EPAPER

Rice Flour Face Packs: బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

Rice Flour Face Packs: బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

Rice Flour Face Packs For Healthy Skin and Glowing Skin: ముఖం కాంతి వంతంగా, అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. కానీ ప్రస్తుత రోజుల్లో జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు వల్ల చర్మ సంబంధిత సమస్యలు రావడం సాధారణంగా మారుతున్నాయి. ఒక్కొక్క సారి ఫేస్ డల్‌గా కనిపించడం, ముఖం వాడిపోయినట్లు కనిపిస్తుంది. ముఖంపై మొటిమలు రావడం, మచ్చలు ఏర్పడటం ప్రతి ఒక్కరికి సర్వసాధారణం.. వీటికోసం బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ వాటివల్ల ప్రయోజనం ఉండదు.. చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే దొరికే పదార్ధాలతో చర్మాన్ని కాపాడుకోవచ్చు.. ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. ఇందుకోసం బియ్యపిండి ఉంటే చాలు.. ఇది మచ్చలను తొలగించడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. కొరియన్ మహిళలు ఎక్కువగా ముఖానికి, జుట్టుకు బియ్యంపిండిని ఉపయోగిస్తుంటారు. బియ్యాన్ని నానబెట్టి ఆ నీటిని వాడతారు. అందుకే వారు అంతలా మెరిసిపోతుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బియ్యంపిండితో ఓసారి ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి.


బియ్యంపిండి, పసుపు ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో బియ్యంపిండి తీసుకుని అందులో చిటికెడు పసుపు, రెండు టేబుల్ స్పూన్ పాలు కలిపి వాటిని బాగా మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పసుపులో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మచ్చలు, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. పసుపు ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

బియ్యంపిండి, తేనె ఫేస్ ప్యాక్


ఒక బౌల్‌లో అవసరాన్ని బట్టి బియ్యం పిండి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. ముఖంపై మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

Also Read: మటన్ బోన్ సూప్ చేయడం చాలా సులువు, ఇలా చేసుకుని తింటే కాల్షియం లోపం కూడా రాదు

బియ్యంపిండి, రోజ్ వాటర్..
నాలుగు టేబుల్ స్పూన్ బియ్యంపిండిలో రోజ్ వాటర్ కలపి ముఖానికి అప్లై చేయండి. 5-10 నిమిషాలు తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. మచ్చలు తొలగిపోతాయి.

బియ్యంపిండి, మిల్క్ క్రీమ్
బియ్యంపిండిలో మిల్క్ క్రీమ్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 5-10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు, డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి.

బియ్యంపిండి, పెరుగు
ఒక గిన్నెలో అవసరరాన్ని బట్టి బియ్యంపిండి తీసుకొని అందులో కొంచె పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి. వీటిలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖఛాయను మెరుగుపరుస్తుంది. మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Honey For Face: తేనెతో ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Big Stories

×