EPAPER

Healthy Rotis: రోటీ చపాతీ అనగానే గోధుమపిండితో చేసేదే కాదు వీటిని కూడా ప్రయత్నించండి, ఆరోగ్యానికి మంచిది

Healthy Rotis: రోటీ చపాతీ అనగానే గోధుమపిండితో చేసేదే కాదు వీటిని కూడా ప్రయత్నించండి, ఆరోగ్యానికి మంచిది

Healthy Rotis: రోటీ అనగానే అందరికీ గోధుమ పిండితో చేసే చపాతీలే గుర్తొస్తాయి. నిజానికి అనేక రకాల రోటీలు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఇతర రోటీల గురించి తెలుసుకుందాం. రోటీలు భారతదేశంలో ప్రధాన ఆహారంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో రోటీలను తిని జీవించేవారు ఎక్కువమంది. వివిధ రకాల ధాన్యాలతో రోటీలను తయారు చేస్తారు. అయితే ఎక్కువగా గోధుమపిండి రొట్టెలను ఇష్టపడేవారే ఎక్కువ. కేవలం గోధుమపిండి చపాతీయే కాదు ఇతర ఆరోగ్యకరమైన రోటీల గురించి కూడా తెలుసుకోండి.


సజ్జల రోటీ
చిరుధాన్యాల్లో ఒకటైన సజ్జలతో రోటీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సజ్జలను పిండిలా మార్చి చపాతీలు, రోటీలు ప్రయత్నించాలి. వీటిలో పోషకాలు నిండుగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం, పొటాషియం, ఇనుము వంటివి కూడా నిండి ఉంటాయి. ఇవి భారతీయ సాంప్రదాయ ఆహారంలో భాగంగా మారిపోయాయి. ముఖ్యంగా శీతాకాలంలో వీటిని ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. సజ్జల రోటీ తినడం వల్ల గ్లూటెన్ శరీరంలో చేరదు. ముఖ్యంగా దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కావలసినంత హిమోగ్లోబిన్ ను శరీరానికి అందిస్తుంది. రక్తహీనత సమస్య కూడా రాదు. డయాబెటిస్ ఉన్నవారు సజ్జలతో చేసిన రోటీని తినడం చాలా ముఖ్యం. ఈ రోటీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

రాగి రోటి
రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రాగుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఫింగర్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. రాగుల్లో క్యాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు రాగులను ఆహారంలో భాగం చేసుకోవాలి. రాగి రోటీని తినడం వల్ల శరీరానికి కాల్షియం పుష్కలంగా అందుతుంది. ఆర్థరైటిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే రాగి రోటీలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. రాగుల్లో కొవ్వు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. మధుమేహాన్ని నిర్వహించడంలో ఇది కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.


Also Read: బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి ప్రతిరోజూ తినమని చెబుతున్న పోషకాహార నిపుణులు, ఇలా తింటే ఏమవుతుంది?

జొన్న రొట్టె
జొన్న పిండిలో డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, క్యాల్షియం, ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు అందుతాయి. జొన్నల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడేవారు జొన్న రోటిని తరచూ తింటూ ఉండాలి. జొన్నల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బలమైన రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారి నుండి శరీరాన్ని కాపాడతాయి. దీనిలో ఉండే అధిక ఫైబర్, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

మల్టీ గ్రెయిన్ రోటీ
గోధుమలు, ఓట్స్, బార్లీ, చిరుధాన్యాలు కలిపి చేసే పిండితో ఈ మల్టీ గ్రెయిన్ రోటీలను తయారుచేస్తారు. వీటిలో పోషకాలు ఎక్కువనే చెప్పాలి. వీటిల్లో ఫైబర్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. మల్టీ గ్రెయిన్ రోటీలో చాలా పోషక విలువలు ఎక్కువ. ఇది జీవక్రియకు అవసరమైన పదార్థాలను అందిస్తుంది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను, ఫైబర్ ను కలిగి ఉంటుంది. అలాగే గుండెకు అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. రక్త ప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఈ రోటీ ముందుంటుంది. కాబట్టి అన్నిటితో పోలిస్తే మల్టీ గ్రెయిన్ రోటీ ఆరోగ్యానికి మంచిదనే చెప్పాలి.

Related News

Street Food: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? ప్రాణాలు పోతాయ్.. హెచ్చరిస్తున్న డాక్టర్స్

Soda Drinks: సోడాలంటే మీకు ఇష్టమా? ఇక వాటిని మరిచిపోతే మంచిది, లేకుంటే ప్రాణానికి ప్రమాదం కావచ్చు

Quiet Love: ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని నిశ్శబ్దంగా ప్రేమిస్తే అతడిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి

Gun Powder: ఇడ్లీ, దోశెల్లోకి గన్ పౌడర్ ఇలా చేసి పెట్టుకుంటే రెండు నెలలు తాజాగా ఉంటుంది

Night Skincare Routine: రాత్రి పూట ప్రతి రోజు వీటిని ముఖానికి రాస్తే.. గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ

Grapes Vs Raisins: ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఈ రెండింటిలో ఏది బెటర్ ? ఎవరు, ఎప్పుడు తినాలో తెలుసా..

Alum For Skin: పటికను వాడే బెస్ట్ మెథడ్ ఇదే.. ఎలాంటి చర్మ సమస్యలైనా పరార్

×