EPAPER

Open Pores Treatment: ఓపెన్ పోర్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఫేస్ ప్యాక్‌లను ట్రై చేయండి..!

Open Pores Treatment: ఓపెన్ పోర్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఫేస్ ప్యాక్‌లను ట్రై చేయండి..!

Natural Home Remedies for Open Pores: ముఖరంధ్రాలు అమ్మాయిలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్య. ఈ రంధ్రాలు ఉండటం వలన చర్మంపై అదనపు నూనెలు విడుదల చేస్తాయి. తద్వారా ముఖం జిడ్డుగా, ఆయిల్ స్కిన్ గా కనిపిస్తుంది. వీటిని తగ్గించుకోవడం కోసం అమ్మాయిలు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలామంది ఓపెన్ పోర్స్‌ని తొలగించేందుకు మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్  వాడుతుంటారు. వీటి వల్ల వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఓపెన్ పోర్స్ అనేది ఒత్తిడి వలన, డీహైడ్రేషన్ వలన, పోషకాహార లోపం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. వీటిని తొలగించేందుకు మన ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో  ఈ టిప్స్ పాటిస్తే ఓపెన్ పోర్స్ తగ్గిపోయి చర్మం సాధారణంగా, అందంగా మారిపోతుంది.


రోజ్ వాటర్- ముల్తాని మట్టి
రోజ్ వాటర్ స్కిన్ టోన్ ని మెరుగుపరచడంలో ఓపెన్ పోర్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ముల్తాని మట్టి జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది. ముల్తాని మట్టిని తీసుకొని అందులో రోజ్ వాటర్‌ని కలపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 10 నిముషాలు ఉంచాలి. ఆతర్వాత సాధారణ నీటితో కడిగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖంపై రంధ్రాలు తొలగిపోతాయి.

టమోటా ఫేస్ ప్యాక్
టమోటాలో విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ , లైకోపీన్, అనే కణాలు అధికంగా ఉంటాయి. ఇవి ముఖంపై జిడ్డు చర్మాన్ని తొలగిస్తాయి. టమోటా గుజ్జుని తీసుకొని ముఖంపై అప్లై చేసి 15 నిముషాలు పాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


తేనె, పంచదార, నిమ్మకాయ ఫేస్ ప్యాక్
తేనెలో యాంటీబాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ముఖ రంధ్రాలు తొలగించడంలో సహాపడతాయి. అలాగే నిమ్మకాయలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది. పంచదార ముఖంపై ఉన్న మురుకిని తొలగిస్తుంది. ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్లు చక్కెర, కొంచె తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత కొంచెంసేపటికి సాధారణనీటితో శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒకసారి చేస్తే ఓపెన్ పోర్స్ తగ్గిపోతాయి.

Also Read: తరుచుగా చికెన్ తింటున్నారా.. ఇక మీ పని అంతే !

ఓట్ మీల్ -పెరుగు ఫేస్ ప్యాక్
ఓట్ మీల్ ఫేస్ ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగించడంలో తోడ్పడుతుంది. అలాగే పెరుగులో కూడా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి రంధ్రాలను బిగుతుగా చేసి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కోసం రెండు స్పూన్ ల ఓట్స్‌లో ఒక చెంచా పెరుగును కలిపి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఫేస్ పై ఈ పేస్ట్ ని అప్లై చేసి 10- 15 నిముషాలు ఉంచి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై రంధ్రాలు, జిడ్డు చర్మం తొలగిపోతుంది.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×