EPAPER

Potato Puri: మైదా పూరీ, గోధుమ పూరీనే కాదు ఓసారి ఆలూ పూరి ప్రయత్నించండి,ఇది క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది

Potato Puri: మైదా పూరీ, గోధుమ పూరీనే కాదు ఓసారి ఆలూ పూరి ప్రయత్నించండి,ఇది క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది
Potato Puri: అల్పాహారంలో ఎప్పుడూ మైదాతో చేసిన పూరీని లేదా గోధుమ పిండితో చేసిన పూరీని తింటున్నారా? ఒకసారి బంగాళదుంపలతో చేసిన ఆలూ పూరి ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే క్రిస్పీగా క్రంచిగా వస్తుంది. నిజానికి మైదాతో చేసిన పూరీ ఆరోగ్యకరమైనది కాదు. గోధుమపిండితోనే పూరీలు చేసుకోవాలి. ఇక్కడ మేము చెప్పినట్టు బంగాళదుంపలతో చేసే పూరీ ఒకసారి ప్రయత్నించండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది, కొత్తగా కూడా ఉంటుంది. ఈ బంగాళదుంప పూరిని వెజ్ కుర్మాతో తింటే రుచి అదిరిపోతుంది. అలాగే చికెన్ కర్రీ తో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఎలా తినాలన్నది మీ ఇష్టమే.


ఆలూ పూరీ రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి – రెండు కప్పులు
బంగాళాదుంపలు – రెండు
నూనె – సరిపడినంత
పసుపు – పావు స్పూను
కారం – పావు స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా

Also Read: 40 ఏళ్లలో కూడా 20 ఏళ్ల లాగా కనిపించాలంటే.. ప్రతి రోజు ఇవి తినాల్సిందే !

ఆలూ పూరీ రెసిపీ
1. బంగాళదుంపలను ముందుగానే ఉడికించి తొక్క తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
2. చేత్తోనే ఆ బంగాళదుంపలను మెత్తగా మెదుపుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమపిండిని వేయాలి.
4. ఆ గోధుమ పిండిలోనే బంగాళదుంప ముద్దను పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
5. కలుపుతున్నప్పుడే రెండు స్పూన్ల నూనె కూడా వేయాలి.
6. ఈ మొత్తం మిశ్రమాన్ని పూరీ పిండిలాగా కలుపుకోవాలి. కావలసినంత నీటిని వేసుకోవాలి.
7. అలా ఇది చపాతీ పిండిలా కలిపాక పైన మూత పెట్టి పావుగంట పాటు పక్కన పెట్టేయాలి.
8. ఆ తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
9. ఈ లోపు పూరీ పిండి లోంచి చిన్న ముద్దను తీసి పూరీలా ఒత్తుకోవాలి.
10. దీన్ని వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే క్రిస్పీ ఆలూ పూరి రెడీ అయిపోతుంది.
11. ఇందులో మనం ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడాము.
12. కాబట్టి ఎన్ని తిన్నా పర్వాలేదు. మైదాపిండిని వాడకపోవడమే అని విధాలా ఉత్తమం.


ఈ ఆలు పూరీని ఎగ్ కీమా, చికెన్ కీమా, వెజ్ కుర్మా వంటి వాటితో తింటే రుచి అదిరిపోతుంది. అప్పుడప్పుడు కొత్తగా ఏదైనా తినాలనిపిస్తే ఈ ఆలూ పూరీలను ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతాయి. ముఖ్యంగా పిల్లలకు ఇవి నచ్చే అవకాశం ఎక్కువ. బంగాళాదుంపలతో చేసిన ఆహారాలు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. బంగాళాదుంపల్లో విటమిన్ సి, రిబోఫ్లైవిన్, కార్బోహైడ్రేట్లు, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవే. చికెన్ వండుకున్నప్పుడు ఇలా ఆలూ పూరీ వండుకుని చూడండి, ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది.

Related News

Street Food: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా? ప్రాణాలు పోతాయ్.. హెచ్చరిస్తున్న డాక్టర్స్

Soda Drinks: సోడాలంటే మీకు ఇష్టమా? ఇక వాటిని మరిచిపోతే మంచిది, లేకుంటే ప్రాణానికి ప్రమాదం కావచ్చు

Quiet Love: ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని నిశ్శబ్దంగా ప్రేమిస్తే అతడిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి

Gun Powder: ఇడ్లీ, దోశెల్లోకి గన్ పౌడర్ ఇలా చేసి పెట్టుకుంటే రెండు నెలలు తాజాగా ఉంటుంది

Night Skincare Routine: రాత్రి పూట ప్రతి రోజు వీటిని ముఖానికి రాస్తే.. గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ

Grapes Vs Raisins: ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఈ రెండింటిలో ఏది బెటర్ ? ఎవరు, ఎప్పుడు తినాలో తెలుసా..

Alum For Skin: పటికను వాడే బెస్ట్ మెథడ్ ఇదే.. ఎలాంటి చర్మ సమస్యలైనా పరార్

×