EPAPER

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Multani Mitti Face Pack: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందుకోసం చాలా ఖర్చు చేసి ఫేస్ ప్రొడక్ట్స్ కొనే వారు కూడా లేకపోలేదు. అయితే రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వాడకుండా ఇంట్లోనే ముల్తానీ మిట్టితో ఫేస్ ప్యాక్స్ తయారు చేసి వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముల్తానీ మిట్టితో ముఖం అందంగా మారుతుంది.


ముఖంపై మెరుపును తీసుకురావడానికి మనం అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తాము. ముల్తానీ మిట్టి సహజమైన మట్టి, ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరచడమే కాకుండా సహజమైన మెరుపును కూడా తెస్తుంది.

1. గ్లోయింగ్ స్కిన్ కోసం ముల్తానీ మిట్టి ప్యాక్..
కావలసినవి :
ముల్తానీ మిట్టి -2 స్పూన్లు
రోజ్ వాటర్ -1 టీస్పూన్
నిమ్మరసం -1 టీస్పూన్


తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ , నిమ్మరసం కలిపి మిశ్రమం లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై జిడ్డు తొలగించి, శుభ్రంగా మెరుస్తూ కనిపించేలా చేస్తుంది.

2. డ్రై స్కిన్ కోసం ముల్తానీ మిట్టి ప్యాక్..
కావలసినవి:
ముల్తానీ మిట్టి -2 స్పూన్లు
పాలు -1 చెంచా
తేనె -1 టీస్పూన్

తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో ముల్తానీ మిట్టి, పాలు, తేనె కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. తేనె , పాలు చర్మానికి తేమను అందిస్తాయి. పొడి చర్మాన్ని కూడా మృదువుగా మెరిసేలా చేస్తాయి. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల ముఖం అందంగా మారుతుంది.

3. స్మూత్ స్కిన్  కోసం ముల్తానీ మిట్టి ప్యాక్..

కావలసినవి:
ముల్తానీ మిట్టి -2 స్పూన్లు
పెరుగు -1 చెంచా
పసుపు -1/2 టీస్పూన్

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ లో పైన మోతాదుల్లో ఈ మూడు పదార్థాలను కలిపి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత 15-20 నిమిషాలు ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

Also Read: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

4. మచ్చల కోసం ముల్తానీ మిట్టి ప్యాక్..
కావలసినవి:
ముల్తానీ మిట్టి -2 స్పూన్లు
టమోటా రసం -1 టీస్పూన్
పుదీనా రసం – 1 టీస్పూన్

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ లో పైన చెప్పిన మోతాదుల్లో ముల్తానీ మిట్టిలో టొమాటో , పుదీనా రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మచ్చలను తగ్గించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముఖం అందంగా కనిపించేలా చేస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×