EPAPER

Parenting Tips : పిల్లలతో మీరు నిద్రిస్తున్నారా.. మీకో హెచ్చరిక..!

Parenting Tips : పిల్లలతో మీరు నిద్రిస్తున్నారా.. మీకో హెచ్చరిక..!

 


Children Sleeping Tips
Children Sleeping Tips

Children Sleeping Tips : దేశంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తారు. వారు కూడా పిల్లలు రాత్రి వేళల్లో వారి పక్కనే ఉండాలని భావిస్తారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇతర దేశాల్లో ఇలా ఉండదు. పిల్లలకు కొంత వయసు వచ్చాక వారికి వేరేగది కేటాయిస్తారు. పిల్లలకు ప్రైవసీ ఇస్తారు. కానీ మనదేశంలో ఇలా పిల్లలకు సపరేట్‌గా గదిని కేటాయించడం చాలా అరుదు. ఎందుకంటే దేశంలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి.

తల్లిదండ్రులతో కలసి నిద్రించడానికి చాలా మంది పిల్లలు ఇష్టపడుతుంటారు. పిల్లలపై ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ చాలా ఎక్కువగా చూపిస్తారు. పిల్లలు ఒంటిరిగా పడుకుంటే రాత్రి జరగకూడని ప్రమాదాలు ఏవైనా జరుగుతాయని అనుకుంటారు. పిల్లలకి ఎంత వయసు వచ్చినా పక్కనే పడుకుంటారు. అది అమ్మాయిల విషయంలో మరీ ముఖ్యం. అయితే పిల్లలకు ఒక వయసు వచ్చాక వారి పక్కన పడుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


READ MORE : ఫాస్టింగ్ చేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

పిల్లలతో గడపడాన్ని తల్లిదండ్రులు చాలా ఆనందంగా భావిస్తారు. ఒకవేళ పిల్లలు దూరంగా హాస్టల్ లేదా వేరే చోట ఉంటే ఈ ప్రేమ మితిమీరిపోతుంది. కొందరు తల్లిదండ్రులు బిడ్డ నిద్రపోతున్నా.. తమ బిడ్డను నిద్రపుచ్చాలని ఆరాటపడుతుంటారు. తల్లిదండ్రులకు తమ పిల్లలతో ఏ వయస్సు వరకు నిద్రించాలో పెద్దగా తెలియదు. పిల్లలకు ఒంటరిగా పడుకునే అలవాటు చేయాలని తెలియదు. అసలు పిల్లలకు ఓ వయసు నుంచి ఒంటరిగా పడుకోవడం అలవాటు చేయాలో తెలుసుకుందాం.

దేశంలో పిల్లలు దాదాపు 14 నుండి 15 సంవత్సరాల వయస్సు వరకు వారి తల్లిదండ్రులతో పడుకుంటారు. కొందరి పిల్లలకైతే తల్లిదండ్రులపై కాలు వేయందే నిద్రరాదు. అయితే ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే.. పిల్లలు వేరేచోట పడుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారని ఓ పరిశోధనలో తేలింది.

అయితే పిల్లలకు చిన్నప్పుడు నుంచే ప్రత్యేక గదులు ఇవ్వండం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ప్రత్యేక గది కేటాయించడానికి 3 నుండి 4 సంవత్సరాల వయస్సు సరైనదని అంటున్నారు. ఈ వయసులో ఒంటరిగా నిద్రపోయే అలవాటు చేస్తే మానసికంగా బలంగా ఉంటారు.

పిల్లలు వారి తల్లిదండ్రులతో నిద్రపోవడం వల్ల ధైర్యంగా ప్రశాంతంగా పడకుంటారు. అలానే పిల్లలతో తల్లిదండ్రుల బంధం కూడా ధృడపడుతుంది. అయినప్పటికీ.. పిల్లలను 3 నుంచి 4 ఏళ్లు వచ్చేసరికి వేరేగా పడుకునే అలవాటు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పిల్లలు మిడిల్ ఏజ్‌కు చేరుకున్నప్పుడు తల్లిదండ్రులుతో పడుకోవడం మానేయాలి. పిల్లలు మిడిల్ ఏజ్‌కు వచ్చినప్పుడు వారికి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇది వారి ఫీలింగ్స్‌ను ట్యూన్ చేయడానికి సహాయపడుతుంది. అలానే పిల్లలకు ప్రత్యేక గది కేటాయించడం వల్ల వారిలో బాధ్యతా భావం పెరుగుతుంది. వారి ఇండిపెండెంట్‌గా ఉంటారు. స్వతహాగా ఆలోచించే జ్ఞానం పెరుగుతుంది.

READ MORE : మీ పొట్టలో ఇవి పడితే.. పొట్ట క్యాన్సర్ రావడం ఖాయం!

పిల్లలకు ఒక వయసు వచ్చాక.. ప్రతిదీ గమనిస్తారు. కాబట్టి పిల్లలను పడుకోబెట్టుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ప్రతిపరిస్థితి చిన్న వయసులో వారి మనసుపై ముద్రపడుతుంది. కాబట్టి పిల్లలకు ప్రత్యేక గది కేటాయించడం వారి భవిష్యత్తు‌కు ఆరోగ్యకరమైన అలవాటని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Disclaimer : ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×