EPAPER
Kirrak Couples Episode 1

Country Chicken Curry: విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ వండారంటే రుచి మామూలుగా ఉండదు, ట్రై చేయండి

Country Chicken Curry: విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ వండారంటే రుచి మామూలుగా ఉండదు, ట్రై చేయండి

Country Chicken Curry: నాటుకోడి కర్రీ పేరు చెబితేనే నోరూరిపోతుంది. దీన్ని విలేజ్ స్టైల్లో వండారంటే రుచి మాములుగా ఉండదు. సాధారణ బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే ఇళ్లల్లో పెంచే నాటు కోళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి సేంద్రీయ పద్ధతిలో పెరుగుతాయి. కాబట్టి నాటుకోడి తినడం చాలా ముఖ్యం. బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే నాటు కోళ్లు ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఎక్కువ మంది దీన్ని వండలేక పక్కన పెట్టేస్తారు. నిజానికి ఇది రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి అప్పుడప్పుడు నాటుకోడి కర్రీని తింటూ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో వండే పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాదు రుచికరంగా కూడా ఉంటుంది. విలేజ్ స్టైల్లో నాటుకోడి కర్రీ ఎలా వండాలో తెలుసుకోండి.


నాటుకోడి కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు
నాటుకోడి చికెన్ ముక్కలు – కిలో
కారం – ఐదు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయలు – మూడు
జీలకర్ర – ఒక స్పూను
ధనియాలు – రెండు స్పూన్లు
పసుపు – ఒక స్పూను
మిరియాలు – నాలుగు
లవంగాలు – ఏడు
షాజీరా – అర స్పూను
యాలకులు – ఐదు
దాల్చిన చెక్క – పెద్ద ముక్క
గసగసాలు – రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
పసుపు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత

Also Read: ఏ ఆహార పదార్థాల్లో జంతువుల కొవ్వు ఉంటుందో తెలుసా ?


నాటుకోడి కర్రీ రెసిపీ
1. నాటుకోడి టేస్టీగా ఉండాలంటే దీనికోసం ప్రత్యేకమైన మసాలాను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి ఎండు కొబ్బరి ముక్కలను వేయించాలి.

3.  తర్వాత గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, మిరియాలు వేసి వేయించుకోవాలి.
4. స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
5. కాస్త నీరు వేస్తే ఇది పేస్టులాగా తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి.
7. కుక్కర్లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.
8. అవి రంగు మారే వరకు వేయించాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించుకోవాలి.
9. నాటుకోడి ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
10. ఈ మిశ్రమంలో ముందుగా తయారుచేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
11. తర్వాత మూత తీసి కారం వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ధనియాలపొడి, జీలకర్ర వేసి బాగా కలపాలి. అవసరమైనంత నీరు వేసుకోవాలి.
12. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
13. ఆవిరిపోయాక మూత తీయాలి. అది ఇగురులా కాకుండా పులుసులాగా అనిపిస్తే మళ్లీ స్టవ్ వెలిగించి ఆ నీళ్లు ఇంకెవరకూ ఉడికించుకోవాలి.
14. ఆ తర్వాత పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ నాటుకోడి కర్రీ రెడీ అయినట్టే.
15. ఇది వండుతున్నప్పుడే ఘుమఘుమలాడిపోతుంది. బగారా రైస్ తో లేదా ప్లెయిన్ పులావ్‌తో ఈ నాటుకోడి కర్రీ తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకొని చూడండి, మీకు నచ్చడం ఖాయం.

Related News

Popping pimples Side Affects: మొటిమలను గిల్లితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రమాదం.. మీ అందం కాపాడుకోండిలా..

Homemade Beauty Tips: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. క్షణాల్లో మీ ముఖం మెరిసిపోవడం ఖాయం.

Animal Fat: ఏ ఆహార పదార్థాల్లో జంతువుల కొవ్వు ఉంటుందో తెలుసా ?

Homemade Hair Oils: ఈ ఆయిల్స్‌తో జుట్టు పెరగడం పక్కా !

Cucumber Juice: దోసకాయ జ్యూస్‌‌తో సమస్యలన్నీ పరార్ !

Turmeric For Skin: ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు.. మెరిసిపోతారు

Big Stories

×