:
గంధం పొడి- 1 టేబుల్ స్పూన్
గులాబీ రేకుల పేస్ట్- 1 టీ స్పూన్
నీరు – తగినంత
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో గంధం పొడి, గులాబీ రేకుల పేస్ట్ తీసుకుని ఒక గిన్నెలో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది ముఖంపై మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ ఆయుర్వేద స్క్రబ్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల ముఖం మెరుస్తుంది.
Also Read: శనగపిండిలో ఇవి కలిపి రాస్తే.. ఎవ్వరైనా తెల్లగా అవ్వాల్సిందే !
3. గంధం, బాదం పేస్ట్ తో హోం రెమెడీ:
కావలసినవి:
గంధం పొడి – 1 టేబుల్ స్పూన్
బాదం పేస్ట్- 1 టేబుల్ స్పూన్
వాటర్ – తగినంత
తయారీ విధానం: గంధం పొడి, బాదం పేస్ట్ లను ఒక బౌల్‌లోకి తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 15- 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గంధ, బాదంతో తయారుచేసిన పేస్ట్ ముఖం యొక్క సహజ గ్లోను పునరుద్ధరించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ పేస్ట్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, ఫైన్ లైన్‌లు తొలగిపోతాయి. గంధం, బాదం రెండూ చర్మానికి మేలు చేస్తాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.