EPAPER

Rainy season Skin Problems : వర్షాకాలంలో చర్మ సమస్యలు.. పాటించాల్సిన చిట్కాలు!

Rainy season Skin Problems : వర్షాకాలంలో చర్మ సమస్యలు.. పాటించాల్సిన చిట్కాలు!

Rainy season Skin Problems | మండే ఎండల నుంచి ఉపశమనం తీసుకొచ్చే వర్షా కాలం.. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా వర్షా కాలంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో వివిధ చర్మ సంబంధితన సమస్యలుంటాయి. వర్షా కాలంలో ముఖ్యంగా అయిదు రకాల చర్మ సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలకు ఇంట్లో చిట్కాలతోనే పరిష్కరించుకోవచ్చు.


1. ఆక్నె (మొటిమలు) : వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడంతో శరీరంలో చెమట, నూనె ఉత్పత్రి ఎక్కువగా జరుగుతుంది. వీటి వల్ల ముఖం, చేతులు, వీపు భాగాల్లో మొటిమల సమస్య ఎదరవుతుంది. అయితే ఈ సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు.

చిట్కాలు:
టీ ట్రీ ఆయిల్ లో కొద్దిగా గోరువెచ్చని నీరు కలుపుకొని మొటిమలున్న ప్రదేశంలో పూయండి. టీ ట్రీ ఆయిల్ లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడంతో ఇది మొటిమలను సమస్య తగ్గిస్తుంది.
తేనె సినామన్ మాస్క్: తేనెలో కొద్దిగా సినామన్ పొడిని కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ కు యాంటి ఇన్‌ఫ్లెమెటరీ గుణాలున్నాయి. దీని వల్ల యాక్నె సమస్య తగ్గి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.


2. ఫంగల్ ఇన్‌ఫెక్షన్
వర్షాకాలంలతో తేమ వాతావరణం కారణంగా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సమస్యలు చాలామందికి వస్తుంటాయి. రింగ్ వార్మ్, అథెలీట్ ఫూట్, ఈస్ట్ ఇన్‌ఫెక్షన్స్. ఈ సమస్యలన్నీ వర్షాకాలంలో చాలా కామన్. అయితే వీటి వల్ల చర్మానికి చాలా హాని జరుగుతుంది.

చిట్కాలు:
వేపాకు: వేప చెట్టు ఆకులను నీటిలో మరిగించి, చల్లార్చిన తరువాత ఇన్‌ఫెక్షన్ అయిన చర్మాన్ని ఆ నీటితో కడగాలి. వేపాకులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుండడంతో ఇన్‌ఫెక్షన్ సమస్యలకు ఇది మంచి ఔషధి గా వైద్యులు కూడా సూచిస్తారు.
పసుపు పేస్ట్: పసుపులో కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ గా చేసుకొని ఇన్‌ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో పూయాలి. పసుపులోని యాంటీ ఫంగల్ గుణాలు, గాయం త్వరగా మానే గుణాలు ఇన్‌ఫెక్షన్ సమస్యకు చెక్ పెట్టడానికి ఉపయోగపడతాయి.

Also Read: నెల రోజుల పాటు ఈ డైట్ ప్లాన్ ఫాలో అయితే మెరిసిపోయే చర్మం మీ సొంతం

3. ఎగ్జీమా: వర్షాకాలంలో చర్మ పొడిబారడం చూస్తూనే ఉంటాం. ఈ సమస్య తీవ్రమైతే ఎగ్జీమా గా మారుతుంది. దీని వల్ల చర్మం పొడిగా ఉన్న ప్రాంతంతో ఎక్కువ దురదగా ఉండడం, మంట పెరిగిపోవడం జరుగుతుంది.

చిట్కాలు:

ఓట్ మీల్ బాత్: గోరువెచ్చని నీటిలో ఒక కప్పు ఓట్ మీల్ బాగా కలపాలి, 15 నిమిషా తరువాత స్నానం చేయాలి. ఓట్ మీల్ నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలో తేమ శాతం పెరుగుతుంది.
కొబ్బరి నూనె: ఎక్స్ ట్రా వర్జిన్ ఆయిల్ ని ఎగ్జీమా ఉన్న ప్రాంతంలో పూయాలి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు ఎగ్జీమా సమస్యను తగ్గిస్తాయి.

4. ప్రిక్లీ హీట్: వర్షా కాలం తొలి భాగంలో ఈ సమస్య వస్తుంది. ప్రిక్లీ హీట్ సమస్య వల్ల చర్మంలో రాషెస్ వస్తాయి. దురుద ఎక్కువై ఎర్రని బొబ్బలు కనిపిస్తాయి.

చిట్కాలు:
అలో వేరా జెల్: తాజా అలో వేరా జెల్ ని సమస్య ఉన్న చర్మానికి పూయాలి. ఆలోవేరా లో మంటను చల్లార్చే గుణం, ప్రిక్లీ హీట్ సమస్యకు మంచి ఔషధిగా పనిచేస్తుంది.
బేకింగ్ సోడా: ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి రాషెస్ ఉన్న ప్రాంతంలో పూయాలి. దీని వల్ల దురద తగ్గిపోతుంది.

5. స్కిన్ అలర్జీ: వాతావరణంలో తేమ కారణంగా చాలామందికి స్కిన్ అలర్జీ సమస్య వస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారి ఎర్రగా మారుతుంది. దురద, రాషెస్ కనిపిస్తాయి.
చిట్కాలు:
యాపిల్ సైడర్ వినిగార్: నీటిలో యాపిల్ సైడర్ వినిగార్ ని కలిపి కొంచెం దూది (కాటన్ ప్రత్తి) ని బాల్ లాగా చేసుకొని యాపిల్ సైడర్ వినిగార్ మిశ్రమంలో కొద్దిగా ముంచి అలర్జీ ఉన్న ప్రాంతంలో పూయాలి. దీని వల్ల చర్మంలోని పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది.

పై చెప్పిన చిట్కాలతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పరిశుభ్రత చాలా ముఖ్యం. వీలైనంత వరకు ఇతరులతో మీ వస్తువులు షేర్ చేసుకోవద్దు. ఎవరికైనా అలర్జీలు ఉంటే వారికి దూరంగా ఉండండి. ఆహారంలో కూడా చర్మానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవాలి. చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటే.. వెంటనే డెర్మటాలజిస్ట్ ని సంప్రదించండి.

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×