EPAPER

ENT Health : ముక్కు, గొంతు, చెవులు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ENT Health : ముక్కు, గొంతు, చెవులు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి!

ENT Health


Best Habits to Keep ENT Health : ప్రస్తుత 5జీ కాలంలో చాలా మంది టెక్నాలజీతో వారి జీవితాన్ని పరుగుల పెట్టిస్తున్నారు. అంతేకాకుండా మారుతున్న ఆహారపు అలవాట్లు శరీరంలోని ప్రతి భాగంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. దీని కారణంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందువల్ల వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు నిపుణులు.

ఇందుకోసం పలు జీవనశైలి అలవాట్లను కూడా సూచిస్తున్నారు. వాటిని ఫాలో అయ్యారంటే ఈ మూడు భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Read More : ఇయర్ బడ్స్ వాడుతున్నారా? ..అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాలి!

చెవుల ఆరోగ్యం 

  • ఈ రోజుల్లో పాటలు వినడానికి ఎక్కువ మంది ఇయర్​బడ్స్, ఇయర్​ఫోన్స్, బ్లూటూత్ వంటివి వినియోగిస్తున్నారు.
  • ఇవి చెవులకు మంచిది కాదనే విషయాన్ని గుర్తించాలి.
  • వీలైతే వాటిని ఉపయోగించకపోవడమే బెటర్.
  • ఎందుకంటే అవి చెవులకు నష్టం కలిగించి వినికిడి లోపం వచ్చేలా చేస్తాయి.
  • చెవుల్లో గుబిలి తీసుకునేందుకు చాలా మంది ఎక్కువగా పిన్నీసులు వంటి వస్తువులను వావుతుంటారు.
  • అలా చేయడం చెవుల ఆరోగ్యానికి మంచిది కాదు.
  • ఆ విధంగా చేయడం ఇయర్ డ్రమ్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
  • చెవలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. చెవిలో నీరు లేదా ఇతర ద్రవాలు వేయకూడదు.
  • ఇలా చేయడం వల్ల చెవులు మూసుకుపోయే ప్రమాదం ఉంది.
  • చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే పెద్ద శబ్దాలకు దూరంగా ఉండాలి

ముక్కు ఆరోగ్యం

  • శ్వాస వ్యాయామాలు మీ మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనవి.
  • ఇవి మీరు దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడతాయి.
  • ముక్కు మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా చూడాలి.
  • ముక్కుపై ఎక్కువ ఒత్తిడి పడితే రక్తస్రావానికి దారి తీయవచ్చు.
  • డస్ట్ అలర్జీ ఉన్నట్లయితే దుమ్ము, పొగ మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
  • బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించండి.

గొంతు ఆరోగ్యం

  • గొంతు ఆరోగ్యంగా ఉండాలంటే చల్లటి గాలి లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి.
  • చలి వాతావరణంలో తిరుగుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
  • చలి గాలి గొంతులో చొరబడకుండా మఫ్లర్ ఉపయోగించాలి.
  • బిగ్గరగా అరవడం, కేకలు వేయడం గొంతు ఆరోగ్యానికి మంచిది కాదు.
  • స్వర పేటికకి తగిన విశ్రాంతి ఇవ్వాలి. లేదంటే గొంతు దెబ్బతినే ఛాన్స్ ఉంది.
  • గొంతు అనేది గాయకులు, ఉపాధ్యాయులకు చాలా ముఖ్యమైనది.
  • నూనెలో వేయించినవి, చల్లని ఆహారాన్ని తినడం గొంతుపై ప్రభావం చూపుతుంది.
  • బర్నింగ్ సెన్సేషన్, పొడి దగ్గు వల్ల కొన్ని సార్లు మీ వాయిస్ మారొచ్చు.

Disclaimer : ఈ కథనాన్ని వివిధ వైద్య అధ్యయనాలు, పలు మెడికల్ జర్నల్స్ ప్రకారం అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×