EPAPER

Pasta Kheer: పాస్తా పాయసాన్ని ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు

Pasta Kheer: పాస్తా పాయసాన్ని ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు
పాస్తాను ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్‌లో తినేందుకు ఇష్టపడతారు. దీంతో చేసే మసాలా పాస్తా రెసిపీ రుచిగా ఉంటుంది. కేవలం పాస్తాను బ్రేక్ ఫాస్ట్‌లోనే కాదు, స్వీట్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. పాస్తా పాయసాన్ని ఒకసారి చేసి చూడండి. ఎంత రుచిగా ఉంటుందో పాస్తా పాయసం ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ఇలా ఫాలో అయిపోతే టేస్టీ పాస్తా ఖీర్ రెడీ అయితుంది.
పాస్తా పాయసం తయారీకి కావలసిన పదార్థాలు 
పాస్తా – ఒక కప్పు
కుంకుమ పువ్వు – చిటికెడు
బాదం, పిస్తా, కాజు – గుప్పెడు
కిస్‌మిస్‌లు – పది
నెయ్యి – ఒక స్పూను
యాలకుల పొడి – అర స్పూను
చక్కెర – ముప్పావు కప్పు
పాలు – ఒక లీటరు
పాస్తా పాయసం రెసిపీ
⦿ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నీళ్లు వేసి మరిగించండి.
⦿ ఆ నీళ్లల్లో చిటికెడు ఉప్పు కొద్దిగా నూనె వేయండి.
⦿ పది నిమిషాలు నీళ్లు మరిగిన తర్వాత పాస్తాను వేసి ఉడికించండి.
⦿ పాస్తా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి ఆ నీటిని వడకట్టండి.
⦿ పాస్తాను చల్లటి నీళ్లలో వేయండి. తర్వాత ఆ పాస్తాన్ని తీసి పక్కకు పెట్టుకోండి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పాలు పోయండి.
⦿  పాలను మరిగించండి. పాలు మరుగుతున్నప్పుడు ఉడికించిన పాస్తాను కూడా అందులో వేసి కలుపుకోండి.
⦿ చక్కెరను కూడా వేసి బాగా కలపండి.
⦿ ఇప్పుడు యాలకుల పొడిని, కుంకుమ పువ్వుని కూడా వేసి బాగా కలుపుకోండి.
⦿ మరొక చిన్న కళాయిలో నెయ్యి వేసి బాదం, పిస్తా, కాజు, కిస్మిస్ వంటివి వేసి ఫ్రై చేసుకోండి.
⦿ ఈ డ్రై ఫ్రూట్స్ ను పాయసంపై వేసి గార్నిష్ చేయండి.
⦿ అంతే టేస్టీ పాస్తా పాయసం రెడీ అయినట్టే.
⦿ ఎవరైనా ఇంటికి అతిధులు వస్తున్నప్పుడు ఒకసారి ఈ పాస్తా పాయసాన్ని వండి చూడండి. వారికి బాగా నచ్చుతుంది.
పాస్తాను ఉడికించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దాన్ని పూర్తిగా ఉడికిస్తే అది ముద్దగా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి 80 శాతం మాత్రమే ఉడికించాలి. పంచదారను మరీ ఎక్కువగా కలపకండి. ఆ స్వీట్ ను మీరు తినలేరు. ఉన్నంతలో తక్కువ పంచదారతోనే ఈ ఖీర్‌ని చేసుకోండి. కుంకుమపువ్వు వేసుకోవాలా వద్దా అన్నది పూర్తిగా మీ ఇష్టం. కుంకుమపువ్వు వల్ల ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయి. కాబట్టి వేసుకుంటే మంచిది. ఈ పాస్తా పాయసాన్ని పండుగల్లో ప్రసాదాలుగా కూడా వినియోగించవచ్చు. పాస్తా తీరును ఒకసారి తిని చూడండి. ఆ తర్వాత మీరే దాని మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేందుకు ఇష్టపడతారు.


Related News

Coffee face mask: కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ మొత్తం పోతుంది, మెరిసిపోతారు

Bone Health: ఎముకలకు ఉక్కు లాంటి బలాన్నిచ్చేవి ఇవే !

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

Kumkum: ఇంట్లోనే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×