Peanuts or Chickpeas: పల్లీలు, వేరుశనగలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే వీటిలో ఏవి తినాలన్నది ఎక్కువమందిలో ఉన్న సందేహం. ఈ రెండింటిలో ఏమి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. కొమ్ము శనగలు, వేరుశనగలు ఈ రెండిట్లో కూడా పోషకాలు నిండుగా ఉంటాయి. వీటితో వండే వంటలు టేస్టీగా ఉంటాయి. నిజానికి ఈ రెండూ సీడ్స్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. ఈ రెండింటితో కూడా క్రంచీగా, క్రిస్పీగా ఉండే అనేక రెసిపీలు రెడీ అవుతాయి. ఈ రెండింటిలో ఏది తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.
వీటిలోని పోషకవిలువలు
వేరుశనగలు, కొమ్ము శనగలు రెండింటిలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. వేరుశనగల్లో కేలరీలు అధికం 100 గ్రాముల వేరుశెనగ తింటే 567 క్యాలరీలు అందుతాయి. అలాగే అధిక ప్రోటీన్ కూడా ఇందులో ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా లభిస్తాయి. మన చర్వానికి అవసరమైన విటమిన్ ఈ, మెగ్నీషియం వంటివి ఎక్కువ మొత్తంలో దీనిలో ఉంటాయి. ఇక కొమ్ము శనగలు విషయానికొస్తే వీటిలో కేలరీలు చాలా తక్కువ 100 గ్రాములకు 164 క్యాలరీలు మాత్రమే అందుతాయి. ప్రోటీన్ కూడా మంచి మొత్తంలోనే ఉంటుంది. అలాగే ఫైబర్, ఫోలేట్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తినడం కూడా ఎంతో మంచిది.
ప్రొటీన్ ఫుడ్
వేరుశనగలు, కొమ్ము శెనగలు.. ఈ రెండూ కూడా అద్భుతమైన ప్రోటీన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇవి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. మన గుండె ఆరోగ్యానికి అవసరమైన, ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్షణగా నిలుస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి వీటిని కాపాడుతాయి. మిమ్మల్ని కాపాడుతాయి. కొమ్ము శనగలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. బరువును తగ్గించుకోవడం కోసం వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. కాబట్టి వేరుశనగలు, కొమ్ము సెనగలు రెండింటిని తినడం అలవాటు చేసుకోవాలి.
కొమ్ము శెనగలు లేదా వేరుశనగలు… వీటిని ఉడకబెట్టుకొని తింటే ఎంతో మంచిది. పచ్చివి తినడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఉడకబెట్టుకొని లేదా నానబెట్టుకుని తినడం వల్ల ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఇంకా మంచిది.
కొమ్ము శెనగలను స్నాక్స్ లా మార్చి అప్పుడప్పుడు తింటే ఎంతో మంచిది. వీటిని కేవలం పండగుల సమయంలో నైవేద్యంగా మాత్రమే వాడుతారు. వీటిని ఆహారంలో భాగం చేయడం వల్ల ప్రొటీన్, ఫైబర్ అధికంగా శరీరంలో చేరుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేసే ఆహారం ఇది. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల బరువు కచ్చితంగా తగ్గుతారు. ఇది పొట్టను ఎక్కువ సేపు ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. పొట్ట నిండిన ఫీలింగ్ ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. వేయించిన శనగల కన్నా వాటిని ఉడకబెట్టి, తాళింపు వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది.