EPAPER

Pigeon Diseases to Human: పావురాలతో ప్రాణాలకే ముప్పు.. జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే !

Pigeon Diseases to Human: పావురాలతో ప్రాణాలకే  ముప్పు.. జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే !

Pigeon Diseases to Human: పావురాలంటే చాలా మందికి ఇష్టం. పావురాలను ఇళ్లలో పెంచుకోవటంతో పాటు బయట ప్రాంతాల్లో వాటితో గడిపేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. అయితే ఆ పావురాల వల్లే మనిషి ప్రాణాలకు ముప్పు ఉందని మీకు తెలుసా? పావురాల వల్ల మనిషి ప్రాణాలకే ముప్పు కలుగుతోంది అని రీసెంట్‌‌ గా ఒక స్టడీలో కనుగొన్నారు. పక్షులు, సాధు జంతువులను ఇళ్లలో పెంచుకోవడం వాటికి ఆహారం ఇవ్వడం సహజం, ఐయితే ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో పక్షులు తక్కువగా కనిపిస్తున్నాయి, కానీ ఎక్కువగా కనిపించేది మాత్రం పావురాలు.


డాబాల మీద. రేషన్ షాపులో. ఆహార పదార్థాలు దొరికే ప్రదేశాల్లో రోడ్ల పక్కన గుంపులు గుంపులుగా పావురాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు వంటి జంటనగరాల్లో పావురాలు ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉన్నాయి. కానీ పావురాలు కనిపించాయి కదా అని వాటి వద్దకు వెళ్తే ఇక అంతే సంగతి. ప్రాణాంతక వ్యాధులు కోరి కొని తెచ్చుకుంటున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును ఇది వాస్తవం. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసి, రాయబారి పాత్ర పోషించే పావురాలు ఇప్పుడు ఇన్ఫెక్షన్లు, వ్యాధులను కారకాలుగా మారుతున్నాయి.

పావురాలకు మూత్రకోశం లేకపోవడం వల్ల విసర్జనలోనే మలమూత్రాలు విసర్జిస్తాయి. వీటి రెట్ట నుంచి విసర్జక సూక్ష్మజీవులు గాల్లో కలిసిపోతాయి. వీటి రెక్కల ఈకల ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏసీలోకి చేరతాయి. ఆ గాలిని పీల్చుకోవడం వల్ల వ్యాధు బారిన పడాల్సి వస్తుంది. అయితే ఈ విషయం తెలియని చాలా మంది పావురాలతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు.


మీరు ప్రమాదకరమైనవిగా భావించని పావురాలు బాల్కనీలు, ఇంటిపైకప్పులపై పావురాల రెట్టలు అలర్జీలకు కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పావురాల వల్ల ప్రాణాంతక వ్యాధి వస్తుంది . అవును పావురాల రెట్ట వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు చాలా వరకు వస్తున్నాయి. రీసెంట్‌గా ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల బాలుడు పావురపు రెట్టలు వల్ల తీవ్రమైన అలర్జీకి గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

పావురాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు:
పావురాలతో వచ్చే వ్యాధులు, జలుబు, జ్వరంతో మొదలవుతాయి. ఆయాసం ముఖ్యంగా కొంత మందిలో ఇది చాలా సీరియస్‌గా ఉంటుంది. దీన్ని కనుక్కోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు తీవ్రమై పోయి వారిని వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తోంది. రానురానూ సీరియస్ అయిపోతుంది. అలర్జీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే పావురమే కదా అని దగ్గరికి వెళ్లారో వ్యాధులకు ఆహ్వానం పలికినట్టే అవుతుంది.

Also Read: తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

నివారణ:
ఈ వ్యాధిని నివారించడానికి ఇంటి చుట్టూ ఉన్న పావురాల ఇళ్లను తొలగించడం చాలా ముఖ్యం. పావురాలు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రాకుండా, గూడు కట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి . పావురాలు ఇంట్లోకి రాకుండా నెట్ ఉపయోగించండి. ఇంటిపై కప్పుపై, పరిసరాల్లో తరచూ శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసే ముందు చేతులకు. ముక్కుకు మాస్క్ ధరించండి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×