EPAPER

Obesity Health Tips: అధిక బరువుతో అనారోగ్య సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Obesity Health Tips: అధిక బరువుతో అనారోగ్య సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Obesity Health Tips: అధిక బరువు.. ప్రస్తుతం ఇది సమస్యగా మారింది. వందల్లో తొంభై మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. మహిళలు 40 ఏళ్లు దాటిన తర్వాత బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్థూలకాయం లేదా అధిక బరువు పెరగడం ఆరోగ్యానికి హానికరం. మహిళలు సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో బరువు పెరుగుతుండగా.. పిల్లలు జంక్ ఫుడ్ అధికంగా తినడంతో అధిక బరువు పెరుగుతున్నారు. చిన్న పిల్లలు హై వాల్యూ జంక్ ఫుడ్ తినడంతో 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 5 నుంచి 17 ఏళ్ల వయస్సులోపు వారు 268 మిలియన్ల వరకు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


అనారోగ్య సమస్యలు

అధిక బరువుతో విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒక్కోసారి ప్రాణాలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కావున అధిక బరువు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడంతోపాటు జీవనశైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు. చిన్న పిల్లల్లో స్తీప్ ఆప్నియా, ఎముకలు, కీళ్లు, మూత్రపిండాల సమస్యలు రావొచ్చు. అధిక బరువుతో కొంతమందిలో కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేర్కొనే అవకాశం ఉంది. మహిళలు సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడికి గురికావడం, హార్మన్ల అసమతుల్యత ప్రధానకారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరుగుదలపై అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.


అధిక బరువుకు కారణాలివే..

మానవ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. సమయానికి భోజనం, నిద్ర సరిగ్గా లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. జింక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంతో అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. బిజీ లైఫ్ నేపథ్యంలో శారీరక వ్యాయామం లేదా వాకింగ్ లేకపోవడంతో స్థూలకాయం వస్తోంది. అధికంగా మెడిసిన్స్ వాడడంతో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. విపరీతమైన ఆకలితో అతిగా తినడంతో బరువు పెరిగే అవకాశం ఉంది.

Also Read: రోజంతా ఏసీలోనే ఉంటున్నారా ?.. ఎన్ని వ్యాధులు వస్తాయో తెలుసా..

జాగ్రత్తలు ఇవే..

మనిషి శరీరానికి ఎంత కేలరీలు అవసరమో అంతే తీసుకోవాలి. శరీరం ఫిట్‌గా ఉండాలంటే 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర తగినంత ఉంటే కండరాలకు పూర్తి స్థాయిలో విశ్రాంతి లభిస్తుంది. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతోంది. అలాగే జీవక్రియ వేగవంతం కావడంతో అధిక బరువు సమస్య దూరం కానుంది. అలాగే ప్రతిరోజూ 20 నిమిషాలు వాకింగ్ చేయాలి. అన్నం తగ్గించి పండ్లు తినడంతో శరీరం ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. యాపిల్, తృణ ధాన్యాలు, జామ, అరటి, బీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా స్వీట్స్ లేదా చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. చక్కెర శాతం తగ్గిస్తేనే శరీరంలో కొవ్వు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. వీటిని 90 రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే బరువు తగ్గే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×