EPAPER

Home Remedies For Hair: బియ్యం నీటితో పొడవాటి జుట్టు

Home Remedies For Hair: బియ్యం నీటితో పొడవాటి జుట్టు

Home Remedies For Hair : జుట్టు అందంగా ఉంటే మనం మరింత అందంగా కనిపిస్తాము. కానీ ప్రస్తుతం మారిన జీవనశైలితో పాటు అనేక అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు రాలే సమస్యను ఎదుర్కుంటారు. ఈ సమస్యతో ఇబ్బంది పడే వారిలో చాలా మంది బయట మార్కెట్ లో దొరికే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అనే చెప్పవచ్చు. కానీ కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.


ముఖ్యంగా జుట్టు రాలడంతో పాటు జుట్టు చివర్లు చీలిపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జుట్టు మూలాల నుండి చివర్ల వరకు పోషకాహారం లేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది, దీని కారణంగా జుట్టు బలహీనంగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు అందం తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, బియ్యం నీరు ఈ సమస్యకు గొప్ప పరిష్కారం. వెంట్రుకలను బలంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలను రైస్ వాటర్ కలిగి ఉంది.

బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలి ?


ముఖ్యంగా మొదటిది, మీ జుట్టును షాంపూతో బాగా కడగాలి. తద్వారా జుట్టు శుభ్రంగా మారుతుంది.
దీని తర్వాత, వెంట్రుకలపై, ముఖ్యంగా జుట్టు యొక్క మూలాలతో పాటు చివర్లలో బియ్యం నీటిని స్ప్రే చేయండి.
దీనిని జుట్టుకు పట్టించాక 20-30 నిమిషాలు అలాగే ఉంచండి. తద్వారా జుట్టుకు కుదుళ్లకు పూర్తిగా పడుతుంది.
దీని తర్వాత సాధారణ నీటితో జుట్టును కడగాలి. మీరు దీన్ని వారానికి 1-2 సార్లు కూడా చేయవచ్చు.

Also Read: ఇవి వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

బియ్యం నీళ్లలో విటమిన్ బి, విటమిన్ ఇ, మినరల్స్ తో పాటు అమినో యాసిడ్స్ వంటివి ఉంటాయి. ఇవి జుట్టుకు బలాన్ని అందిస్తాయి. దీనితో పాటు, ఇందులో ఉండే ఇనోసిటాల్ అనే మూలకం జుట్టును రిపేర్ చేయడంతో పాటు చివర్ల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు యొక్క నిర్మాణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జుట్టును మందంగా, బలంగా, మెరిసేలా చేస్తుంది.

రైస్ వాటర్ అనేది సహజమైన, చవకైన సమర్థవంతమైన హోం రెమెడీ. ఇది జుట్టు సంరక్షణలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా జుట్టు చివర్ల సమస్యతో బాధపడేవారికి ఇది ఒక వరం అని చెప్పవచ్చు. దీనిని రెగ్యులర్ వాడకంతో, జుట్టు బలంగా, ఆరోగ్యంగా మారుతుంది. మీరు రసాయన ఉత్పత్తులతో విసిగిపోయి హోం రెమెడీస్ కోసం చూస్తున్నట్లయితే, బియ్యం నీరు మీ జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు అవసరమైన పోషకాలను అందించడానికి బియ్యం నీరు ఉపయోగపడుతుంది . తరుచుగా బియ్యం నీరు వాడటం వల్ల జుట్టు ఒత్తుగా,ఆరోగ్యంగా పెరుగుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Beetroot for Intercourse: మీలో ఆ కోరికలు తగ్గుతున్నాయా? బీట్ రూట్ ట్రై చెయ్యండి బాస్!

Milk adulteration: కల్తీ పాలను గుర్తించడం ఎలా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా కనిపెట్టేయొచ్చు

Potato Biryani: ఆలూ బిర్యాని ఇలా చేశారంటే పావుగంటలో రెడీ అయిపోతుంది, వేడివేడిగా తినేయొచ్చు రెసిపీ ఇదిగో

Adulterants Food Items: కల్తీ ఆహారాన్ని గుర్తించేది ఎలా? తేనె నుంచి మాంసం వరకు.. ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి

Pizza Sauce Recipe: ఇంట్లోనే పిజ్జా సాస్ ఇలా తయారు చేసుకుంటే.. బయట కొనే అవసరం ఉండదు

Yoga For Back Pain: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా ? వీటితో క్షణాల్లోనే దూరం

Big Stories

×