Potato Manchurian: బంగాళదుంపలతో చేసిన వంటకాలు ఏవైనా అందరూ ఇష్టంగా తింటారు. ఇక్కడ మేము ఆలూ మంచూరియా రెసిపీ ఇచ్చాము. చికెన్ మంచూరియా, ఎగ్ మంచూరియాలాగే పొటాటో మంచూరియా కూడా రుచి అదిరిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. సాయంత్రం పూట ఏదైనా తినాలనిపిస్తే ఇలా మంచూరియా చేసుకునేందుకు ప్రయత్నించండి. పక్కన టమోటో కెచప్ తో ఈ ఆలు మంచూరియా తింటే రుచి అదిరిపోతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
ఆలు మంచూరియా రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు – రెండు
మిరియాల పొడి – ఒక స్పూను
మైదాపిండి – రెండు స్పూన్లు
కార్న్ ఫ్లోర్ – ఒక స్పూను
టమాటో కెచప్ – ఒక స్పూను
డార్క్ సోయాసాస్ – ఒక స్పూను
చిల్లీ పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
ఉల్లికాడల తరుగు – ఒక స్పూను
అల్లం – చిన్న ముక్క
నూనె – వేయించడానికి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
వెల్లుల్లి – నాలుగు రెబ్బలు
మిరియాల పొడి – అర స్పూను
నిమ్మరసం – ఒక స్పూను
Also Read: చాక్లెట్లు అధికంగా తినే అమ్మాయిలకు మొటిమలు వచ్చే అవకాశం ఉందా?
పొటాటో మంచూరియా రెసిపీ
1. బంగాళదుంపలను పైన తొక్క తీసి మరుగుతున్న నీళ్లలో ముక్కలు కోసి వేయాలి.
2. అందులో చిటికెడు ఉప్పు కూడా వేయాలి. అలా అని మెత్తగా ఉడికే వరకు ఉంచకూడదు.
3. ఒక ఐదు నిమిషాలకి స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కలను ఒక గిన్నెలో వేయాలి.
4. మీకు మంచూరియన్ ముక్కలు ఏ సైజులో కావాలనుకుంటున్నారో పొటాటో ముక్కలను అదే సైజులో కోసుకోవాలి.
5. ఆ పొటాటో ముక్కల్లో ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనెను వేసుకోవాలి.
7. ఈ బంగాళదుంప ముక్కలను అందులో విడివిడిగా వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి.
9. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి.
10. తర్వాత సోయా సాస్, మిరియాల పొడి, చిటికెడు ఉప్,పు టమోటా కెచప్ , చిల్లీ పేస్ట్, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అలాగే పావు కప్పు నీళ్లు కూడా పోయాలి. ఆ పావు కప్పు నీళ్లు మిశ్రమం లో బాగా కలిసేలా చూసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసి టాస్ చేసుకోవాలి. ఆ నీళ్ళల్లో ఉన్న గ్రేవీ అంతా ఇంకి చిక్కగా అయ్యేవరకు కలుపుకోవాలి. తర్వాత పైన ఉల్లికాడలను చల్లుకోవాలి. అంతే టేస్టీ ఆలూ మంచూరియా రెడీ అయినట్టే. దీని రుచి అదిరిపోతుంది. తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది.
కొంతమంది బంగాళదుంపలను ఉడకబెట్టి కూడా చేస్తూ ఉంటారు. అలా చేసినవి త్వరగా మెత్తగా అయిపోతాయి. ఇలా సగం ఉడికిన బంగాళదుంపలతో చేస్తే ముక్క కాస్త గట్టిగా ఉంటుంది. శాకాహారులు ఇలా అప్పుడప్పుడు బంగాళదుంప మంచూరియా ను ప్రయత్నించండి. దీని రుచి అదిరిపోతుంది. పక్కన టమోటో కెచప్ లో ఉంచుకొని తింటే ఆ రుచే వేరు. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. పొటాటో మంచూరియాను ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్లలో కూడా పరిచయం చేస్తున్నారు. ఎగ్ మంచూరియా, చికెన్ మంచూరియా అలాగే పొటాటో మంచూరియా అదిరిపోవడం ఖాయం. మీ పిల్లలకు ఎప్పుడైనా ఇది పెట్టి చూడండి. వారికి ఈ వంటకం కచ్చితంగా నచ్చితేరుతుంది.