EPAPER

Pumpkin Face Mask: ఈ ఫేస్ మాస్క్‌తో ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి తెలుసా ?

Pumpkin Face Mask: ఈ ఫేస్ మాస్క్‌తో ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి తెలుసా ?

Pumpkin Face Mask: చర్మం కాంతివంతంగా మెరిసిపోతూ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం మార్కెట్లో దొరికే, కెమికల్స్‌తో తయారు చేసిన అనేక క్రీములను వాడుతూ ఉంటారు. వీటి వల్ల చర్మం ఎంతో దెబ్బతింటుంది. అలాంటి వారు సహజ సిద్ధంగా తయారు చేసుకునే ఫేస్ మాస్కులను గురించి తెలుసుకోవడం ఉత్తమం. మనకు అందుబాటులో ఉండే గుమ్మడి కాయలు తినడానికే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయి.


ముఖానికి మాస్క్ లాగా కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇమ్యూనిటీ పెంచే విటమిన్ ఏ, ఇ, సితో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, జింక్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం, బీటా కెరోటిన్ గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. మరి ముఖ సౌందర్యానికి గుమ్మడికాయ ఫేస్ మాస్క్ ఏ విధంగా ఉపయోగపడుతుంది. దీనిని తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మానికి ఎంతో మంచిది :
గుమ్మడి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీంతో తయారు చేసిన ఫేస్ మాస్క్ ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు, గీతలు తగ్గుతాయి. అంతే కాకుండా మృదువైన, కాంతివంతమైన చర్మాన్ని కూడా ఇది అందిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ ఏను చర్మానికి అందిస్తుంది. ఫలితంగా డ్యామేజ్ అయిన చర్మంపై ఇది కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా పిగ్మెంటేషన్ సమస్యలు కూడా దూరం చేస్తుంది. దీంతో పాటుగా ఇందులో ఉండే జింక్, సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.


గుమ్మడి కాయలో ఉండే సహజమైన పోషకాలు చర్మానికి పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న గుమ్మడికాయఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • పావు కప్పు గుమ్మడి కాయ ముక్కలు
  • ఒక టేబుల్ స్పూన్ తేనె
  • కొద్దిగా దాల్చిన చెక్క

తయారీ విధానం..
గుమ్మడికాయ, తేనె, దాల్చిన చెక్క పొడిని మూడింటినీ తీసుకుని మెత్తటి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని తరచూ ముఖానికి, మెడ, చేతులపై అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి. ఈ పేస్ట్‌ను ఫ్రిజ్‌లో 15 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. కానీ గాలికి బయట పెడితే పాడై పోతుంది. గాలి చొరబడని డబ్బాలో ఉంచడం మరచిపోకండి. ఈ ఫేస్ మాస్క్ వేసుకొని తీసేసిన తర్వాత మీ స్కిన్ టోనర్ తప్పకుండా మారుతుంది. చర్మంపై లేయర్‌లాగా దీనిని అప్లై చేసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.

Also Read: కివీ ఫ్రూట్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ సమస్యలన్నీ మాయం

గుమ్మడికాయ ఆకులు మలబద్ధకానికి, పేగుల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. గుమ్మడికాయలో ఉంటే విటమిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గుమ్మడికాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పలేనన్ని. గుమ్మడి కాయ ఆకులు, కాయలు, పండ్లు అన్నింటి వల్ల కూడా లాభాలు ఉన్నాయి. మార్కెట్‌లో కనిపిస్తే దీనిని అస్సలు వదిలిపెట్టకండి.

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×