EPAPER
Kirrak Couples Episode 1

Protein Rich Food: ఈ 5 పదార్థాల్లో చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్

Protein Rich Food: ఈ 5 పదార్థాల్లో చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్

Protein Rich Food: మన శరీరానికి ప్రొటీన్ చాలా ముఖ్యం. శరీరాన్ని బలోపేతం చేయడానికి, ఇది తగినంత పరిమాణంలో తీసుకోవాలి. కండరాలను బలోపేతం చేయడంతో పాటు, దెబ్బతిన్న కండరాలను వేగంగా సరిచేయడానికి ప్రోటీన్ ప్రభావవంతగా పనిచేస్తుంది. చాలా మందికి ప్రొటీన్ ఫుడ్ అనగానే గుడ్లు, చికెన్ మాత్రమే గుర్తుకు వస్తుంది. గుడ్లు ,చికెన్ మాత్రమే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటారని అనుకుంటారు, కానీ ఈ భావన పూర్తిగా తప్పు. ప్రొటీన్ పుష్కలంగా ఉండే అనేక శాఖాహార ఆహారాలు ఉన్నాయి. ఇవి తింటే శరీరంలో ఎప్పుడూ ప్రొటీన్ లోపం ఉండదు. మరి అలాంటి 5 శాఖాహార ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ 5 శాఖాహార ఆహారాలు అద్భుతాలు చేస్తాయి..

పప్పులు: పప్పు దినుసుల్లో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది . మినప పప్పు,శనగ పప్పు, పెసర పప్పు ఇలా అనేక రకాల పప్పులు అందుబాటులో ఉన్నాయి. మీరు వీటిని పప్పు, పరాటా, కూరగాయలతో కలిపి ఆహార పదార్థాలను తయారు చేసి తినవచ్చు. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ప్రోటీస్ అధిక మొత్తంలో ఉంటుంది. అందుకే ఇది శరీర పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తరుచుగా పప్పును డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.


సోయాబీన్: సోయాబీన్‌లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది వివిధ రకాల ఆహార పదార్థాల్లో దీనిని ఉపయోగించవచ్చు. తరుచుగా సోయా బీన్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. సోయాబీన్ లో ఉండే ప్రోటీన్ కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కండరాలు సంక్రమంగా పని చేసేలా చేస్తుంది.

బాదం: నట్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బాదంలో ప్రోటీస్ అధిక మోతాదులో ఉంటుంది. బాదంపప్పులో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. బాదం పప్పులను అల్పాహారంలో, చిరుతిండిగా, పెరుగులో కలిపి తినడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. పిల్లలకు బాదం తినిపించడం వల్ల శరీర పెరుగుదల చాలా బాగుంటుంది. అంతే కాకుండా వారి కండరాల పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది.

పన్నీర్: పన్నీర్‌లో ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది పాలతో తయారు చేయబడిన శాఖాహారం. దీనిని దీన్ని కూరగాయలతో, పనీర్ టిక్కా రూపంలో తినవచ్చు. తరుచుగా పన్నీర్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. పన్నీర్ లోని ప్రోటీన్ కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

Also Read: పని, వ్యక్తిగత జీవితాల మధ్య నలిగిపోతున్నారా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే

బ్రౌన్ రైస్: వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ , ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని పప్పులు లేదా కూరగాయలతో కలిపి తినవచ్చు. అంతే కాకుండా టిఫిన్స్ కూడా తయారు చేసుకుని తినవచ్చు.

ఇతర ప్రొటీన్ రిచ్ ఫుడ్స్..
బీన్స్
పుట్టగొడుగులు
క్వినోవా
వాల్‌నట్స్

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Egg Curry Recipe: కొబ్బరిపాలతో ఎగ్ కర్రీ.. బిర్యానీకి జతగా టేస్ట్ అదిరిపోతుంది..

Black Nose: ముక్కు నల్లగా మారిపోయిందా? అయితే మీకు ఆ వ్యాధి వచ్చినట్టే, జాగ్రత్త పడండి

Besan For Skin Glow: శనగపిండితో ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయం

Potato Stuffed Egg Bonda: పొటాటో స్టఫ్డ్ ఎగ్ బోండా రెసిపీ, ఇంట్లోనే పిల్లల కోసం సింపుల్ స్నాక్

Health Tips: పని, వ్యక్తిగత జీవితాల మధ్య నలిగిపోతున్నారా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే

Skin Care Tips: ఈ టిప్స్‌తో న్యాచురల్‌గా మెరిసిసోతారు

Big Stories

×