EPAPER

Food Packaging : ఫుడ్ ప్యాకెట్‌ పై ధరతో పాటు ఇవి చూడండి..!

Food Packaging : ఫుడ్ ప్యాకెట్‌ పై ధరతో పాటు ఇవి చూడండి..!

food packaging


 

Food Packaging Information : మనం నిత్యం సూపర్ మార్కెట్, కిరాణా దుకాణాల్లో అనేక రకాలైన వస్తువులు కొనుగోలు చేస్తుంటాము. అందులో కొబ్బరి నూనె, గోధుమ పిండి లేదా మ్యాగీ ప్యాకెట్ ఉండొచ్చు. ఇవి కొనుగోలు చేసే ముందు దానిపై ధర, ఎక్స్‌పైరీ డేట్ మాత్రమే చూస్తాం. చాలామంది ఇవి కూడా చూడరు. కానీ వాటిపై చాలా విషయాలు రాసుంటాయి. వాటిని అసలు గమనించము. ప్యాకెట్ ఖాళీగా ఉన్నా, దాని లోపల చెత్తాచెదారం ఉన్నా పట్టించుకోము. అయితే వెనుకు ఉండే వాటిని ఎందుకు చూడాలో తెలుసుకుందాం..


ప్యాకెట్ వెనుకు దానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. దాన్ని సరిగా చదవడం మీకు తెలిస్తే.. అది కొనాలా? వద్దా ? తెలుస్తుంది. కంపెనీలు ఆ ప్యాకెట్ రాసే సమాచారాన్ని కస్టమర్లకు అర్ధమయ్యేలా ముద్రిస్తుంది. ప్యాకెట్ మీద ఇచ్చిన పోషకాల సమాచారాన్ని చూడటం ద్వారా అందులోని ఆహార పదార్థం నాణ్యతను అంచనా వేయొచ్చు.

READ MORE : మాంసం బియ్యం.. ఇవి తింటే మాంసం తిన్నట్లే..!

ఏదైనా ఆహార ప్యాకెట్‌ కొనేముందు అందులో కాస్త విటమిన్లు, ఖనిజాలు ఉంటే దాన్ని ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అలానే అందులోని మిగతా అంశాలకూడా ఆరోగ్యానికి హానికరం కాకపోతే దాన్ని మంచి ఆహార పదార్థంగా పరిగణిస్తాం. ఒక వ్యక్తి డైట్‌ను 2 వేల కిలో క్యాలరీలుగా భావించి దేశంలో ఆహార పదార్థాల డబ్బాలు, ప్యాకెట్లపై ఫుడ్ లేబులింగ్‌ను వేస్తారు. దీన్నే ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఆహార ప్యాకెట్ మీద రెకమెండెడ్ డైటరీ అలవెన్స్ నిర్ణయిస్తారు.

దేశంలో ఫుడ్ లేబులింగ్ ప్రమాణాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ధేశిస్తుంది. ఈ సంస్థ లేబులింగ్ నిబంధనలను నిర్ణయిస్తుంది. వాటి పర్యవేక్షణ కూడా దీనిదే బాధ్యత. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రకారం.. ఒక ఆరోగ్యకర వ్యక్తికి సరిపడేలా నిర్దేశించిన పోషకాల స్థాయిని రెకమెండెడ్ డైటరీ అలవెన్సు అని పిలుస్తారు. దీని ప్రకారం కార్బోహైడ్రేట్ల రెకమెండెడ్ డైటరీ అలవెన్స్ రోజుకు 130 గ్రాములు.

ఉదాహరణకు మీరు ప్రాసెస్ చేసిన వేరుశెనగలను 30 గ్రాముల ప్యాకెట్ తిన్నారని అనుకుందాం. లేబుల్ ప్రకారం ఇది 24 శాతం కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఇది రోజువారీ ఆర్‌డీఏలో దాదాపు 18 శాతం. ఇదే మీరు 100 గ్రాములు తీసుకున్నారంటే రోజుకు మీ పిండి పదార్థాలలో 80 శాతం తిన్నారని భావించాలి. ఇతర పదార్థాలు తిన్నప్పుడు రోజుకు మీ కార్బోహైడ్రేట్ పరిమితిని మించిపోతారని గుర్తుంచుకోండి.

ప్యాకెట్ వెనుక మీకు ‘సర్వింగ్ సైజ్’ అనే లేబుల్ కనిపిస్తుంది. మిగతా సమాచారం అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. 100 గ్రాములు ప్రామాణికంగా తీసుకొని ఫుడ్ ప్యాకెట్ లేబుల్ మీద పోషకాల జాబితా ముద్రిస్తారు. మీరు దీన్ని మించి పోషకాలు తీసుకుంటే ఎక్కువ పోషకాలు శరీరంలోకి చేరుతున్నాయని అర్థం.

ప్యాకెట్ లోపల ఉండే పదార్థాలన్నీ లేబుల్ మీద అవరోహణ క్రమంలో రాసి ఉంటుంది. ఆహారంలో ఎక్కువ మొత్తంలో ఉండే పదార్థాన్ని అన్నింటికంటే పైన రాస్తూ.. తక్కువగా ఉండే పదార్థాన్ని కింద ముద్రిస్తారు. ప్రతి ఫుడ్ ప్యాకెట్‌పై ఇవి కచ్చితంగా రాయాలి. ముఖ్యంగా నాలుగు పదార్థాల మీద మీరు బాగా శ్రద్ధ పెట్టాలి. ఇందులొ టోటల్ ఫ్యాట్, సాచ్యురేటెడ్ ఫ్యాట్, సాల్ట్, సోడియం, షుగర్. ఎందుకంటే ఈ పదార్థాలన్నీ బరువు, బీపీల్లో మార్పులకు కారణం అవుతాయి. ఇవి స్ట్రోక్, గుండె జబ్బులు సమస్యలను పెంచుతాయి.

READ MORE : పెయిన్ కిల్లర్స్ ఎలా పని చేస్తాయో తెలుసా?.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే!

డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. 13 రకాల క్యాన్సర్లు, డయాబెటిస్, గుండె, ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు రావడంతో పాటు ఒక్కోసారి మరణానికి కూడా కారణం కావచ్చు. ఒక నివేదిక ఆధారంగా 2023లో ప్రపంచవ్యాప్తంగా 28 లక్షల మంది ఊబకాయంతో చనిపోయారు.

Disclaimer : ఈ సమాచారాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు పలు అధ్యయనాల ఆధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×