EPAPER

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Potato For Skin Glow: ముఖం కాంతివంతంగా ఉండేందుకు మార్కెట్లో అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి చాలా ఖరీదైనవి. అంతే కాకుండా వీటిని ఉపయోగించడం వల్ల తాత్కాలిక మెరుపు మాత్రమే వస్తుంది. అందుకే ఇలాంటి ప్రొడక్ట్స్ వాడకుండా హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. డబ్బు కూడా ఖర్చు కాదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోం రెమెడీస్ వాడటం అందరూ అలవాటు చేసుకోవడం మంచిది.


బంగాళ దుంపతో తయారు చేసిన హోం రెమెడీస్ వాడటం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మొటిమలు కూడా తగ్గుతాయి. మరి చర్మ సౌందర్యం కోసం బంగాళ దుంప వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు, బంగాళదుంపను ఫేస్‌కి ఎలా వాడాలి అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళదుంపలో ఉండే గుణాలు చర్మ సంరక్షణకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు ముఖంలోని మృతకణాలను తొలగించి, చర్మంలోని పాత మెరుపును పునరుద్ధరించి చర్మాన్ని మృదువుగా మార్చుతాయి.


బంగాళదుంపను ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

1. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది:
బంగాళదుంపలో 80% నీరు ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా బంగాళ దుంప రసాన్ని తరుచుగా ముఖానికి వాడటం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. ముఖం అందంగా కనిపిస్తుంది.

2. వాపును తగ్గిస్తుంది:
బంగాళాదుంపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి వాపు , ఎరుపును తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చర్మం ఎల్లప్పుడూ మెరిసేలా చేస్తాయి.

3. డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది:
బంగాళదుంపలో బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోయేలా చేస్తాయి. ఫేస్ పై ఉన్న మృత కణాలను తొలగిస్తాయి.

4. మొటిమలతో పోరాడుతుంది:
బంగాళాదుంపలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

5. ముడతలు, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది:
బంగాళదుంపలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తద్వారా ముడతలు, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది.

6. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:
బంగాళదుంపలో ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

Also Read: ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

బంగాళాదుంపను ముఖానికి ఎలా ఉపయోగించాలి ?

పచ్చి బంగాళదుంప:
ఒక బంగాళాదుంపను కడిగి తురుముకోవాలి. మిక్స్ చేసి రసాన్ని తీసి ముఖం, మెడకు పట్టించాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో కడగాలి. ఫేస్ ప్యాక్‌కు తేనె, పెరుగును కూడా కలుపుకోవచ్చు.

ఉడకబెట్టిన బంగాళదుంపలు:

ఒక బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేయాలి. దానికి కొంచెం పాలు , తేనె కలపండి. దీన్ని ముఖం, మెడపై రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో కడగాలి.   ఇలా బంగాళదుంపను తరుచుగా ముఖానికి వాడటం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు  కూడా తగ్గుతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Bitter Gourd Juice For Diabetes: కాకరకాయ జ్యూస్‌తో షుగర్ కంట్రోల్.. మరెన్నో లాభాలు

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Big Stories

×