EPAPER

Chicken Side Effects: తరుచుగా చికెన్ తింటున్నారా.. ఇక మీ పని అంతే !

Chicken Side Effects: తరుచుగా చికెన్ తింటున్నారా.. ఇక మీ పని అంతే !

Side Effects Of Eating Chicken: నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. ఎంతలా అంటే రోజు చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65, చేసుకుని తినేంత. నాన్ వెజ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చికెన్. అయితే కొంతమంది చికెన్ తో చేసిన ఆహార పదార్థాలను తరుచుగా తింటూ ఉంటారు. ఇలా ఎక్కువగా చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.


మనం ఆరోగ్యంగా ఉండడానికి తాజా పండ్లు, కూరగాయలు తినడం ఎంత ముఖ్యమో మాంసాహారం కూడా తినడం అంతే ముఖ్యం. కానీ అలా అని ఎక్కువగా తినకూడదు. ఇది ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. చికెన్ తరచూ తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటుకు ఛాన్స్:
చికెన్ ఎక్కువగా తినడం వల్ల మన బాడీలో కొవ్వు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో సోడియం కూడా అధికమౌతుందని హెచ్చరిస్తున్నారు. సోడియం ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

2017లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం తురుచూ చికెన్ తినే వ్యక్తులకు రక్తపోటు వచ్చే అవకాశం 50% ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పోషకాహార డాక్టర్లు కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు. చికెన్ తింటే రక్తపోటు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. చికెన్ ఎక్కువగా తినకపోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు.
బరువు పెరుగుతారు:
చికెన్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తరుచుగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రై చికెన్ తింటే ఆరోగ్యానికి మరింత ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటి తయారీలోనే మసాలాలు ఇతర పదార్థాలు ఎక్కువగా వాడతారు. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.


చికెన్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అయితే ఎక్కువగా తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అంతే కాకుండా బాడీలో వేడి కూడా చేరుతుంది. ఇంకా చికెన్ ఎక్కువ రోజులు తింటే బరువు మరింత పెరుగుతుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు చెబుతున్నారు. చికెన్ లో ఉండే ప్రోటీన్ జీర్ణమై రక్తంలో కలిసేందుకు 48 గంటలు పడుతుంది. చికెన్ తింటే తొందరగా ఆకలి అంతగా వెయ్యదు. ఇతర చిరుతిళ్లు తినాలని కూడా అనిపించదు.

చికెన్ తినడం ప్రారంభించిన కొన్ని రోజులకే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఏ చికెన్ వల్ల బరువు పెరుగుతారో అదే చికెన్ వల్ల బరువు కూడా పెరుగుతారు. చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రొటీన్ పెరుగుతుంది. ఎక్కువగా చికెన్ తింటే అది జీర్ణం అయి కొలెస్ట్రాల్ గా మారుతుంది. దీనిని శరీరం నిల్వ చేసుకుంటుంది. దీంతోనే తగ్గిన బరువు తిరిగి పెరగడం మొదలవుతుంది. ప్రోటీన్ వల్ల కండరాలకు శక్తి వస్తుంది. రోజు చికెన్ తింటూ వ్యాయామం చేసే వారికి బాడీ పెరుగుతుంది.

Also Read: తేనెతో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం !

వారానికి రెండుసార్లు లేక అంతకుమించి చికెన్ తినేవారికి హార్ట్ ఎటాక్స్ సహా రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు 7% దాకా ఉన్నాయి. అందుకు కారణం చికెన్ లో ఉండే అధిక కొవ్వు. ఆరు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. చికెన్ తక్కువగా తినేవారి కంటే ఎక్కువ తినేవారు త్వరగా చనిపోతున్నారు.
ఎక్కువగా చికెన్ తినేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఎపిడెమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ జర్నల్‌ ద్వారా వెల్లడించారు. ఎనిమిదేళ్ల కాలంలో 4.5 లక్షల మందిపై అధ్యయనం జరిపి చికెన్ అధికంగా తిరిగే వారికి మూడు రకాల క్యాన్సర్లు వస్తున్నాయని తేల్చారు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×