EPAPER

Thanks Giving Day : కృతజ్ఞతల పండుగ.. థాంక్స్ గివింగ్ డే..!

Thanks Giving Day : కృతజ్ఞతల పండుగ.. థాంక్స్ గివింగ్ డే..!
Thanks Giving Day

Thanks Giving Day : మనిషి సంఘజీవి. తోటివారి సాయం లేకుండా. ఒక్కరోజు కూడా మనిషి లైఫ్ ముందుకు సాగటం సాధ్యం కాదు. జీవితంలో నేడు మనం సాధించిన ఉన్నతి వెనక ఎందరో తెలిసిన, తెలియని వ్యక్తుల శ్రమ, త్యాగం ఉన్నాయనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఈ లిస్టులో ముందువరుసలో పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ ఉండటం తెలిసిందే. అలాంటివారిని తలచుకుని, వారికి థాంక్స్ చెప్పే ప్రత్యేక వేడుకే ఈ ‘థాంక్స్ గివింగ్ డే’.


ఈ పండుగ.. అమెరికాలో మొదలైంది. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1789 నవంబర్ 26న ‘థాంక్స్ గివింగ్ డే’ని ప్రారంభించారు. అప్పటినుంచి ఏటా నవంబరు 26న ఈ పండుగ జరిగేది. కానీ.. అబ్రహాం లింకన్ అధ్యక్షుడైన తర్వాత నవంబరులో వచ్చే నాల్గవ గురువారం రోజున దీనిని జరుపుకోవాలని నిర్ణయించారు. దీంతో నేటికీ ఆ రోజునే దీనిని జరుపుకుంటున్నారు.

ఏడాది పాటునా పనిపాటల్లో బిజీగా ఉండే అమెరికన్లు.. నేడు తమ ఆత్మీయుల ఇంటికి వెళ్లి, వారికి బహుమతులిచ్చి, వారితో సమయం గడిపి, వారికి మనసారా థాంక్స్ చెప్పివస్తారు. పేరుకు నవంబరు నాల్గవ గురువారమే అయినా.. ఈ రోజు నుంచి నవంబరు చివరివరకు ఈ వేడుకలు కొనసాగుతూనే ఉంటాయి. అమెరికాకు భిన్నంగా కెనడాలో అక్టోబర్ రెండవ సోమవారం థ్యాంక్స్‌ గివింగ్‌ డే వేడుకను జరుపుకుంటారు.


అమెరికాలో థాంక్స్ గివింగ్ డేని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. పండుగ మర్నాడు.. అమెరికన్లు బ్లాక్ ఫ్రైడే జరుపుకుంటారు. ఈ సందర్భంగా అన్ని ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో మెగా షాపింగ్ మేళాలు నడుస్తాయి.

భారత్‌లో పెద్దగా దీనిని సెలబ్రేట్ చేసుకోనప్పటికీ.. బ్రెజిల్, కెనడా, జర్మనీ, జపాన్‌తో సహా పలు దేశాల్లో ఈ వేడుకలు జరుపుకుంటారు.

ఏమీ ఆశించకుండా తోటివారి కోసం త్యాగమో, సాయమో చేసిన వారిని స్మరించుకునే ఈ గొప్ప పండుగ పుట్టింది అమెరికాలో కావచ్చు గానీ.. నిజానికి ఇది అందిరిదీ. సో… ఇంకెందుకు ఆలస్యం.. మీరూ మిమ్మల్ని అభిమానించి, ఆదరించిన ఆత్మీయులకు కనీసం ఫోన్ కాల్ అయినా.. చేసి రెండు మాటలు మాట్లాడి, వారు చేసిన సాయాన్ని గుర్తు చేసి, మనసారా ‘థాంక్స్’ చెప్తారు కదూ..!

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×