EPAPER

Pomegranate Peel Face Pack: ఈ ఫేస్ ప్యాక్ వాడితే మేకప్‌తో లేకుండానే మెరిసిపోతారు

Pomegranate Peel Face Pack: ఈ ఫేస్ ప్యాక్ వాడితే మేకప్‌తో లేకుండానే మెరిసిపోతారు

Pomegranate Peel Face Pack: దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు.దానిమ్మనే కాదు తొక్కలు కూడా చర్మానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం దానిమ్మ తొక్క చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇటువంటి లక్షణాలు దానిమ్మ తొక్కలో ఉన్నాయి. ఇవి ముఖం యొక్క గ్లో మెయింటైన్‌లో సహాయపడతాయి.


యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు దానిమ్మ తొక్కలలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. దానిమ్మ తొక్కల నుండి ఫేస్ ప్యాక్‌లను తయారు చేయడంతో పాటు దానిమ్మ తొక్కలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు: 
చర్మాన్ని మెరుగుపరుస్తాయి: దానిమ్మ తొక్కలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి కాంతివంతంగా చేస్తాయి.


ముడతలను తగ్గిస్తుంది: దానిమ్మ తొక్కలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముడతలను తగ్గించి, చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడతాయి.

మొటిమలను తొలగిస్తుంది: దానిమ్మ తొక్కలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలతో పాటు మచ్చలను కూడా తగ్గిస్తాయి.

చర్మానికి పోషణనిస్తుంది: దానిమ్మ తొక్కలు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా మెరుస్తూ ఉండేలా చేస్తాయి.

చర్మాన్ని టోన్ చేస్తుంది: దానిమ్మ తొక్క చర్మం రంగును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా రంగును టోన్ చేస్తుంది.

దానిమ్మ తొక్కలతో ఫేస్ ప్యాక్ తయారీ ?
కావలసినవి:
దానిమ్మ తొక్కలు – 2-3
పెరుగు – 2 టీస్పూన్లు
తేనె – 1 టీస్పూన్
నిమ్మరసం – కొన్ని చుక్కలు

తయారీ విధానం: 
ముందుగా దానిమ్మ తొక్కలను కడిగి నీడలో ఆరబెట్టాలి.రెండు రోజులు ఇలా ఆరబెట్టిన తర్వాత ఎండిన తొక్కలను మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో దానిమ్మ పొడి, పెరుగు, తేనె , నిమ్మరసం వేసి కలపాలి. దీనిని చిక్కటి పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.

Also Read:  మెరిసే చర్మం కోసం.. గులాబీలతో ఫేస్ క్రీమ్

ఇతర ఫేస్ ప్యాక్‌లు:
దానిమ్మ , శనగపిండి ఫేస్ ప్యాక్: 1 టేబుల్ స్పూన్ దానిమ్మ పొడిలో 1 టీ స్పూన్ శనగపిండిని కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి అంతం మంచిది కాదు.

దానిమ్మ, పసుపు ఫేస్ ప్యాక్: దానిమ్మ పొడిలో పసుపు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మం అందంగా మారేలా చేస్తుంది. తరుచుగా దానిమ్మ తొక్కలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ వాడటం వల్ల చర్మం మెరిసిపోతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Yoga For Eye Sight: ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఇలా చేస్తే చాలు

Rose Cream: మెరిసే చర్మం కోసం.. గులాబీలతో ఫేస్ క్రీమ్

Daily Skin Care: డైలీ ఇలా ఫేస్ క్లీన్ చేసుకుంటే.. మీ అందం రెట్టింపు

Kiwi Fruit: ఈ ఫ్రూట్‌ విటమిన్ సి యొక్క పవర్ హౌజ్.. తింటే చెప్పలేనన్ని లాభాలు

Memory Increase: మతిమరుపు ఎలా మొదలవుతుంది ? ఎప్పుడు జాగ్రత్త పడాలి

Henna: హెన్నాలో ఈ ఒక్కటి కలిపితే జుట్టు బాగా పెరుగుతుంది తెలుసా ?

Big Stories

×