EPAPER

Microplastics In Salt and Sugar: మనం తినే ఉప్పు, చక్కెరలోనూ మైక్రో ప్లాస్టిక్స్ .. బయట పడ్డ షాకింగ్ విషయాలు!

Microplastics In Salt and Sugar: మనం తినే ఉప్పు, చక్కెరలోనూ మైక్రో ప్లాస్టిక్స్ .. బయట పడ్డ షాకింగ్ విషయాలు!

Microplastics found in Indian salt & sugar brands says new study: మార్ట్‌లో కావొచ్చు.. కిరాణ షాపుల్లో కావొచ్చు.. ఆన్‌లైన్‌ కావొచ్చు.. ఆఫ్‌లైన్‌ కావొచ్చు.. ఇలా ఎక్కడైనా కొనండి.. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. అవును.. ఇకపై సాల్ట్, షుగర్ ఎక్కడ కొన్నా ఆచితూచి అడుగులు వేయాల్సిందే. లేదంటే కొనుక్కొని మరీ రోగాలను ఇంటికి తెచ్చుకున్నట్టే.. ఎందుకంటే లెటెస్ట్‌గా రిలీజైన ఓ స్టడీలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


ప్రతి పేస్ట్‌లో ఉప్పు ఉందో లేదో తెలీదు కానీ ప్రతి ఉప్పు ప్యాకేట్‌లో మైక్రో ప్లాస్టిక్స్‌ మాత్రం పక్కాగా ఉన్నాయని తెలుస్తుంది. టాక్సిక్స్‌ లింక్‌ అనే ఓ సంస్థ తాజాగా స్టడీ నిర్వహించింది. తినే పదార్థాలపై స్టడీ చేస్తుంటే.. బ్రాండ్‌లతో సంబంధం లేకుండా.. అన్ని ఉప్పు, చక్కెర ప్యాకెట్లలో మైక్రో ప్లాస్టిక్స్‌ను గుర్తించారు. ప్యాకేజ్ట్, అన్ ప్యాకెజ్డ్, చిన్న ప్యాకెట్, పెద్ద ప్యాకేట్. ఐయోడైజ్‌డ్‌ సాల్ట్, టేబుల్ సాల్ట్, రాక్ సాల్ట్, సీ సాల్ట్.. ఇలా ఏదీ అన్న తేడా లేకుండా. ఎందెందు వెతికినా.. అందందు కలను అన్నట్టుగా ప్రతి దాంట్లో కనిపించాయంటా ఈ మైక్రో ప్లాస్టిక్స్.

ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ పరిమాణం ఎంతో తెలుసా.. 0.1 మిల్లీమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ వరకు.. అంటే కంటికి దాదాపుగా కనిపించవు. ముందు ఉప్పు సంగతి చూద్దాం. అయోడైజ్డ్ సాల్ట్.. మనం మరీ మరీ కోరి కొనే సాల్ట్ ఇదీ. అయితే ఈ సాల్ట్‌లోనే ఎక్కువగా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని తేలింది. కిలో ఉప్పులో 6.71 నుంచి 89.15 పీస్‌ల మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించారు. ఇందులో అయోడైజ్డ్ సాల్ట్‌లోనే ఎక్కువగా ఉంటే 89.15 పీస్‌ల మైక్రో ప్లాస్టిక్‌ ఉందని తేలింది. అదే రాక్ సాల్ట్ అంటే కళ్లుప్పులో అత్యంత తక్కువగా అంటే 6.71 పీస్‌ల మైక్రో ప్లాస్టిక్‌ ఉంది..


ఇక చక్కెర విషయానికి వస్తే.. కీలో చక్కెరలో అత్యల్పంగా 11.85 మైక్రోప్లాస్టిక్‌ పీస్‌లు ఉండగా.. అత్యధికంగా 68.25 మైక్రోప్లాస్టిక్ పీస్‌లు ఉన్నట్టు గుర్తించారు. అంటే మనకు తెలీకుండానే ఈ ప్లాస్టిక్‌ను తినేస్తున్నాం. యావరెజ్‌గా మనం డెయిలీ 10.98 గ్రాముల ఉప్పు. 10 స్పూన్ల చక్కెర తింటుంటాం.. నిజానికి ఇది చాలా ఎక్కువ. అదే పెద్ద ప్రమాదమంటే.. ఇప్పుడు వీటిలో కూడా మైక్రో ప్లాస్టిక్స్‌ కలవడం మరింత ప్రమాదకరం.

ఈ కంటికి కనిపించని మైక్రో ప్లాస్టిక్స్‌ మన హెల్త్‌కు చేసే చేటు అంతా ఇంతా కాదు. ఇవి మన బాడీలో చేరితో లంగ్స్‌, హార్ట్‌ రిలేటేడ్ ఇష్యూస్‌ వస్తాయి. చివరికి తల్లి పాలను కూడా హానికరంగా మార్చుతాయి. ఉప్పు, చక్కెర మాత్రమే కాదు.. మనం పీల్చే గాలిలోనూ, తాగే నీరులోనూ మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయని గతంలో అనేక స్టడీలు చెప్పాయి. ఇలా మన బాడీలోకి చేరిన మైక్రో ప్లాస్టిక్స్.. మెదుడలోకి చొచ్చుకుపోగలవు. ఇది అత్యంత ప్రమాదకరం.. ఇది మన మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి.అంతేకాదు ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా చాలా ప్రభావం చూపుతాయని కూడా తేలింది.

Also Read: తల్లికి షుగర్ ఉంటే.. బిడ్డకు పాలు

తాజాగా జరిపిన మరో స్టడీలో చాలా మంది రక్తంలో కూడా పాలిథిలీన్‌ టెరాఫ్తలేట్‌ ఉందని కనుగొన్నారు. ఇది నిజానికి మన ఇంట్లో వాడే ప్లాస్టిక్‌కు సంబంధించిన రసాయనం. వాటర్ ప్యాకెట్లు, కూల్‌డ్రింక్స్‌, ఫుడ్ ప్యాకేజీకి వాడుతారు ఈ పదార్థౄన్ని.. ఇలాంటి పదార్థం మనుషుల రక్తంలో కనిపిస్తుంది ఇప్పుడు. ఇదొక్కటే కాదు.. పాలీప్రొఫిలీన్, పాలిస్టిరీన్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిథిలీన్, పాలిథిలీన్ టెరాఫ్తలేట్. మనుషుల రక్తంలో మొత్తం ఐదు రకాల ప్లాస్టిక్స్‌ గతంలోనే గుర్తించారు. ఇవీ మన శరీరంలోకి ఎంట్రీ ఇవ్వగానే.. మైక్రోప్లాస్టిక్స్‌ వల్ల కణాలు చనిపోతాయి. శరీరంలోని కణాల రోగనిరోధక ప్రతిస్పందన తగ్గుతుంది. మైక్రో ప్లాస్టిక్స్‌ శరీరంలోని కణాల గోడను విచ్చిన్నం చేస్తాయి. శరీర కణం జన్యు నిర్మాణంలో మార్పులు చేస్తాయి. మైక్రోప్లాస్టిక్‌ పరిమాణంపై దాని ఎఫెక్ట్ ఆధారపడి ఉంటుంది. ఎఫెక్ట్‌ ఎంత ఎక్కువగా ఉంటే.. మనకు అన్ని ఇబ్బందులు అన్నట్టు.

సాధారణంగా ఉప్పులో ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ కనిపించడానికి అనేక కారణాలు చెబుతున్నారు. నిజానికి సముద్రాల్లో ఈ మధ్య ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇవి కనిపించకుండా ఉప్పు మళ్లలోకి చేరడం.. ఆ తర్వాత ప్యాక్‌ అయ్యి మన ఇంటికి రావడం జరుగుతుందన్నది ఓ వాదన..అదే సమయంలో కంపెనీల్లో ప్యాక్ అయ్యే సమయంలో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ కలుస్తున్నాయన్నది మరో వాదన.. ఇలా ఉప్పు, చక్కెర మాత్రమే కాదు.. మేకప్, టూత్‌ పేస్ట్ వంటి రోజువారీ ఉపయోగించే వాటి కారణంగా కూడా మైక్రో ప్లాస్టిక్స్‌ మన బాడీలోకి చేరుతున్నాయి..కాబట్టి.. ఇలాంటి విషయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో ప్రభుత్వాలు, కంపెనీలు కూడా తగిన చర్యలు తీసుకోవాలి.లేదంటే అనేక రోగాలు, వ్యాధులు విజృంభించడం ఖాయం.

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×