EPAPER

Heat Wave: వేసవిలో గుండెకు రిస్క్.. హీట్ వేవ్ కారణంగా పెరుగుతున్న మరణాలు!

Heat Wave: వేసవిలో గుండెకు రిస్క్.. హీట్ వేవ్ కారణంగా పెరుగుతున్న మరణాలు!

Heat Wave And Heart Attacks: వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి వేడి కారణంగా మరణాలు 370% పెరిగే అవకాశం ఉందని నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ నిపుణులు వెల్లడించారు.పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మరణాల సంఖ్యను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవడం అవసరం. లేదంటే 2050 నాటికి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.


ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవారు వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.ఎండ వేడిమి కారణంగా సంభవిస్తున్న మరణాలు ప్రపంచ స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా హీట్ స్ట్రోక్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా మరణాల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు.

నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ (NPCC) నిపుణుల అభిప్రాయం ప్రకారం, 1991, 2000తో పోలిస్తే 2013 -2022 మధ్య హీట్ వేవ్ కారణంగా మరణాలు 85% పెరిగాయి. భూమి ఈ స్థాయిలో వేడెక్కడం ఉష్ణోగ్రతలు పెరగడం కొనసాగితే..2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 370% మరణాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.


Also Read: భోజనం త్వరగా చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

వేడి ఆరోగ్యానికి ముప్పు:
పశ్చిమ అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, వేసవి కాలంలో రోజువారీ సాధారణ ఉష్ణోగ్రత 4.7 డిగ్రీల సెల్సియస్ పెరిగితే గుండెపోటు కేసులు 2.6% పెరుగుతాయి.భారత్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మావలంకర్ తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అత్యవసర సమయంలో మాత్రమే మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లండి.వేడిని నివారించడానికి, ఫ్యాన్ లేదా కూలర్‌ని ఉపయోగించండి. తేలికగా మరియు వదులుగా ఉండే దుస్తులను ధరించండి.  చర్మాన్ని తేమగా ఉంచుకోవడం మంచిది. విపరీతమైన వేడి ఉన్నప్పుడు తగినంత నీరు త్రాగండి.
శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు తినే ఆహారంలో సీజనల్ పండ్లు కూరగాయలను తీసుకోండి.
మసాలా, జంక్ ఫుడ్స్ తినడం మానుకోవడం మంచిది.

Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×