EPAPER

Mpox in Hyderabad: భయపెడుతున్న ఎంపాక్స్ వైరస్.. హైదరాబాద్‌కు ముప్పు?

Mpox in Hyderabad: భయపెడుతున్న ఎంపాక్స్ వైరస్.. హైదరాబాద్‌కు ముప్పు?

Mpox in Hyderabad and Mpox Symptoms: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ భయంకరమైన వైరస్ వల్ల ప్రపంచ దేశాలు విలవిలలాడిపోయాయి. ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయి. ఒక్క రంగం అని కాదు.. ప్రతి రంగంపైనా ఈ కరోనా ఎఫెక్ట్ కనబడింది. అంతేకాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో ప్రజలు కరోనా అంటేనే కొంతమేరకు వణికిపోతుంటారు. ఎందుకంటే.. అది ఆ విధంగా పంజా విసిరింది. ప్రపంచాన్నే కకావికలం చేసింది.


అయితే, కరోనాతోనే ప్రజలు ఇబ్బందులు పడ్డారంటే మరో భయంకరమైన వైరస్ జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ వైరస్ సోకిందంటే ఏకంగా ప్రాణాలు కోల్పోవడమే. ఈ వైరస్ కరోనా కన్నా డేంజర్ అని చెబుతున్నారు. ఆఫ్రికాలో ప్రస్తుతం ఎంపాక్స్(Mpox) విజృంభిస్తుంది. అక్కడి ప్రజలు ఈ వైరస్ బారిన భారీగా ప్రాణాలను కోల్పోతున్నారు. దీనిపై అలర్టైన ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్ఓ(WHO) హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు దీనిపై అలెర్ట్ గా ఉండేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది.

Also Read: బంగ్లాదేశ్‌ సంక్షోభం.. టార్గెట్ హిందూవులేనా?


అయితే, ఈ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో అఫ్రికన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారని, చదువు, ఇతర పనుల నిమిత్తం ఆఫ్రికా దేశాల నుంచి ఇక్కడి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ హైదరాబాద్ కు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఎంపాక్స్ వైరస్ గురించి..

ఈ వైరస్ ను మంకీపాక్స్ వైరస్ అని కూడా అంటారు. ఆఫ్రికాలో ఇప్పటివరకు 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో 460 మంది ఎంపాక్స్ బారిన పడి మృత్యువాతపడ్డారు. ఆఫ్రికా దేశాలు ఈ వైరస్ వల్ల గజగజ వణికిపోతున్నాయి. ఈ వైరస్ ను 1958లో కోతులలో గుర్తించారని, 1970లో కాంగోలో ఈ వ్యాధి ఓ మనిషికి సోకినట్లు పలు జాతీయ వార్తా పత్రికలు పేర్కొంటున్నాయి. అయితే, ఎంపాక్స్ వైరస్ లక్షణాలు స్మాల్ పాక్స్ మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు. కరోనా వైరస్ మాదిరిగా ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరి వ్యాపించదు. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి మరొకరిని ముట్టుకున్నా లేదా ముఖ్యంగా సెక్సువల్ గా కలిస్తే ఈ వైరస్ సోకుతుందని చెబుతున్నారు. ఈ వైరస్ బారినపడిన వారితో శారీరకంగా కలవొద్దని, కొత్తవారితో శారీరక సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఆ సమయంలో పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలా తీసుకుంటే ఈ వైరస్ ను మరొకరికి సోకకుండా బ్రేక్ చేయొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నట్లు అందులో పేర్కొన్నారు.

Also Read: పాకిస్థాన్‌లో ముగ్గురికి మంకీపాక్స్‌ పాజిటివ్.. భయాందోళనలో పొరుగు దేశాలు.. లక్షణాలు ఇవే!

ఎంపాక్స్ లక్షణాలు…

శరీరంపై బొబ్బలు, దురద వంటివి ఏర్పడటం. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లంతా నొప్పులు, శరీరం మొత్తం నీరసంగా ఉండడం. ఈ లక్షణాలు కనిపిస్తే వారు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఎంపాక్స్ వైరస్ రెండు రకాలు..

ఈ వైరస్ రెండు రకాలుగా విభజించారు. మొదటిది ఎంపాక్స్ క్లౌడ్ 1, రెండోది ఎంపాక్స్ క్లౌడ్ 2. క్లౌడ్ 1 విషయంలో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ, క్లౌడ్ 2 విషయంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆఫ్రికన్ దేశాల్లో భారీగా ఈ రెండో రకం వైరస్ బారిన పడే మృత్యువాతపడుతున్నారు. చిన్న పిల్లల సైతం ఈ వైరస్ బారిన పడి మృతిచెందినట్లు అందులో పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఎక్కువ ఈ వైరస్ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ వైరస్ ఒకరినుంచి మరొకరి చాలా తేలికగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.., 2022లో కూడా ఆఫ్రికన్ దేశాల్లో ఈ వైరస్ విజృంభించింది. ఆ సమయంలో కూడా డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×